అన్వేషించండి

YSRCP Mavigan Politics: రాజధానిపై స్కోప్ లేకపోయినా మావిగన్‌ను చర్చకు పెడుతున్న వైసీపీ - రాజకీయంగా లాభం పొందే ప్లానేనా?

Mavigan : వైఎస్ఆర్‌సీపీ మావిగన్ ను ఎందుకు రాజకీయంగా హైలెట్ చేస్తోంది? తమకు అవకాశం వచ్చినప్పుడు చేయలేదు. రాజధానికి రాష్ట్రపతి ఆమోద ముద్రవేసిన తర్వాత చట్ట పెట్టి ఏం లాభం?

Why is YSRCP highlighting Mavigan politically:  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజధాని అంశం మరోసారి సరికొత్త మలుపు తిరిగింది. అమరావతికి కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా చట్టబద్ధత కల్పించి, రాష్ట్రపతి ఆమోదం కూడా లభించిన తరుణంలో.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తెరపైకి తెచ్చిన మావిగన్ ప్రతిపాదన ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. స్కోప్ లేకపోయినా ఈ అంశాన్ని వైసీపీ రోజూ ప్రస్తావిస్తూ చర్చకు పెడుతోంది. 

 ఏమిటీ మావిగన్? జగన్ కొత్త వ్యూహం! 

అమరావతిని కేవలం ఒక పరిమిత ప్రాంతానికే పరిమితం చేయకుండా.. మచిలీపట్నం (MA), విజయవాడ (VI), గుంటూరు (GUN) ప్రాంతాలను కలుపుతూ 110 కిలోమీటర్ల మేర ఒక అర్బన్ కారిడార్‌ ను అభివృద్ధి చేయాలన్నదే జగన్ ప్రతిపాదన. దీనినే ఆయన మావిగన్ గా వ్యవహరిస్తున్నారు. అమరావతి ఒక  తెల్ల ఏనుగు  అని, అక్కడ మౌలిక సదుపాయాల కోసమే రూ. 2 లక్షల కోట్లు ఖర్చవుతాయని, అదే మావిగన్ కారిడార్‌లో ఇప్పటికే ఉన్న వనరులను వాడుకుంటే అతి తక్కువ ఖర్చుతో అద్భుతమైన ఆర్థిక మండలిని నిర్మించవచ్చని ఆయన వాదిస్తున్నారు.

 ముగిసిన అధ్యాయం.. చట్టబద్ధమైన చిక్కులు 

రాజకీయంగా ఈ చర్చ ఎంత జోరుగా సాగుతున్నా, సాంకేతిక ,  చట్టపరమైన కోణంలో రాజధాని అంశం ఇప్పటికే ఒక కొలిక్కి వచ్చింది. ఏపీ పునర్వ్యవస్థీకరణ (సవరణ) చట్టం-2026కు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేయడంతో అమరావతి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏకై, శాశ్వత రాజధానిగా చట్టబద్ధత పొందింది. పార్లమెంటు ఆమోదించిన చట్టాన్ని మార్చడం అంత సామాన్యమైన విషయం కాదు. భవిష్యత్తులో మరే పార్టీ అధికారంలోకి వచ్చినా, రాజధానిని మార్చాలంటే మళ్లీ పార్లమెంటులో చట్టసవరణ జరగాల్సి ఉంటుంది. ఈ కారణంగా మావిగన్ చర్చ కేవలం రాజకీయ విమర్శలకే పరిమితమవుతుందని  భావిస్తున్నారు.

 వైసీపీ ఎందుకు ఈ అంశాన్ని చర్చకు పెడుతోంది? 

ఉపయోగం లేని ఈ అంశంపై వైసీపీ పదేపదే ఎందుకు మాట్లాడుతోందన్నది ఇప్పుడు రాజకీయ వర్గాలను వేధిస్తున్న ప్రశ్న. దీని వెనుక ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది, అమరావతి నిర్మాణంపై జరుగుతున్న భారీ వ్యయం వల్ల రాష్ట్రం అప్పుల ఊబిలోకి వెళ్తోందని ప్రజల్లో ఒక రకమైన ఆందోళన రేకెత్తించడం. రెండోది,  వికేంద్రీకరణ  అనే తమ పాత నినాదానికి కొత్త రూపమిచ్చి ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో తమ పట్టును కాపాడుకోవడం. మూడోది, చంద్రబాబు నాయుడి విజన్‌కు దీటుగా తమకూ ఒక బృహత్తర విజన్  ఉందని చెప్పుకోవడం అనుకోవచ్చు. 

 వ్యూహమా? అపసవ్య రాజకీయమా? 

మొదటి నుంచి వైసీపీ అనుసరిస్తున్న రాజకీయ వ్యూహాలు తరచుగా వివాదాస్పదంగా మారుతున్నాయి. గతంలో మూడు రాజధానుల అంశంపై ఐదేళ్ల పాటు కాలయాపన చేసి, చివరకు ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ.. మళ్లీ అదే తరహాలో కొత్త నినాదాన్ని తీసుకురావడం చర్చనీయాంశమైంది. ఒకవైపు కోర్టులు, మరోవైపు పార్లమెంటు నిర్ణయాలు అమరావతికి అనుకూలంగా ఉన్నా, జగన్ మాత్రం తన  మావిగన్ 2029 నినాదంతో ముందుకు వెళ్తున్నారు. ఇది కేవలం తమ కేడర్‌ను ఉత్సాహపరచడానికి చేస్తున్న ప్రయత్నమా లేక భవిష్యత్తు ఎన్నికలకు సిద్ధం చేస్తున్న కొత్త ఎజెండానా అనేది వేచి చూడాలి.
 
రాజధానిపై పదేపదే ఇలాంటి భిన్నమైన ప్రకటనలు రావడం వల్ల పెట్టుబడిదారులు వెనుకాడే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రపతి గెజిట్ నోటిఫికేషన్ తర్వాత కూడా ఇంకా గందరగోళం సృష్టించడం వల్ల రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతింటుందని ఇతర పార్టీల నేతలు విమర్శిస్తున్నారు. ప్రభుత్వం అమరావతి పనుల్లో వేగం పెంచుతున్న తరుణంలో, వైసీపీ ఈ  మావిగన్  మంత్రాన్ని ఎంతవరకు ప్రజల్లోకి తీసుకెళ్లగలుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది.   

టాప్ హెడ్ లైన్స్

Vijay TVK Win: తమిళనాడు ఉపపోరులో విజయ్ టీవీకే విజయం - ద్రవిడ పార్టీల ఓట్ల చీలికే కాపాడిందా?
తమిళనాడు ఉపపోరులో విజయ్ టీవీకే విజయం - ద్రవిడ పార్టీల ఓట్ల చీలికే కాపాడిందా?
Telangana Politics Personal Attacks: తెలంగాణ రాజకీయం వ్యక్తిగత శత్రుత్వంగా మారుతోందా? - వ్యక్తిత్వాలపై దాడి దేనికి సంకేతం?
తెలంగాణ రాజకీయం వ్యక్తిగత శత్రుత్వంగా మారుతోందా? - వ్యక్తిత్వాలపై దాడి దేనికి సంకేతం?
TVK Wins Tamil Nadu By Polls: తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
Telangana Power Crisis: తెలంగాణలో కరెంట్ కష్టాలు - రూ.5,420 కోట్ల ట్రూ-అప్ షాక్ - ప్రజాగ్రహాన్ని తెలంగాణ ప్రభుత్వం తప్పించుకోగలదా?
తెలంగాణలో కరెంట్ కష్టాలు - రూ.5,420 కోట్ల ట్రూ-అప్ షాక్ - ప్రజాగ్రహాన్ని తెలంగాణ ప్రభుత్వం తప్పించుకోగలదా?

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila: మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
Telangana Politics Personal Attacks: తెలంగాణ రాజకీయం వ్యక్తిగత శత్రుత్వంగా మారుతోందా? - వ్యక్తిత్వాలపై దాడి దేనికి సంకేతం?
తెలంగాణ రాజకీయం వ్యక్తిగత శత్రుత్వంగా మారుతోందా? - వ్యక్తిత్వాలపై దాడి దేనికి సంకేతం?
ACB Raids Civil Supplies DM: సివిల్ సప్లైస్ డీఎం ఇళ్లపై ఏసీబీ దాడులు.. రూ.40 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు , గతంలో రెండు సార్లు సస్పెండ్
సివిల్ సప్లైస్ డీఎం ఇళ్లపై ఏసీబీ దాడులు.. రూ.40 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు , గతంలో రెండు సార్లు సస్పెండ్
కేవలం రూ.21,000తో Renault Duster hybrid బుకింగ్స్ ప్రారంభం.. లీటర్‌కు 29 కి.మీ. అదిరిపోయే మైలేజ్!
లీటర్‌కు 29 కి.మీ. మైలేజ్ ఇచ్చే సూపర్‌ SUV.. రెనాల్ట్‌ డస్టర్ హైబ్రిడ్ బుకింగ్స్ ప్రారంభం, రూ.21,000 చాలు
Vijay TVK Win: తమిళనాడు ఉపపోరులో విజయ్ టీవీకే విజయం - ద్రవిడ పార్టీల ఓట్ల చీలికే కాపాడిందా?
తమిళనాడు ఉపపోరులో విజయ్ టీవీకే విజయం - ద్రవిడ పార్టీల ఓట్ల చీలికే కాపాడిందా?
Samson Storm Reply: వరుస వైఫల్యాల తర్వాత ఊచకోత.. కోహ్లీ ఆల్‌టైమ్ రికార్డును సమం చేసిన సంజూ శాంసన్
వరుస వైఫల్యాల తర్వాత ఊచకోత.. కోహ్లీ ఆల్‌టైమ్ రికార్డును సమం చేసిన సంజూ శాంసన్
కొత్త కారు కొనే ముందు జాగ్రత్త! షోరూమ్‌ రేటు గురించి తప్ప ఈ 5 ఖర్చుల గురించి డీలర్‌ మీకు ముందే చెప్పరు!
కొత్త కారు కొంటున్నారా? షోరూమ్ ధర చూసి మురిసిపోకండి.. మీ జేబుకు చిల్లు పెట్టే 5 అదనపు ఖర్చులివి!
Black Coffee for Weight Loss : బ్లాక్ కాఫీ తాగితే కొవ్వు తగ్గుతుందా? రోజుకు ఎన్ని కప్పులు తాగాలో తెలుసా?
బ్లాక్ కాఫీ తాగితే కొవ్వు తగ్గుతుందా? రోజుకు ఎన్ని కప్పులు తాగాలో తెలుసా?
Embed widget