అన్వేషించండి

బీఆర్‌ఎస్‌ తొలి లిస్ట్‌ సిద్ధం- ఒకట్రెండు రోజుల్లో విడుదల చేయనున్న కేసీఆర్!

తెలంగాణ రాజకీయాల్లో కీలక నిర్ణయాలు తీసుకోవడంలో కేసీఆర్‌ స్టైలే వేరు. ప్రత్యర్థి పార్టీలను పక్కన పెట్టి వ్యూహాలు రచించటంలో తానుకు తానే సాటి..ఆలోచనలతో విపక్ష పార్టీలను సులువుగా బోల్తా కొట్టించేస్తారు.

తెలంగాణ రాజకీయాల్లో కీలక నిర్ణయాలు తీసుకోవడంలో కేసీఆర్‌ స్టైలే వేరు. ప్రత్యర్థి పార్టీలను పక్కన పెట్టి వ్యూహాలు రచించటంలో తానుకు తానే సాటి..తన ఆలోచనలతో విపక్ష పార్టీలను చాలా సులువుగా బోల్తా కొట్టించేస్తారు. ఏదైనా విషయం ఉంటే కుండ బద్దలు కొట్టినట్లే మాట్లాడతారు. 

ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు అంటే ఆ నిర్ణయం అమలు అయ్యేంత వరకు ఎవరికి అర్థం కాదు కూడా. మరి కొద్ది నెలల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అందుకే ఆయన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు స్కెచ్‌ రెడీ చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే జిల్లాల వారీగా గట్టి అభ్యర్థుల మీద ఆయన ఫోకస్‌ పెట్టడమే కాదు...ఎవరైనా మార్చాల్సిన అభ్యర్థుల గురించి కూడా ఆయన పూర్తి క్లారిటీతో ఉన్నారు. 

వారం పది రోజుల నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు తొలి జాబితా రెడీ అయిపోయిందనే వార్తలు బాగా వినిపిస్తున్నాయి. అంతే కాకుండా ఓ జాబితా కూడా తెగ వైరల్‌ అవుతుంది. ఇప్పటికే 80 మందికి పైగా అభ్యర్థులతో కూడిన జాబితాను త్వరలోనే ప్రకటించి..ప్రత్యర్థులకు సవాల్‌ విసిరేలా కేసీఆర్‌ ఇప్పటికే ఆయన కసరత్తులు చేస్తున్నారు. 

ముహుర్తాలు, వాస్తు గట్టిగా నమ్మే కేసీఆర్‌ శ్రావణ మాసం ప్రారంభంలో ఆ జాబితాను విడుదల చేసే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. ఈ లిస్ట్ లో సీఎం కేసీఆర్, కేటీఆర్ పోటీ చేసే స్థానాలు కూడా ఉన్నాయి. చాలా వరకు సిట్టింగులకు అవకాశం కల్పించగా..కొన్ని చోట్ల కొత్త వారికి కూడా ఛాన్స్ ఇవ్వబోతున్నారని టాక్ నడుస్తోంది. ఇప్పుడు మొత్తం 78 మంది అభ్యర్థుల పేర్లతో ఉన్న లిస్ట్‌ ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. 

ఉమ్మడి అదిలాబాద్: సిర్పూర్ - కోనేరు కొనప్ప, చెన్నూరు - బాల్క సుమన్, ఆసిఫాబాద్ - అత్రం సక్కు, ఆదిలాబాద్ - జోగు రామన్న, బోథ్ - రాథోడ్ బాపు రావు, నిర్మల్ - ఇంద్రకరణ్ రెడ్డి, ముదోల్ - విఠల్ రెడ్డి

ఉమ్మడి నిజామాబాద్: ఆర్మూర్ - జీవన్ రెడ్డి, బోధన్ - షకీల్ అహ్మద్, జుక్కల్ - హనుమంత్ షిండే, బాన్సువాడ - పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎల్లారెడ్డి - జాజుల సురేందర్, నిజామాబాద్ అర్బన్ - గణేష్ బిగాల ,నిజామాబాద్ రూరల్ - బాజిరెడ్డి గోవర్ధన్, బాల్కొండ - వేముల ప్రశాంత్ రెడ్డి

కరీంనగర్‌: కోరుట్ల - కల్వకుంట్ల విద్యాసాగర్ రావు/సంజీవ్, జగిత్యాల - సంజయ్, మంథని - పుట్టా మధు, కరీంనగర్ - గంగుల కమలాకర్, సిరిసిల్ల - కేటీఆర్, మానకొండూరు - రసమయి బాలకిషన్, హుస్నాబాద్ - సతీష్ కుమార్, రామగుండం - కొరుకంటి చందర్

ఉమ్మడి మెదక్: సిద్దిపేట - తన్నీరు హరీష్ రావు, నారాయణఖేడ్ - ఎం భూపాల్ రెడ్డి, నర్సాపూర్ - చిలుముల మదన్ రెడ్డి, పఠాన్ చెరు - గూడెం మహిపాల్ రెడ్డి, దుబ్బాక - కొత్త ప్రభాకర్ రెడ్డి, గజ్వేల్ - కేసీఆర్

ఉమ్మడి రంగారెడ్డి: మేడ్చల్ - చామకూర మల్లారెడ్డి, మల్కాజ్ గిరి - మైనంపల్లి హన్మంతరావు, కుత్బుల్లాపూర్ - కేపీ వివేకానంద, కూకట్ పల్లి - మాధవరం కృష్ణారావు, ఇబ్రహీంపట్నం - మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఎల్బి నగర్ - దేవిరెడ్డి సుదీర్ రెడ్డి, మహేశ్వరం - సబితా ఇంద్రారెడ్డి, రాజేంద్ర నగర్ - ప్రకాష్ రెడ్డి, శేరిలింగంపల్లి - అరికేపుడి గాంధీ, చేవెళ్ల - కాలె యాదయ్య, వికారాబాద్ - మెతుకు ఆనంద్, తాండూర్ - పైలట్ రోహిత్ రెడ్డి

ఉమ్మడి హైదరాబాద్‌: ముషీరాబాద్ - ముఠా గోపాల్, అంబర్ పేట - కాలేరు వెంకటేష్, ఖైరతాబాద్ - దానం నాగేందర్, జూబ్లీహిల్స్ - మాగంటి గోపీనాథ్, సనత్ నగర్ - తలసాని శ్రీనివాస్ యాదవ్, సికింద్రాబాద్ - టి పద్మారావు,

ఉమ్మడి మహబూబ్ నగర్: కొడంగల్ - పట్నం నరేందర్, నారాయణ్ పేట్ - ఎస్ రాజేందర్ రెడ్డి, మహబూబ్ నగర్ - వి శ్రీనివాస్ గౌడ్, జడ్చర్ల - సి లక్ష్మారెడ్డి, దేవరకద్ర - అల వెంకటేశ్వర రెడ్డి, మక్తల్ - చిట్టెం రామ్మోహన్ రెడ్డి, వనపర్తి - సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, గద్వాల్ - బండ్ల కృష్ణమోహన్,  నాగర్ కర్నూల్ - మర్రి జనార్దన్ రెడ్డి, కొల్లాపూర్ - బీరం హర్షవర్ధన్

ఉమ్మడి నల్లగొండ: దేవరకొండ - రమావత్ రవీంద్ర కుమార్, మిర్యాలగూడ - నల్లమోతు భాస్కర్ రావు, హుజూరబాద్ - శానంపుడి సైదిరెడ్డి, సూర్యాపేట - జి జగదీష్ రెడ్డి, నల్గొండ - కంచర్ల భూపాల్ రెడ్డి, భువనగిరి - పైలా శేఖర్ రెడ్డి, నకిరేకల్ - చిరుమర్తి లింగయ్య, తుంగతుర్తి - గాదరి కిషోర్, ఆలేరు - గొంగడి సునీత, మునుగోడు - కోసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

ఉమ్మడి వరంగల్: పాలకుర్తి - ఎర్రబెల్లి దయాకర్ రావు, నర్సంపేట - పెడ్డి సుదర్శన్ రెడ్డి, పరకాల - చల్లా ధర్మారెడ్డి, వరంగల్ పశ్చిమ - దాస్యం వినయ్ భాస్కర్, వర్ధన్నపేట - ఆరూరి రమేష్, భూపాల్ పల్లీ - గండ్ర వెంకటరమణారెడ్డి

ఉమ్మడి ఖమ్మం:  పినపాక - రేగ కాంతారావు,  ఇల్లందు - బానోత్ హరిప్రియ, ఖమ్మం - పువ్వాడ అజయ్ కుమార్‌, సత్తుపల్లి - సండ్ర వెంకటవీరయ్య, అశ్వారావుపేట - మెచ్చా నాగేశ్వర రావు 

టాప్ హెడ్ లైన్స్

Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
NDA Convenor Chandrababu?: ఎన్డీయే కూటమికి కొత్త కన్వీనర్ ఏర్పాటుకు మోదీ గ్రీన్ సిగ్నల్! రేసులో చంద్రబాబు!
ఎన్డీయే కూటమికి కొత్త కన్వీనర్ ఏర్పాటుకు మోదీ గ్రీన్ సిగ్నల్! రేసులో చంద్రబాబు!
Telangana Politics: రేవంత్ ఫ్యామిలీపై బీఆర్ఎస్ ఆరోపణల దాడి - కౌంటర్ ఇవ్వడానికి ముందుకు రాని మంత్రులు- అసలేం జరుగుతోంది?
రేవంత్ ఫ్యామిలీపై బీఆర్ఎస్ ఆరోపణల దాడి - కౌంటర్ ఇవ్వడానికి ముందుకు రాని మంత్రులు- అసలేం జరుగుతోంది?
AP Group 1 SIT Report: డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget