Andhra Pradesh Politics: టీడీపీ క్యాడర్ ఆన్ ఫైర్ - మంత్రి పార్థసారధి అర్థం చేసుకోలేకపోయారా ?
TDP : మంత్రి పార్థసారధిపై టీడీపీ క్యాడర్ ఫైర్ మీద ఉంది. హైకమాండ్‌లో కూడా అదే అసంతృప్తి కనిపిస్తోంది. జోగి రమేష్‌తో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొనడమే కారణం.
TDP cadre on fire over Minister Parthasaradhi: ఏపీ మంత్రి పార్థసారధి ఇప్పుడు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. ఆదివారం రోజు తన నియోజకవర్గంలో జరిగిన గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమలో ఆయనతో పాటు జోగి రమేష్ కూడా పాల్గొన్నారు. వీరితో పాటు గౌతు లచ్చన్న మనవరాలు, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష కూడా పాల్గొన్నారు. ర్యాలీ నిర్వహించారు. సభా వేదిక మీద ఇతర నేతల్ని తక్కువ చేస్తే వైఎస్ రాజశేఖర్ రెడ్డిని జోగి రమేష్ పొగిడారు. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మంత్రి పార్థసారధి పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. ఆయనపై చర్యలు తీసుకోవాలని క్యాడర్ డిమాండ్ చేస్తోంది.
జోగి రమేష్‌తో వేదిక పంచుకోవడంపై టీడీపీ క్యాడర్ తీవ్ర ఆగ్రహం
నూజివీడులో జరిగిన సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆయన మనవరాలు గౌరు శిరీష, మంత్రి పార్థసారధి హాజరయ్యారు. అదే కార్యక్రమానికి జోగి రమేష్ వచ్చారు. ఆయనను కూడా నిర్వాహకులు పిలిచారు. అలాగే జిల్లాలో ఇతర గౌడ టీడీపీ నేతలు అయినా కాగిత కృష్ణప్రసాద్ తో పాటు ఇతర సీనియర్ నేతల్ని పిలిచారు. జోగి రమేష్ వస్తున్న కారణంగా వారెవరూ రాలేదు. కానీ వీరు వెళ్లడంతో టీడీపీ క్యాడర్ ఫైర్ అయింది. చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబాన్ని దూషించడమే కాదు.. చంద్రబాబు ఇంటిపైకి దాడికి వెళ్లిన నేతలతో కలిసి పర్యటిస్తారా.. కార్యక్రమంలో పాల్గొంటారా అని టీడీపీ నేతలు తీవ్రంగా విరుచుకుపడ్డారు. హైకమాండ్ కూడా దీనిపై ఆరా తీసింది. దంతో ఇద్దరు నేతలు క్యాడర్ కు క్షమాపణలు చెప్పారు. అది రాజకీయపరంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం కాదని అయినా జోగి రమేష్ తో కలిసి వేదిక పంచుకున్నందుకు క్షమాపణలు చెబుతున్నామన్నారు. మరోసారి అలాంటి తప్పు జరగనివ్వబోమన్నారు. పార్థసారధి పదే పదే వివరణ ఇస్తూ ట్వీట్లు పెట్టారు.
తెలుగు దేశం పార్టీ పైన దాడి చేసిన వ్యక్తిని, మా నేతలను తీవ్రంగా తిట్టిన వారి పక్కన అసలు నేను ఎలా ఉంటాను. ఈ ఏడాదిలో ఒక్కసారి కూడా అలా ఎప్పుడూ కలవలేదు
— Kolusu Parthasarathy (@kpsarathyTDP) December 17, 2024
వైఎస్ఆర్సీపీ నుండి బయటకు వచ్చి దాదాపు సంవత్సరం పైనే అయింది. ఒక్కరినీ దగ్గరకు తీయలేదు. అసలు పలకరించే లేదు.
నన్ను పావుగా…
ప్రస్తుతం ఉన్న మంత్రి పార్థసారధి వైసీపీలోనే ఉన్నారు. ఆయన ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. అయినప్పటికీ చంద్రబాబు ఆయనకు నూజివీడు టిక్కెట్ ఇచ్చారు. మంత్రి పదవి ఇచ్చారు. ఆయనకు ఇలా ప్రాధాన్యం ఇవ్వడంపై ఎవరూ పెద్దగా అభ్యంతరం చెప్పలేదు. ఎందుకంటే ఆయన వైసీపీలో ఉన్నప్పుడు జోగి రమేష్ తరహాలో నోరు పారేసుకోలేదు. అయితే జోగి రమేష్ ఐదేళ్ల కాలంలో అన్ని హద్దులూ చెరిగిపోయేలా వ్యవహరించారు. లోకేష్,చంద్రబాబు, రఘురామ సహా ఎవర్నీ వదిలి పెట్టలేదు. అత్యంత ఘోరమైన భాష వాడారు. చంద్రబాబు ఇంటిపైకి దాడికి వెళ్లారు. అలాంటి నేతతో కలిసి తిరగడం టీడీపీ క్యాడర్ ను ఆగ్రహానికి గురి చేసింది. కార్యకర్తల మనోభావాల ప్రకారం .. నారా లోకేష్ కూడా స్పందించారు. తంలో పలువురు వైసీపీ నేతలు వ్యవహరించిన తీరు విషయంలో క్యాడర్ అసహనంతో ఉన్నారని వారి నీడి టీడీపీ.. టీడీపీ నేతలపై పడిన క్యాడర్ సహించే పరిస్థితి లేదని నారా లోకేష్ చెప్పినట్లుగా తెలుస్తోంది. అందుకే వారు వెంటనే క్యాడర్ కు సారీ చెప్పారు. కానీ తెలుగుదేశం కార్యకర్తలు మాత్రం తమ అసంతృప్తిని కొనసాగిస్తూనే ఉన్నారు.
Also Read: జోగి రమేష్ నీడ టీడీపీపై ఎందుకు పడింది ? - గౌతు శిరీష, మంత్రి పార్ధసారధిపై లోకేష్ ఫైర్ !
కొంత మంది వైసీపీ నేతలకు అత్యంత గడ్డు పరిస్థితి
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కొంత మంది ప్రత్యేకంగా మాటల దాడి చేయడానికి ఓ టీమ్ గా ఉన్నారు. వారందరూ ఇష్టం వచ్చినట్లుగా ప్రతిపక్ష నేతల్ని తిట్టడంతో పాటు దాడులూ చేశారు. చంద్రబాబుఇఇంటిపై దాడి.. టీడీపీ ఆఫీసుపై దాడి వంటి వ్యవహారాల్లో ఉన్న వైసీపీ నేతల నీడ టీడీపీపై పడినా తట్టుకోలేకపోతున్నారు టీడీపీ క్యాడర్. అయితే కాస్త పద్దతిగా ఉన్న వైసీపీ నేతలు టీడీపీలో చేరినా క్యాడర్ రియాక్ట్ కావడం లేదు. జగన్ ఆదేశించారని.. సజ్జల సలహాలు ఇచ్చారని రాజకీయంగా ప్రత్యర్థుల్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకున్న వారే ఇప్పుడు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు.