News
News
X

New TRS Party : టీఆర్ఎస్ పేరుతో తెలంగాణలో కొత్త పార్టీ - తెర వెనుక కీలక నేతలు ?

తెలంగాణలో కొత్తగా తెలంగాణ రాజ్య సమతి .. టీఆర్ఎస్‌ను ప్రారంభించేందుకు కొంత మంది నేతలు సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

FOLLOW US: 
Share:

New TRS Party :  తెలంగాణ సెంటిమెంటే అస్త్రంగా ఆవిర్భవించిన టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్‌గా మారిపోయింది. ఈ క్రమంలో తెలంగాణ సెంటిమెంట్‌ ను ఉపయోగించుకునేందుకు కొత్తగా టీఆర్ఎస్ పార్టీని కొంత మంది కీలక నేతలు మళ్లీ ప్రారంభించాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. టీఆర్ఎస్ అనే పేరు ఉంటుంది కానీ.. తెలంగాణ రాష్ట్ర సమితి కాదు.. తెలంగాణ  రాజ్య సమితి లేదా తెలంగాణ రైతు సమితి అనే పేరు పెట్టే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికీ ఈ పార్టీకి సంబంధించిన రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు పూర్తయ్యాయని చెబుతున్నారు. ఎవరో ఆషామాషీగా పెట్టిస్తున్న పార్టీ కాదని.. తెర వెనుక ఓ ముగ్గురు సీనియర్ కీలక నేతలు ఉన్నారని చెబుతున్నారు. వారు రేపోమాపో బయటకు వచ్చి.. తెలంగాణ రాజ్య సమితి లేదా తెలంగాణ రైతు సమితిని ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు. పార్టీ గుర్తుగా పింక్ కలర్‌నే ఉపయోగించబోతున్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీ ఉపయోగిస్తున్న కాకుండా.. కాస్త కలర్ వేరియషన్ చూపించే అవకాశం ఉంది. 

ముగ్గురు నేతలు ఖమ్మం, కరీంనగర్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన వారని చెబుతున్నారు. ఇప్పటికే తెర వెనుక పార్టీకి సంబంధించిన పనులన్నీ పూర్తయ్యాయని చెబుతున్నారు. కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్‌గా మార్చుకున్న అంశాన్ని ఉపయోగించుకుని తెలంగాణ సెంటిమెంట్‌తో కొత్త పార్టీ రేపి.. మంచి విజయం సాధించాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. టీఆర్ఎస్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఎన్నికల్లో ఓడించాలన్న లక్ష్యంతో ఈ పార్టీ ఏర్పాటవుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదని... టీఆర్ఎస్ పేరుతో మరో పార్టీ ఉంటే అది్ బీఆర్ఎస్‌కే నేష్టమని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. 

ఆ ముగ్గురు నేతలెవరు అన్నది ఇప్పుడు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ఇటీవల బీఆర్ఎస్‌తో విబేధించిన ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏ పార్టలోనూ చేరలేదు. అయితే బీఆర్ఎస్ పై ఘాటు విమర్శలు చేస్తున్నారు. ఆయన ఈ ముగ్గురు వ్యక్తులు కావొచ్చని చెబుతున్నారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన మరో మాజీ ఎంపీ జాతీయ పార్టీలో చేరినప్పటికీ ఆయన కు అక్కడ ప్రాధాన్యత లభించడం లేదు. ఆ పార్టీ కార్యకలాపాల్లో పెద్దగా కనిపించడం లేదు. ఆయన లక్ష్యం కూడా టీఆర్ఎస్ పార్టీని ఓడించడమే. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మరో నేత  కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఆయన తన పై కుట్రలు చేస్తున్నారని.. దెబ్బకు దెబ్బ తీయాలన్న లక్ష్యంతో ఉన్నట్లుగా చెబుతున్నారు. ఉద్యమ  బ్యాక్ గ్రౌండ్ ఉండటం ఆయనకు ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.                  

మొత్తంగా ఈ రాజకీయ పార్టీ అంశం ఉద్దృతంగా తెరపైకి వచ్చి..  తెలంగాణ అంశానికి దూరంగా జరగడం ఇష్టం లేని నేతలు ఈ పార్టీలో చేరితే.. బీఆర్ఎస్ పార్టీకి గట్టి దెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఈ పార్టీని ఎప్పుడు తెరపైకి తెస్తారా అన్నది ఉత్కంఠగా మారింది. 

Published at : 04 Mar 2023 07:52 PM (IST) Tags: TRS Telangana Politics TRS party leaders Telangana Rajya Samiti

సంబంధిత కథనాలు

TDP 41 Years :   41 ఏళ్లలో ఎన్నో సవాళ్లు, సంక్షోభాలు - టీడీపీ పూర్వ వైభవం సాధిస్తుందా ?

TDP 41 Years : 41 ఏళ్లలో ఎన్నో సవాళ్లు, సంక్షోభాలు - టీడీపీ పూర్వ వైభవం సాధిస్తుందా ?

AP Early Elections : సీఎం జగన్ ముందస్తు సన్నాహాల్లో ఉన్నారా ? పదే పదే ఢిల్లీ పర్యటనలు అందుకోసమేనా ?

AP Early Elections :  సీఎం  జగన్ ముందస్తు సన్నాహాల్లో ఉన్నారా ? పదే పదే ఢిల్లీ పర్యటనలు అందుకోసమేనా ?

Mekapati vs Anilkumar: మాజీ మంత్రి అనిల్ వర్సెస్ ఎమ్మెల్యే మేకపాటి - సెటైర్లు మామూలుగా లేవు!

Mekapati vs Anilkumar: మాజీ మంత్రి అనిల్ వర్సెస్ ఎమ్మెల్యే మేకపాటి - సెటైర్లు మామూలుగా లేవు!

తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో BRSతో కలిసి పోటీచేస్తాం: తమ్మినేని

తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో BRSతో కలిసి పోటీచేస్తాం: తమ్మినేని

Nizamabad కాంగ్రెస్‌ పార్టీలో లుకలుకలు - టీపీసీసీ చీఫ్ రేవంత్ ఏం చేయనున్నారో!

Nizamabad కాంగ్రెస్‌ పార్టీలో లుకలుకలు - టీపీసీసీ చీఫ్ రేవంత్ ఏం చేయనున్నారో!

టాప్ స్టోరీస్

KCR Decisions: పోడు భూములకు పట్టాలు రెడీ, పంపిణీపై త్వరలో తేదీ ప్రకటిస్తాం: సీఎం కేసీఆర్

KCR Decisions: పోడు భూములకు పట్టాలు రెడీ, పంపిణీపై త్వరలో తేదీ ప్రకటిస్తాం: సీఎం కేసీఆర్

AP 10th Exams: 'పది'లో ఆరుపేపర్లు, బిట్ పేపర్ లేకుండానే ప్రశ్నపత్రం! విద్యార్థులకు 'సిలబస్' కష్టాలు!

AP 10th Exams: 'పది'లో ఆరుపేపర్లు, బిట్ పేపర్ లేకుండానే ప్రశ్నపత్రం! విద్యార్థులకు 'సిలబస్' కష్టాలు!

Sangareddy Crime News: భూ వివాదంతో పెద్దనాన్న హత్య - తల, మొండెం వేరు చేసి ఒక్కోచోట పడేసిన తమ్ముడి కొడుకు!

Sangareddy Crime News: భూ వివాదంతో పెద్దనాన్న హత్య - తల, మొండెం వేరు చేసి ఒక్కోచోట పడేసిన తమ్ముడి కొడుకు!

నా ఇంటికి రా రాహుల్ భయ్యా- రేవంత్ ఎమోషనల్ ట్విట్

నా ఇంటికి రా రాహుల్ భయ్యా-  రేవంత్ ఎమోషనల్ ట్విట్