అన్వేషించండి

Stand up comedian insults Pawan Kalyan: పవన్ కల్యాణ్ కుటుంబంపై స్టాండప్ కమెడియన్ అనుచిత వ్యాఖ్యలు - సోషల్మీడియాలో వార్ - అసలేమన్నాడంటే ?

Stand up comedian : పవన్ కల్యాణ్‌పై స్టాండప్ కమెడియన్ అనుచిత వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదం అవుతోంది. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.

Stand up comedian insults deputy cm Pawan Kalyan:  ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్  పై స్టాండప్ కమెడియన్ అనుదీప్ కొటికల్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో కార్చిచ్చులా వ్యాపించాయి.   స్టాండప్ కమెడియన్ అనుదీప్ కొటికల్ తన ప్రదర్శనలో భాగంగా పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని, ఆయన కుటుంబ సభ్యుల పేర్లను ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. రాజకీయ విమర్శలు చేయడం ప్రజాస్వామ్యబద్ధమే అయినప్పటికీ, మహిళలను, కుటుంబ సభ్యులను లక్ష్యం చేసుకుంటూ చేసిన  డెరోగేట వ్యాఖ్యలు పట్ల నెటిజన్లు మండిపడుతున్నారు. స్టాండప్ కామెడీ అంటే వినోదం పంచడం, అంతేకానీ ఇతరుల వ్యక్తిత్వ హననం చేయడం కాదు అంటూ నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

 హద్దులు దాటిన స్వేచ్ఛ - విమర్శల వెల్లువ

అనుదీప్ చేసిన వ్యాఖ్యలు భావ ప్రకటనా స్వేచ్ఛ పరిధిని దాటాయని, ఇది కేవలం విమర్శ కాదు,  టార్గెటెడ్ హరాస్మెంట్ అని జనసేన శ్రేణులు ఆరోపిస్తున్నాయి. పవన్ కల్యాణ్ పట్ల ద్వేషాన్ని ప్రదర్శించే క్రమంలో ఆడవారి పేర్లను లాగడం పట్ల సామాజిక మాధ్యమాల్లో  అత్యంత దారుణమైన స్థాయి అనే పదజాలంతో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. నిర్మాణాత్మక విమర్శకు, క్యారెక్టర్ అస్సాసినేషన్‌కు  మధ్య ఉన్న తేడాను గుర్తుచేస్తూ అనేక మంది పోస్టులు పెడుతున్నారు. 

 బహిరంగ క్షమాపణకు డిమాండ్

ఈ ఉదంతంపై నెటిజన్లు మరియు పవన్ అభిమానులు సదరు కమెడియన్‌కు గట్టి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పవన్ కల్యాణ్, ఆయన కుటుంబ సభ్యులకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తప్పవని, గౌరవనీయ పదవిలో ఉన్న వ్యక్తిని మరియు వారి కుటుంబాన్ని కించపరిచినందుకు కేసు నమోదు చేయాలని పోలీసులను కోరుతున్నారు. సోషల్ మీడియాలో ఇప్పటికే పలువురు టెక్ నిపుణులు మరియు న్యాయవాదులు దీనిపై స్పందిస్తూ, ఇది ఐటీ చట్టాల పరిధిలోకి వస్తుందని పేర్కొంటున్నారు.  

 కళ పేరుతో నేరం - చట్టపరమైన పర్యవసానాలు

 క్యారెక్టర్ అస్సాసినేషన్ అనేది కళ కాదు, అది ఒక నేరం  అనే నినాదం ప్రస్తుతం వైరల్ అవుతోంది. గతంలో కూడా కొంతమంది కమెడియన్లు రాజకీయ నాయకులపై స్కిట్లు చేసినప్పటికీ, వ్యక్తిగత దూషణలు మరియు మహిళల ప్రస్తావన వచ్చినప్పుడు తీవ్ర పరిణామాలు ఎదుర్కొన్నారు. ఇదే ధోరణి కొనసాగితే కామెడీ రంగానికి ఉన్న గౌరవం దెబ్బతింటుందని, అసభ్యతను హాస్యం అని పిలవలేమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుతానికి ఈ వ్యవహారంపై అనుదీప్ కొటికల్ నుంచి ఎటువంటి అధికారిక స్పందన రాలేదు. అయితే, సోషల్ మీడియాలో పెరుగుతున్న ఒత్తిడి దృష్ట్యా ఆయన త్వరలోనే వివరణ ఇవ్వాల్సి ఉంటుందని సమాచారం. ఒకవేళ క్షమాపణ చెప్పకపోతే, ఈ వివాదం చట్టపరమైన మలుపు తీసుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

టాప్ హెడ్ లైన్స్

AP Municipal Chairman Reservations: ఏపీలో 106 మున్సిపాలిటీలకు రిజర్వేషన్లు ఖరారు.. మహిళలకు అగ్రతాంబూలం
ఏపీలో 106 మున్సిపాలిటీలకు రిజర్వేషన్లు ఖరారు.. మహిళలకు అగ్రతాంబూలం
AP ZPTC Election Reservations: ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
Municipal Elections 2026 Reservations: ఏపీలో స్థానిక ఎన్నికలు.. మేయర్ స్థానాల రిజర్వేషన్ల జాబితా విడుదల
ఏపీలో స్థానిక ఎన్నికలు.. మేయర్ స్థానాల రిజర్వేషన్ల జాబితా విడుదల
Vijayasai Reddy Party: కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
Vijayasai Reddy Party: కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jantar Mantar: నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
CM Revanth Reddy: ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
AP ZPTC Election Reservations: ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
Vijayasai Reddy Party: కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
Vijayasai Reddy Party: కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
Hyderabad Crime News: బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
Drishyam 3 OTT : అజయ్ దేవగణ్ 'దృశ్యం 3' న్యూ రికార్డ్ - 450 కోట్ల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
అజయ్ దేవగణ్ 'దృశ్యం 3' న్యూ రికార్డ్ - 450 కోట్ల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
October Smartphones Launch: అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
మీ కారు RCని వేరే రాష్ట్రానికి ట్రాన్స్‌ఫర్ చేయాలా? ఆన్‌లైన్‌లోనే పని పూర్తి.. కావాల్సిన పత్రాలు, ఫీజుల వివరాలివే!
వెహికల్‌ RCని ట్రాన్స్‌ఫర్‌ చేయడం ఎలా? పూర్తి ప్రాసెస్‌, ఫీజుల వివరాలు
Embed widget