News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Munugode Bypoll: మునుగోడులో కాంగ్రెస్ కీలక ప్లాన్, ఆయన మద్దతు కోసం తహతహ - మరి ఆ వ్యక్తి ఒప్పుకుంటారా?

వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎన్నికలో కోదండరాంకు మంచి ఓట్లు రావడంతో.. ఆయన మద్దతు తీసుకుంటే మేధావులు, విద్యావంతులు తమ పార్టీకి ఓట్లు వేసే అవకాశం ఉంటుందని కాంగ్రెస్ నేతల ఆలోచనగా తెలుస్తోంది.

FOLLOW US: 
Share:

మునుగోడు ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో.. 6 నెలల లోపు ఎన్నికలు వచ్చే అవకాశం ఉండటంతో అన్ని పార్టీల దృష్టి మునుగోడుపై పడింది. ముఖ్యంగా ఇక్కడ గెలుపు కాంగ్రెస్ కు జీవన్మరణ సమస్య కావడంతో ఎలాగైనా ఇక్కడ గెలిచి తమ బలాన్ని నిరూపించుకోవాలని హస్తం పార్టీ ప్లాన్ చేస్తోంది. గెలుపు కోసం అన్ని అవకాశాలను ఉపయోగించుకోవాలని ఆలోచిస్తోంది. దీనిలో భాగంగా తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంతో కాంగ్రెస్ నేతలు ఈ సాయంత్రం సమావేశం కానున్నారు. మునుగోడులో ఉప ఎన్నిక జరిగితే తమకు మద్దతు ఇవ్వాలని కోరే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. 

గతంలో వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గంలో కోదండరాంకు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఓట్లు రావడంతో.. ఆయన మద్దతు తీసుకుంటే మేధావులు, విద్యావంతులు తమ పార్టీకి ఓట్లు వేసే అవకాశం ఉంటుందని కాంగ్రెస్ నేతల ఆలోచనగా తెలుస్తోంది. కాంగ్రెస్ విజ్ఞప్తిపై కోదండరాం ఎలా స్పందిస్తారనేది వేచి చూడాల్సి ఉంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహరాల ఇన్ ఛార్జి మాణిక్యం ఠాగూర్ తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఈ రోజు హైదరాబాద్ వచ్చిన ఆయన రేపు మునుగోడు ఉప ఎన్నికల స్ట్రాటజీ కమిటీతో భేటీ అవుతారు. ముఖ్యంగా అసమ్మతి నేతలను బుజ్జగించేందుకు ఆయన వచ్చినట్లు తెలుస్తోంది. 

ఇప్పటికే తెలంగాణ ఇంటి పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడంతో ఆ పార్టీ నేత చెరకు సుధాకర్ మునుగోడు టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. చెరకు సుధాకర్ కు టికెట్ ఇస్తే ఎప్పటినుంచో పార్టీలో ఉన్నవారి నుంచి అసంతృప్తి వ్యక్తం అయ్యే అవకాశం ఉండటంతో ఇప్పటి నుంచే అసమ్మతి నేతలను బుజ్జగించే పనిలో కాంగ్రెస్ పడింది. సొంత పార్టీ నేతల అసమ్మతితో కాంగ్రెస్ సతమతం అవుతోంది. కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అలక వీడకపోవడంతో ఆయనను బుజ్జగించేందుకు పార్టీ సీనియర్ నేతలు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నట్లు కనబడటం లేదు. చండూరు బహిరంగ సభలో కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ వ్యాఖ్యలపై ఆగ్రహంతో ఉన్న కోమటిరెడ్డి.. మునుగోడు ప్రచారంలో పాల్గొనబోననే సంకేతాలు ఇవ్వడంతో.. ఇటీవల టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఓ అడుగు వెనక్కి తగ్గి.. అద్దంకి దయాకర్ వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ గా బేషరతుగా క్షమాపణలు చెప్పారు. 

అయినా వెంకటరెడ్డి కూల్ అయినట్లు కనిపించడం లేదు. తెలంగాణ పర్యటనలో ఉన్న పార్టీ వ్యవహరాల ఇన్ ఛార్జి మాణిక్యం ఠాగూర్ మునుగోడు ఉప ఎన్నిక పైనే నాయకులతో ప్రధానంగా చర్చించనున్నారు. కాంగ్రెస్ లో ముగ్గురు నుంచి నలుగురు మునుగోడు సీటు ఆశిస్తుండంతో ఎవరికి అవకాశం దక్కుతుందనేది ఉత్కంఠ రేపుతోంది. మరోవైపు మునుగోడు ఉప ఎన్నికకు ముందు టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య మాటల దాడి మొదలైంది. బీజేపీకి అమ్ముడుపోయారంటూ మంత్రి జగదీశ్‌ రెడ్డి చేసిన ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి. ఆరోపణలు చేయడం కాదు.. దమ్ముంటే తాను అమ్ముడుపోయినట్టు నిరూపించాలని సవాల్‌ విసిరారు. అంతేకాదు జగదీశ్‌ రెడ్డి అవినీతి చిట్టా మొత్తం తన దగ్గర ఉందన్నారు రాజగోపాల్‌ రెడ్డి. విమర్శలు, ప్రతి విమర్శల నేపథ్యంలో మునుగోడు ఉప ఎన్నిక అంశం రాజకీయంగా కాకరేపుతోంది.

Published at : 17 Aug 2022 09:02 AM (IST) Tags: professor kodandaram Revanth Reddy Munugode Bypoll Telangana Congress news telangana Jana samiti Munugode latest updates

ఇవి కూడా చూడండి

Retired IPS Nageswara Rao: రిటైర్డ్ ఐపీఎస్‌ ఎం.నాగేశ్వరరావు మరో వివాదాస్పద ట్వీట్-ఇప్పుడు ఎవరిని టార్గెట్‌ చేశారంటే..

Retired IPS Nageswara Rao: రిటైర్డ్ ఐపీఎస్‌ ఎం.నాగేశ్వరరావు మరో వివాదాస్పద ట్వీట్-ఇప్పుడు ఎవరిని టార్గెట్‌ చేశారంటే..

మల్కాజ్ గిరి టికెట్ రేసులో మర్రి రాజశేఖర్ రెడ్డి, శంభీపూర్ రాజు!

మల్కాజ్ గిరి టికెట్ రేసులో మర్రి రాజశేఖర్ రెడ్డి, శంభీపూర్ రాజు!

తెలంగాణలో 70 స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులు ఫిక్స్, హైకమాండ్ కు జాబితా పంపిన స్క్రీనింగ్ కమిటీ

తెలంగాణలో 70 స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులు ఫిక్స్, హైకమాండ్ కు జాబితా పంపిన  స్క్రీనింగ్ కమిటీ

Joinings in Telangana Congress: కాంగ్రెస్‌లో చేరుతున్న కీలక నేతలు-ఢిల్లీ వేదికగా జాయినింగ్స్‌

Joinings in Telangana Congress: కాంగ్రెస్‌లో చేరుతున్న కీలక నేతలు-ఢిల్లీ వేదికగా జాయినింగ్స్‌

YSRCP : సమస్యల్లో టీడీపీ - పల్లెలకు వైసీపీ ! అధికార పార్టీ మాస్టర్ ప్లాన్

YSRCP :  సమస్యల్లో టీడీపీ - పల్లెలకు వైసీపీ ! అధికార పార్టీ మాస్టర్ ప్లాన్

టాప్ స్టోరీస్

TDP News : కర్నూలు టీడీపీలో కీలక మార్పులు - బైరెడ్డి చేరిక ఖాయమయిందా ?

TDP News :  కర్నూలు టీడీపీలో కీలక మార్పులు -  బైరెడ్డి  చేరిక ఖాయమయిందా ?

Ram - Virat Kohli Biopic : విరాట్ కోహ్లీ బయోపిక్‌లో రామ్ పోతినేని - హీరో ఏమన్నారో తెలుసా?

Ram - Virat Kohli Biopic : విరాట్ కోహ్లీ బయోపిక్‌లో రామ్ పోతినేని - హీరో ఏమన్నారో తెలుసా?

iPhone 15: 10 నిమిషాల్లో ఐఫోన్ 15 డెలివరీ - ఎక్కడ అందుబాటులో ఉంది? ఎందులో ఆర్డర్ చేయాలి?

iPhone 15: 10 నిమిషాల్లో ఐఫోన్ 15 డెలివరీ - ఎక్కడ అందుబాటులో ఉంది? ఎందులో ఆర్డర్ చేయాలి?

Mindspace Buildings Demolition: మాదాపూర్ మైండ్ స్పేస్ లో 2 భవనాలు క్షణాల్లో నేలమట్టం

Mindspace Buildings Demolition: మాదాపూర్ మైండ్ స్పేస్ లో 2 భవనాలు క్షణాల్లో నేలమట్టం