అన్వేషించండి

Roja supports DMK: కాంగ్రెస్ కూటమికి తమిళనాడులో రోజా మద్దతు - జగన్ అనుమతించారా?

Roj: కాంగ్రెస్ కూటమిలోని డీఎంకేకు తమిళనాడులో రోజా మద్దతు ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. జగన్ అనుమతితో ప్రచారం చేశారా లేకపోతే..సొంత నిర్ణయమా అన్నదానిపై స్పష్టత లేదు.

Roja supports DK in Congress alliance: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు అనూహ్యంగా మారుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఆర్.కె. రోజా తమిళనాడులో అధికార పార్టీ అయిన డీఎంకే (DMK) తరపున ప్రచార బరిలోకి దిగడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా   బీజేపీకి  వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయమూ తీసుకునేందుకు ఏ మాత్రం ముందుకు రాని  న వైసీపీ, పొరుగు రాష్ట్రంలో మాత్రం అదే బీజేపీకి వ్యతిరేకంగా డీఎంకేతో జతకట్టడం రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.                                             

రోజాకు తమిళనాడుతో ఉన్న సుదీర్ఘ అనుబంధం, అక్కడి సినిమా రంగంలో ఆమెకున్న క్రేజ్‌ను డీఎంకే తమకు అనుకూలంగా మార్చుకోవాలని భావిస్తోంది. ప్రత్యేకించి తెలుగు మాట్లాడే జనాభా ఎక్కువగా ఉన్న సరిహద్దు నియోజకవర్గాల్లో రోజాను ప్రచారానికి పంపడం ద్వారా ఓట్లను రాబట్టవచ్చని స్టాలిన్ సర్కార్ వ్యూహం రచిస్తోంది. డీఎంకే మేనిఫెస్టోలోని సంక్షేమ పథకాలు, ముఖ్యంగా మహిళల కోసం ప్రవేశపెట్టిన పథకాల గురించి రోజా తనదైన శైలిలో తమిళ ఓటర్లకు వివరిస్తున్నారు.                                                 

అయితే, ఈ పరిణామం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద రాజకీయ పరీక్షగా మారింది. కేంద్రంలో బీజేపీతో సత్సంబంధాలు కొనసాగిస్తున్న జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ, తమిళనాడులో బీజేపీ-ఏఐఏడీఎంకే కూటమిని ఢీకొంటున్న డీఎంకేకు మద్దతు తెలపడం వెనుక ఉన్న  రాజకీయ కోణాలను అంచనా వేయలేకపోతున్నారు.  డీఎంకేకు అనుకూలంగా ప్రచారం చేయడం అంటే పరోక్షంగా బీజేపీని వ్యతిరేకించడమేనని, ఇది భవిష్యత్తులో  వైసీపీకి సమస్యగా మారుతుందని అంచనా వేస్తున్నారు.             

తమిళనాడులో ప్రస్తుతం డీఎంకే వర్సెస్ అన్నా డీఎంకే-బీజేపీ మధ్య పోరు తీవ్రస్థాయిలో ఉంది. ఈ  కారణంగా, ఆంధ్రప్రదేశ్‌లో ఓటమి తర్వాత రోజా తమిళ రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారని, బహుశా ఆమె భవిష్యత్తులో పూర్తిస్థాయిలో తమిళ రాజకీయాలకే పరిమితం కావొచ్చని కూడా తమిళ మీడియాలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మొత్తానికి,  ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా.. అటు డీఎంకేకు మద్దతు ఇస్తూనే, ఇటు తన సొంత రాజకీయ ఉనికిని చాటుకోవడానికి రోజా ఈ అవకాశాన్ని వాడుకుంటున్నట్లు కనిపిస్తోంది.   

టాప్ హెడ్ లైన్స్

TDP Janasena Social Media War: క్షేత్రస్థాయిలో పాలనలో సమన్వయం .. సోషల్ మీడియాలో సెల్ఫ్ గోల్ ! కూటమి సోషల్ వార్‌ను అరికట్టడం ఎలా?
క్షేత్రస్థాయిలో పాలనలో సమన్వయం .. సోషల్ మీడియాలో సెల్ఫ్ గోల్ ! కూటమి సోషల్ వార్‌ను అరికట్టడం ఎలా?
YSRCP MLA Disqualification Issue: అనర్హత వేటు వేసుకోండి .. వైసీపీ పొలిటికల్ ఆఫర్ వెనుక అసలు వ్యూహమేంటి? స్పీకర్ ఏం చేయబోతున్నారు?
అనర్హత వేటు వేసుకోండి .. వైసీపీ పొలిటికల్ ఆఫర్ వెనుక అసలు వ్యూహమేంటి? స్పీకర్ ఏం చేయబోతున్నారు?
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Revanth Reddy Challenges KCR: సెప్టెంబర్‌లో అసెంబ్లీ సమావేశాలు.. ఎవరేం చేశారో చర్చకు సిద్ధమా కేసీఆర్: సీఎం రేవంత్ రెడ్డి
సెప్టెంబర్‌లో అసెంబ్లీ సమావేశాలు.. ఎవరేం చేశారో చర్చకు సిద్ధమా కేసీఆర్: సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Andhra Pradesh Assembly Sessions: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
Embed widget