Sajjala On Pavan : చంద్రబాబును సీఎం చేయడానికి బ్రోకరిజం - పవన్‌పై సజ్జల తీవ్ర విమర్శలు
పవన్ కల్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి. చంద్రబాబును సీఎం చేయడానికి బ్రోకరిజం చేస్తున్నారని విమర్శించారు.
Sajjala On Pavan : చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ( Pavan Kalyan ) బ్రోకరిజం చేస్తున్నట్లుగా ఉందని ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ( Sajjala ) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన బీజేపీ, జనసేన పొత్తుల ( BJP ) గురించి మాకు సంబంధం లేదంటూనే పవన్‌పై వ్యాఖ్యలు చేశారు. పొత్తుల వల్ల ప్రజల్ని మభ్యపెట్టడమే అవుతుందని.. తమకు పొత్తులపై విశ్వాసం లేదన్నారు. ప్రజలకు ఏం చేస్తున్నామనేదే ముఖ్యమని అధికారం కోసమే జరిగే పొత్తులు కరెక్ట్ కాదనేది మా అభిప్రాయన్నారు.
ఈ సారి కేసీఆర్ పోటీ పార్లమెంట్‌కా ? గజ్వేల్‌కు కొత్త అభ్యర్థి ఖాయమేనా ?
రాజకీయంగా సీరియస్‌గా ఉన్న వాళ్లు ఒంటరిగానే పోటీ చేయాలని అనుకుంటారని సజ్జల అన్నారు. అయితే పవన్ కల్యాణ్ ఓ రాజకీయ నాయకుడిగా కాకుండా ఓ విశ్లేషకుడిగా పొత్తులపై ఆప్షన్లు ఇచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. జనసేన తన పార్టీ అన్న విషయాన్ని పవన్ మరిచిపోయినట్టుగా ఉన్నారన్నాపు, చంద్రబాబు ( Chandra babu ) వ్యూహాలనే పవన్ వల్లె వేస్తున్నట్లుగా అనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. పొత్తులపై పవన్ ఓ మాట, జనసేనతో పొత్తు కలిగిన బీజేపీ నేతలు మరో మాట మాట్లాడుతున్నారని సజ్జల అన్నారు.
హత్య చేసిన అనంతబాబునూ అంత సేపు ప్రశ్నించలేదే ? సీఐడీపై టీడీపీ తీవ్ర విమర్శలు !
ఎవరో కట్టిన ట్యూన్‌కు పవన్ రాగం అందుకున్నట్లు ఉందని సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. సొంతంగా అధికారంలోకి రావాలనుకుంటే ఆప్షన్లు ఎందుకు అని పవన్ కల్యాణ్‌ను ప్రశ్నించారు. ఇతర పార్టీలది ఉనికి కోసం ప్రయత్నం అని విమర్శిచారు. వైఎస్ఆర్‌సీపీని ( YSRCP ) ఓడిస్తామనే భ్రమలో ఇతర పార్టీలు ఉన్నట్లున్నాయని... సీఎం జగన్‌కు ( CM Jagan ) ప్రజలపై పూర్తి విశ్వాసం ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ వైఎస్ఆర్‌సీపీకి ఆదరణ ఉంటుందని సజ్జల స్పష్టం చేశారు.
గెలిపించలేకపోతే రూ. వెయ్యి కోట్లిస్తా ! కేఏ పాల్ ఆఫర్ ఎవరికో తెలుసా ?
ఎన్నికలకు చాలా సమయం ఉన్నప్పటికీ ..ఏపీలో పొత్తులపై ( Political Alliance ) రాజకీయ పార్టీలు విస్తృతంగా పొత్తులపై విస్తృతంగా చర్చలు జరుపుతున్నాయి. ఓట్లు చీలకూడదని కొన్ని పార్టీలు... దమ్ముంటే ఒంటరిగా పోటీ చేయాలని మరికొన్నిపార్టీలు సవాళ్లు విసురుకుంటున్నాయి. దీంతో ఏపీ రాజకీయం వేడెక్కుతోంది.