KTR Andhra Angle : మొన్న ఎన్టీఆర్ - ఇవాళ అల్లూరి ! టీఆర్ఎస్ వేడుకల వెనుక రాజకీయం ఉందా ?
ఎన్టీఆర్, అల్లూరి జయంతి వేడుకలను టీఆర్ఎస్ కూడా ఘనంగా నిర్వహిస్తోంది. దీని వెనుక రాజకీయ కోణం ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
![KTR Andhra Angle : మొన్న ఎన్టీఆర్ - ఇవాళ అల్లూరి ! టీఆర్ఎస్ వేడుకల వెనుక రాజకీయం ఉందా ? TRS is also grandly organizing NTR and Alluri Jayanti celebrations. KTR Andhra Angle : మొన్న ఎన్టీఆర్ - ఇవాళ అల్లూరి ! టీఆర్ఎస్ వేడుకల వెనుక రాజకీయం ఉందా ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/04/8c0c1268912225cc7047ea9cb3d588641656934633_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
KTR Andhra Angle : తెలంగాణ మంత్రి కేటీఆర్ ఇటీవలి కాలంలో గొప్పవాళ్లు ఎక్కడ పుట్టినా గొప్పవాళ్లే అంటున్నారు. అభినందించడానికి వేడుకలు జరపడానికి ఆయన సందేహించడం లేదు. తాజాగా మన్యం వీరు అల్లూరి సీతారామరాజు గురించి గొప్పగా చెప్పారు. వీరుడు దేశంలో ఎక్కడ పుట్టినా వీరుడే అని మంత్రి కేటీఆర్ అన్నారు. అల్లూరి సీతారామ రాజుని గుర్తుచేసుకోవడం భారతీయ పౌరుడి విధి అని చెప్పారు. అల్లూరి సీతారామా రాజు 125వ జయంతి సందర్భంగా ట్యాంక్‌బండ్‌పై నిర్వహించిన వేడులకు కేటీఆర్ హాజరయ్యారు. అల్లూరి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అ మన్యం వీరుడి జయంతి వేడుకలను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదని ప్రకటించారు.
స్వాతంత్ర్య సమరయోధుడు శ్రీ అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన మంత్రులు @KTRTRS, @VSrinivasGoud,@YadavTalasani pic.twitter.com/piG5LudZMm
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) July 4, 2022
అల్లూరి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని చెప్పిన బీజేపీ నేతలు
ఇటీవల బీజేపీ నేతలు అల్లూరి సీతారామరాజు నిజాంకు వ్యతిరేకంగా పోరాడారని చెప్పడంపై కేటీఆర్ ఫైరయ్యారు. చరిత్ర తెలియదని మండిపడ్డారు. ఈ సందర్భంగా పరోక్షంగా ఆ వివాదాన్ని ప్రస్తావంచారు. జల్ జంగల్ జమీన్ నినాదంతో కుమ్రం భీమ్ ఈ ప్రాంత గిరిజనుల హక్కుల కోసం నాటి నిజాం ప్రభువు పై తెగించి పోరాడారని చెప్పారు. అదేవిధంగా తెలుగుజాతిని ప్రభావితం చేసేలా అల్లూరి సీతారామరాజు ఆంగ్లేయులపై దీరోధాత్తంగా పోరాటం చేశారన్నారు. నగరంలోని ఖానామెట్‌లో అల్లూరి భవన నిర్మాణం కోసం మూడెకరాల భూమిని సీఎం కేసీఆర్ కేటాయించారని తెలిపారు.
ఎన్టీఆర్ జయంతినీ ఘనంగా నిర్వహించిన టీఆర్ఎస్
ఇటీవలికాలంలో టీఆర్ఎస్ నేతలు నందమూరి తారకరామారావునూ పొగుడుతున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇటీవల ఎన్టీఆర్ జయంతి సందర్భంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అందరూ ఎన్టీఆర్‌ను పొగడ్తంతో ముంచెత్తారు. ఇదంతా ఓటు బ్యాంక్ వ్యూహమని అప్పట్లో విశ్లేషణలు వచ్చాయి. అయితే కావొచ్చు కానీ అల్లూరి, ఎన్టీఆర్ వంటి వారిని ప్రభుత్వ పరంగా గౌరవించడం సముచితమని కొంత మంది వ్యాఖ్యానించారు.
హైదరాబాద్ పరిధిలో సెటిలర్లను ఆకట్టుకునే ప్రయత్నమా
భీమవరం రాజులు తనకు మంచి స్నేహితులని కేటీఆర్ సందర్భం వచ్చినప్పుడల్లా చెబుతూంటారు. అదే్ సమయంలో ఆయన పేరు కూడా స్వయంగా ఎన్టీఆర్. ఓటు ఈక్వేషన్లు మాత్రమే కాకుండా వ్యక్తిగతంగానూ అభిమానం ఉండటానికి ఇవి చాలని టీఆర్ఎస్ నేతలు కూడా విమర్శలకు కౌంటర్ ఇస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)