అన్వేషించండి

AP Election Campaign: యూట్యూబ్ నుంచి ర‌చ్చబండ‌ వ‌ర‌కు- ఏపీలో ఎన్నిక‌ల ప్ర‌చారంలో టీడీపీ వ‌ర్సెస్ వైసీపీ

YSRCP vs TDP: ఏపీలో పార్టీల‌ ప్ర‌చారాలు జోరుగా సాగుతున్నాయి. ఇండోర్-అవుట్ డోర్ ప్ర‌చారంలో టీడీపీ, వైసీపీ పార్టీలు వ్యూహాత్మ‌కంగా దంచి కొడుతున్నాయి.

AP Assembly Election Campaign: ఏపీలో రాజ‌కీయ పార్టీల‌ ప్ర‌చారం రోజురోజుకూ వేడెక్కుతోంది. ఇండోర్ - అవుట్ డోర్ ప్ర‌చారంలో రెండు కీల‌క పార్టీలు వ్యూహాత్మ‌కంగా దంచి కొడుతున్నాయి. ఎన్నిక‌ల‌(AP Election 2024)కు మరో మూడు నెలలు గ‌డువు ఉండ‌గానే.. ప్ర‌చార ప‌ర్వాన్ని దాదాపు ప్రారంభించేశాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ అడుగులు వేస్తున్న విష‌యం తెలిసిందే. పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు (Chandrababu) భారీ ఎత్తున `రా.. క‌ద‌లిరా!`(Raa-Kadaliraa) పేరుతో బ‌హిరంగ స‌భ‌లు పెడుతున్నారు. ఏ అవ‌కాశం వ‌చ్చినా.. ఆయ‌న దూసుకుపోతున్నారు. తాజాగా.. `ఏపీ వెల‌గాలి-కీడు తొలగాలి` కార్య‌క్ర‌మాన్ని భోగిని పుర‌స్క‌రించుకుని చేప‌ట్టారు. ఇక‌, రా.. క‌ద‌లిరా..! యాత్ర‌లు వ‌చ్చే రోజుల్లో మ‌రింత ముమ్మ‌రం కానున్నాయి.

ఇండోర్ వ‌ర్సెస్ ఔట్‌ డోర్‌ క్యాంపెయిన్.. 
ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ(TDP) `ఔట్ డోర్` ఎన్నిక‌ల‌ ప్ర‌చారాన్ని దాదాపు ప్రారంభించేసింది. త‌ద్వారా ప్ర‌జ‌ల్లో చైత‌న్యం తీసుకువచ్చి.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీని గెలుపు గుర్రం ఎక్కించాల‌నేది పార్టీ వ్యూహంగా క‌నిపిస్తోంది. ఇక‌, అధికార పార్టీ వైసీపీ(YCP) విష‌యానికి వ‌స్తే.. ఈ పార్టీ ఇంకా బ‌హిరంగ స‌భ‌ల‌ు ప్లాన్ చేయ‌లేదు. ప్ర‌స్తుతం టికెట్ల కేటాయింపు.. మార్పులు, చేర్పుల దిశ‌గా వైసీపీ అధినేత‌, సీఎం వైఎస్ జ‌గ‌న్ అడుగులు వేస్తున్నారు. అయితే స‌మ‌యం వృధా చేసుకోకూడ‌ద‌ని భావించిన వైసీపీ ఇన్‌డోర్ ప్ర‌చారంలో దూసుకుపోతోంది.

నాలుగేళ్ల పాల‌న‌పై..  
యూట్యూబ్ రీల్స్ నుంచి.. యూట్యూబ్ యాడ్స్(YouTube Adds) స‌హా.. డిజిట‌ల్ ప్ర‌చారాన్ని ఇప్ప‌టికే వైసీపీ ప్రారంభిం చింది. యూట్యూబ్‌లో ఏ కార్య‌క్ర‌మాన్ని చూసినా...  వైసీపీ ప్ర‌భుత్వ యాడ్స్ వ‌చ్చేస్తున్నాయి. సీఎం జ‌గ‌న్ గ‌త నాలుగేళ్ల‌లో ఏం చేశారో.. రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జ‌రిగిందో.. నాడు-నేడు, అమ్మ ఒడి, చేదోడు, రైతు భ‌ర‌సా ఇలా.. ప్ర‌చారాన్ని దంచికొడుతున్నారు. యూట్యూబ్‌ రీల్స్ అయితే లెక్కేలేదు. అదేవిధంగా సోష‌ల్ మీడియాలోనూ వైసీపీ ప్ర‌చారం చేస్తోంది. అంటే ఈ టీమ్ `ఇన్‌డోర్` ప్ర‌చారంలో ముందుందన్న‌మాట‌. అటు టీడీపీ ఔట్ డోర్ ప్ర‌చారాన్ని, ఇటు వైసీపీ ఇన్‌డోర్ ప్ర‌చారాన్ని రాబోయే రోజుల్లో మ‌రింత విస్తృతం చేయ‌నున్నాయ‌నేది ఖాయంగా క‌నిపిస్తోంది. 

ఎన్నిక‌ల‌కు మూడు నెల‌ల ముందే 
దీంతో ఎన్నిక‌ల‌కు రెండు మాసాల ముందుగానే.. టీడీపీ-వైసీపీ(TDP-YCP)లు ప్ర‌చారంలో దూకుడు పెంచాయ‌న్న‌ది స్ప‌ష్ట‌మైంది. మ‌రోవైపు టీడీపీ సోష‌ల్ మీడియా పాట‌ల రూప‌క‌ల్ప‌న‌, ప‌థ‌కాలు, మినీ మేనిఫెస్టోపై వీడియోల రూప‌క‌ల్ప‌న‌లో బిజీబిజీగా ఉన్న‌ట్టు స‌మాచారం. ఒక అగ్ర‌ద‌ర్శ‌కుడు వీటికి ప్లాన్ చేస్తున్న‌ట్టు టీడీపీ(TDP) వ‌ర్గాలు చెబుతున్నాయి. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు కూడా.. టాలీవుడ్ డైరెక్టర్ బోయ‌పాటి శ్రీను టీడీపీకి ప్ర‌చార వీడియోలు రూపొందించారు. ఇప్పుడు ఆయ‌న‌తోపాటు మ‌రో అగ్ర‌ద‌ర్శ‌కుడు కూడా తోడైన‌ట్టు టీడీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. దీంతో మ‌రికొద్ది రోజుల్లోనే టీడీపీ కూడా ఇన్‌డోర్ ప్ర‌చారాన్ని ప్రారంభిచే అవ‌కాశం ఉంది. 

బ‌హిరంగ స‌భ‌ల‌కు ప్లాన్‌ 
మ‌రోవైపు, అధికార పార్టీ వైసీపీ వ‌చ్చే నెల రెండో వారం నుంచి బ‌హిరంగ స‌భ‌ల‌కు ప్లాన్ చేస్తోంది. ఇత‌మిత్థంగా ఈ రెండు పార్టీల మ‌ధ్యే ప్ర‌చార హోరు తీవ్ర‌త‌రం కానుంద‌ని స్ప‌ష్టంగా తెలుస్తోంది. ఇక‌, బ్యాన‌ర్లు, ఫ్లెక్సీలు, ప్ర‌ధాన మీడియా ఛాన‌ళ్ల‌లో ప్ర‌చారం కూడా త్వ‌ర‌లోనే ప్రారంభించ‌నున్నారు. దీంతో ఎన్నిక‌ల‌కు రెండు, మూడు నెల‌ల ముందే.. ఏపీలో ప్ర‌చార వేడి పెరిగిపోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

KTR News: దళిత ఎమ్మెల్యేపై దాడిని ఖండించిన కేటీఆర్.. ఎంపీ మల్లురవి క్షమాపణ చెప్పాలని డిమాండ్
దళిత ఎమ్మెల్యేపై దాడిని ఖండించిన కేటీఆర్.. ఎంపీ మల్లురవి క్షమాపణ చెప్పాలని డిమాండ్
Amaravati News: అమరావతిలో తొలిసారి రిపబ్లిక్ డే వేడుకలు.. ఏపీ సర్కార్ ఇకపై అన్నీ ఇక్కడే చేస్తుందా?
అమరావతిలో తొలిసారి రిపబ్లిక్ డే వేడుకలు.. ఏపీ సర్కార్ ఇకపై అన్నీ ఇక్కడే చేస్తుందా?
Sunita Williams Retires: నాసా నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన సునీతా విలియమ్స్, ఆమెకు పెన్షన్ ఎంత వస్తుంది?
నాసా నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన సునీతా విలియమ్స్, ఆమెకు పెన్షన్ ఎంత వస్తుంది?
AR Rahman: భగవద్గీత, ఖురాన్ చదవరు కానీ మా నాన్నను తిడతారు... తండ్రికి సపోర్టుగా ఏఆర్ రెహమాన్ పిల్లలు
భగవద్గీత, ఖురాన్ చదవరు కానీ మా నాన్నను తిడతారు... తండ్రికి సపోర్టుగా ఏఆర్ రెహమాన్ పిల్లలు

వీడియోలు

MI vs DC WPL 2026 | ముంబై ఢిల్లీ విజయం
Rohit, Virat BCCI Contracts Changes | విరాట్​, రోహిత్​కు బీసీసీఐ షాక్?
Ishan Kishan Ind vs NZ T20 | ఇషాన్ కిషన్ పై సూర్య సంచలన ప్రకటన
India vs New Zealand T20 Preview | నేడు భారత్ - న్యూజిలాండ్ మొదటి టీ20
Medaram Jatara Houseflies Mystery | మేడారం మహాజాతరలో కనిపించని ఈగలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: దళిత ఎమ్మెల్యేపై దాడిని ఖండించిన కేటీఆర్.. ఎంపీ మల్లురవి క్షమాపణ చెప్పాలని డిమాండ్
దళిత ఎమ్మెల్యేపై దాడిని ఖండించిన కేటీఆర్.. ఎంపీ మల్లురవి క్షమాపణ చెప్పాలని డిమాండ్
Amaravati News: అమరావతిలో తొలిసారి రిపబ్లిక్ డే వేడుకలు.. ఏపీ సర్కార్ ఇకపై అన్నీ ఇక్కడే చేస్తుందా?
అమరావతిలో తొలిసారి రిపబ్లిక్ డే వేడుకలు.. ఏపీ సర్కార్ ఇకపై అన్నీ ఇక్కడే చేస్తుందా?
Sunita Williams Retires: నాసా నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన సునీతా విలియమ్స్, ఆమెకు పెన్షన్ ఎంత వస్తుంది?
నాసా నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన సునీతా విలియమ్స్, ఆమెకు పెన్షన్ ఎంత వస్తుంది?
AR Rahman: భగవద్గీత, ఖురాన్ చదవరు కానీ మా నాన్నను తిడతారు... తండ్రికి సపోర్టుగా ఏఆర్ రెహమాన్ పిల్లలు
భగవద్గీత, ఖురాన్ చదవరు కానీ మా నాన్నను తిడతారు... తండ్రికి సపోర్టుగా ఏఆర్ రెహమాన్ పిల్లలు
BRS ప్రభుత్వంలో హరీష్ రావు ఫోన్ ట్యాప్ చేసింది ఎవరు? సొంత పార్టీలో చిచ్చురేపుతున్న సిట్ లీక్స్
BRS ప్రభుత్వంలో హరీష్ రావు ఫోన్ ట్యాప్ చేసింది ఎవరు? సొంత పార్టీలో చిచ్చురేపుతున్న సిట్ లీక్స్
Tiger Near Hyderabad: హైదరాబాద్ సమీపంలో తిరుగుతున్న పెద్దపులి.. 50 ఏళ్లలో తొలిసారి అని అటవీశాఖ హెచ్చరిక
హైదరాబాద్ సమీపంలో తిరుగుతున్న పెద్దపులి.. 50 ఏళ్లలో తొలిసారి అని అటవీశాఖ హెచ్చరిక
BJP జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ రాజకీయ భవిష్యత్తు - జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతోంది?
BJP జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ రాజకీయ భవిష్యత్తు - జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతోంది?
Most imported item in India: భారత్ అత్యధికంగా ఏం దిగుమతి చేసుకుంటుంది, ఎక్కడి నుండి అవుతుందో తెలుసా
భారత్ అత్యధికంగా ఏం దిగుమతి చేసుకుంటుంది, ఎక్కడి నుండి అవుతుందో తెలుసా
Embed widget