By: Harish | Updated at : 09 Feb 2023 10:51 AM (IST)
టీడీపీ స్టాటజి కమిటి సమావేశంలో చంద్రబాబు,ఇతర నాయకులు
ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఓట్లు చీలిపోకుండా వైఎస్‌ఆర్‌సీపీ గుమ్మానికి స్టిక్కర్ కార్యక్రమాన్ని చేపట్టబోతోంది. అందులో మా నమ్మకం నువ్వే జగన్ అనే స్లోగన్‌తో ప్రజలను ఆకట్టుకునే వ్యూహంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించింది. అయితే దీనికి కౌంటర్‌గా తెలుగుదేశం ప్రతి వ్యూహాన్ని రెడీ చేసిందని టాక్ నడుస్తోంది. చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన టీడీపీ స్ట్రాటజి కమిటి ఓ నిర్ణయాన్ని తీసుకుందని తెలుస్తోంది.
రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసే దిశగా అమరావతిలో స్ట్రాటజీ కమిటీ మీటింగ్ జరిగింది. పార్టీ శ్రేణులను ముందస్తుకు సిద్ధం చేయాలని పార్టీ సీనియర్లు నిర్ణయించారు. వచ్చే ఎన్నికలకు సన్నద్దం అయ్యే క్రమంలో అధికార పార్టీ, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలన్నారు. లబ్ధిదారులకు నేరుగా వారి ఖాతాల్లోకి నగదు జమ చేస్తున్నామని చెప్పుకుంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు అదే స్థాయిలో కౌంటర్ ఇవ్వాలని తెలుగు దేశం భావిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్న లెక్కలతోనే కౌంటర్ అటాక్ చేయాలని వ్యూహం రెడీ చేస్తున్నారు.
ఇచ్చిన హామీలను అమలు చేయటం, ఇవ్వని హామీలను కూడా అమలు చేశాం కాబట్టి ఓటు అడిగే హక్కు తమకే ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రచారం చేస్తున్నాయి. ఇంటింటికి వెళ్ళి ప్రభుత్వం చేసిన సంక్షేమాన్ని వివరించటంతోపాటుగా ప్రతి ఇంటికి పార్టీ స్టిక్కర్ అంటించాలని భావిస్తున్నారు. అయితే అదే సమయంలో తెలుగుదేశం నేతలు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ప్రభుత్వం ఎంత ఇచ్చింది, ప్రజలపై ఎంత భారం మోపిందనే విషయాలను వివరించాలని భావిస్తున్నారు. దీంతోపాటు అధికారంలో ఉన్న ప్రభుత్వ వైఫల్యాలను వివరించాలని టీడీపీ స్ట్రాటజి కమిటి సమావేశంలో నిర్ణయించారు.
జగన్ ముందస్తు వ్యూహం ....
జగన్ సర్కార్ ముందస్తుకు సిద్ధమవుతోందని తెలుగుదేశం స్ట్రాటజీ కమిటీ అంచనా వేసింది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండాలని భావిస్తోంది. లోకేష్ ఒక వైపు పాదయాత్ర చేస్తుంటే మరోవైపున జనసేన అదినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు రెడీ అవుతున్నారు. దీంతోపాటు ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో విభేదాలు బయటపడుతున్నాయి. అదే సమయంలో వివేకా హత్యకేసు వ్యవహరం, రాజధాని వంటి అంశాలు అధికార పార్టీపై ఒత్తిడిని పెంచుతున్నాయి. అన్నింటికీ మించి ఖజానా నిండుకుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. వీలైనంత వరకు డబ్బులను పంచి పెట్టి ఎప్పుడైనా జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారని తెలుగు దేశం పార్టీ భావిస్తుంది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కొవాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు, మోసాలు, ప్రజలకు వివరించి తిరిగి తెలుగు దేశం జెండాను ఎగర వేయాలని శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు.
35 నియోజకవర్గాలు ఒక జోన్ గా...
ప్రతి 35 నియోజకవర్గాలను జోన్ గా విభజించి, పార్టీ నాయకులు కార్యకర్తలను సమాయత్తం చేయాలని టీడీపీ స్ట్రాటజి కమిటి సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చెప్పారు. ముందస్తు ఎన్నికలపై పార్టీ క్యాడర్‌ను అలర్ట్ చేసి, అధికర పక్షానికి దీటుగా బదులు ఇచ్చేందుకు ఇంటింటికి వెళ్ళి కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేయాలని అధినేత పిలుపు నిచ్చారని అచ్చెం చెప్పారు. లోకేష్ పాదయాత్రకు ప్రభుత్వం భయపడింది కాబట్టే అడుగడుగునా అడ్డంకులను కలిగిస్తున్నారని, పోలీసుల వైఫల్యాలపై పోరాటం చేయాలని ఆయన అన్నారు.
Sharmila Meet Sivakumar : మరోసారి డీకే శివకుమార్‌తో షర్మిల భేటీ - కాంగ్రెస్ తో పొత్తులు ఫైనల్ అవుతున్నాయా ?
ఉచితాలతో ఎన్నికల శంఖారావం పూరించిన టీడీపీ- ఇప్పుడు అదే అసలైన టాస్క్
TDP Manifesto: భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో టీడీపీ మినీ మేనిఫెస్టో, చంద్రబాబు 6 ప్రధాన హామీలు
Balakrishna at Mahanadu: ఎన్టీఆర్ తెచ్చిన సంక్షేమ పథకాలు చిరస్మరణీయం, చంద్రబాబు విజన్ ఎందరికో ఆదర్శం
TDP Mahanadu: జగన్ ది రాక్షసపాలన, ఎటు చూసినా దోపిడీ! మహానాడులో టీడీపీ నేతల ఘాటు వ్యాఖ్యలు
4 Years Of YSRCP: వైఎస్ జగన్ పాలనకు నాలుగేళ్లు పూర్తి- భారీగా బైక్ ర్యాలీలు, కార్యక్రమాలకు నేతలు శ్రీకారం
Telangana CM KCR: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలపై అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు
'యూత్ ను ఎంకరేజ్ చేయాలే, ధమ్ ధమ్ చేయొద్దు' - జక్కన్న ట్వీట్ వైరల్!
Bonda Uma: టీడీపీ సంక్షేమ మేనిఫెస్టోతో తాడేపల్లి పునాదులు కదులుతున్నాయి- బొండా ఉమా