అన్వేషించండి

Telangana Assembly: అర్ధరాత్రి దాటినా కొనసాగిన తెలంగాణ అసెంబ్లీ.. అప్పులపై ధ్వజమెత్తిన డిప్యూటీ సీఎం బట్టి 

Deputy Cm Bhatti Vikramaraka : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా సాగుతున్నాయి. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన సమావేశాల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Telangana Assembly Session 2024: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా సాగుతున్నాయి. ప్రభుత్వ విధానాలపై ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తుండగా, అంతే స్థాయిలో అధికార పార్టీ కూడా ప్రతి స్పందిస్తోంది. ఆరోపణలు ప్రత్యారోపణలతో సభ వాడివేడిగా సాగుతోంది. ఈ క్రమంలోనే సోమవారం నిర్వహించిన శాసనసభ సమావేశాలు ఆసక్తికరంగా సాగాయి. ఉదయం 10 గంటలకు మొదలైన శాసనసభ అర్ధరాత్రి 1.30 గంటల వరకు కొనసాగింది. బడ్జెట్ పద్దులపై అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన చర్చలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న కీలక నిర్ణయాలపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అడ్డగోలు వ్యవహారాలపై ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యంగా అదనపు విద్యుత్ ఉత్పత్తి, బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులపై భట్టి విక్రమార్క తనదైన శైలిలో విమర్శలను గుప్పించారు. పదేళ్ల పాలనలో అదనపు విద్యుత్ ఉత్పత్తిని చేపట్టని భారతీయ రాష్ట్ర సమితి సర్కారు.. రాష్ట్రంపై మాత్రం అప్పులు భారాన్ని మోపిందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ ఉత్పాదన తమ ఘనతగా చెప్పుకొని రాష్ట్ర ప్రజలను తప్పుదారి పట్టించిందంటూ ఆరోపించారు. తమ ప్రభుత్వ హయాంలో విద్యుత్ ఉత్పత్తి సరఫరా మెరుగుపడినట్లు భట్టి విక్రమార్క చెప్పుకొచ్చారు. సామాజిక మాధ్యమాల ద్వారా కొందరు ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి ఆరోపించారు. యాదాద్రి విద్యుత్ ప్రాజెక్టు పేరుతో ఏటా 30 వేల కోట్ల రూపాయల భారాన్ని అప్పటి భారతీయ రాష్ట్ర సమితి ప్రభుత్వంపై మోపిందన్నారు. ప్రాజెక్ట్ నుంచి ఫ్లై యాస్ తరలించేందుకు సరైన రవాణా సౌకర్యం కల్పించలేని దుస్థితి ఏర్పడిందని, దీనివల్ల అనేక ఇబ్బందులు ఏర్పడుతున్నట్లు భట్టి ఈ సందర్భంగా సభలో వెల్లడించారు. 

భారతీయ రాష్ట్ర సమితి ఎందుకు చేతులెత్తేసింది ప్రశ్న..

యాదాద్రి విద్యుత్ ప్రాజెక్టుపై ఎన్జీటీ 2022లో నిషేధం విధించిందని, అప్పటి కెసిఆర్ (KCR) ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకుండానే చేతులెత్తేసిందని, దీనికి కారణం ఏమిటో చెప్పాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత ఆ ప్రాజెక్టును చక్కదిద్దేందుకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. విద్యుత్ రంగాన్ని నిర్వీర్యం చేసేందుకు అప్పటి సర్కారు ప్రయత్నించిందని విమర్శించారు. ఈ రంగం అభివృద్ధికి తమ ప్రభుత్వం అధిక కేటాయింపులు చేసిందని వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి గృహ జ్యోతిని అమలు చేస్తామని స్పష్టం చేశారు. బ్రాహ్మణ పరిషత్తుకు తగినన్ని నిధులు కేటాయిస్తామన్న భట్టి విక్రమార్క.. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు అర్హత నిష్పత్తిని 1:100 చేయాలన్న విజ్ఞప్తులు ప్రభుత్వం దృష్టికి వచ్చాయన్నారు. నోటిఫికేషన్ సమయంలోనే అర్హత ప్రాతిపదికను 1:50గా నిర్ణయించినందున ఎవరైనా కోర్టుకు వెళితే సమస్యలు ఎదురై పరీక్ష ఆలస్యమవుతుందన్న ఉద్దేశంతోనే తాము నిర్ణయం తీసుకోలేకపోతున్నామని భట్టి పేర్కొన్నారు. అయినప్పటికీ నిరుద్యోగులు నుంచి వస్తున్న విజ్ఞప్తులను పరిశీలించి దానిపై ఎలా ముందుకెళ్లాలి అన్న దానిపై నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్టు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తొలి 10 ఏళ్లలో ప్రభుత్వాన్ని నడిపి రాష్ట్రాన్ని అప్పుల మయంగా చేసిన భారతీయ రాష్ట్ర సమితి నేతలకు మాట్లాడే హక్కు లేదని బట్టి విక్రమార్క విమర్శించారు. ప్రభుత్వం చేస్తున్న మంచిని అభినందించాల్సిన అవసరం ఉందని, కానీ బీఆర్ఎస్ నేతలు ఆ దిశగా ఆలోచన చేయడం లేదంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆర్థికంగా మెరుగైన స్థితిలో ఉండాల్సిన తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత బీఆర్ఎస్ కే దక్కుతుందని విమర్శించారు.

టాప్ హెడ్ లైన్స్

Harish Rao: రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించకపోతే పరువు నష్టం దావాతో కోర్టుకు లాగుతా: హరీష్ రావు
రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించకపోతే పరువు నష్టం దావాతో కోర్టుకు లాగుతా: హరీష్ రావు
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
Telangana Politics Black Magic Allegations:తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Embed widget