అన్వేషించండి

AP Cabinet meeting: ముందే ఏపీ కేబినెట్ ఎజెండా లీక్ - మంత్రులపై చంద్రబాబు సీరియస్ - ఎవరి పని?

Chandrababu: ఏపీ కేబినెట్ ఎజెండా ముందుగానే లీక్ కావడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు గోప్యత పాటించడంపై విఫలమైతే ఎలా అని ప్రశ్నించారు.

AP Cabinet agenda being leaked:  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈసారి కాస్త భిన్నమైన వాతావరణంలో సాగింది. ప్రభుత్వం అత్యంత రహస్యంగా ఉంచాల్సిన కేబినెట్ అజెండాలోని కీలక అంశాలు ముందస్తుగానే మీడియాకు చేరడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.  మంత్రివర్గ గోప్యతను కాపాడటంలో విఫలమైతే ఇక కేబినెట్ ఉండి ప్రయోజనం ఏమిటి అని ఆయన మంత్రులను నిలదీశారు. ప్రభుత్వ నిర్ణయాలు అధికారికంగా వెల్లడించే లోపే బయటకు పొక్కడం పాలనా పటిమకు సవాల్ అని ఆయన వ్యాఖ్యానించారు.

చారిత్రక హెచ్చరిక..  నాడు ఎన్టీఆర్.. నేడు నేను!                                      

లీకుల పట్ల అసహనం వ్యక్తం చేస్తూ చంద్రబాబు గత జ్ఞాపకాలను గుర్తుచేశారు. నాడు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ బడ్జెట్ సమాచారం బయటకు వెళ్లినందుకు గాను మొత్తం మంత్రివర్గాన్నే రద్దు చేసిన చారిత్రక ఉదంతాన్ని ప్రస్తావించి ప్రస్తుత మంత్రుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు.  ప్రభుత్వ రహస్యాల రక్షణలో రాజీ పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించే ప్రసక్తే లేదు  అని ఆయన కుండబద్దలు కొట్టినట్లు సమాచారం. పాలనలో క్రమశిక్షణ తప్పితే దాని పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని ఆయన పరోక్షంగా హెచ్చరించారు.

 అధికార యంత్రాంగంపై అసహనం.. సిస్టమ్ మారాలి 

కేవలం మంత్రులకే కాకుండా అధికారుల పనితీరుపై కూడా సీఎం బాబు క్లాస్ తీసుకున్నారు. కేబినెట్ భేటీ సమయానికి ఎజెండా కాపీలు మంత్రులకు అందకపోవడంపై అధికారులను తప్పుపట్టారు. ప్రతి అంశంపై మంత్రులకు ముందస్తు అవగాహన ఉండాలి.  ఫైళ్లను సమర్పించడంలో ఆలస్యం ఎందుకు జరుగుతోంది  అని అధికారులను మందలించారు. గతంలో సెక్రటరీ స్థాయి అధికారులు సబ్జెక్టుపై కమాండ్‌తో ఉండేవారని, నేడు ఆ చొరవ లోపించడం పాలనపై ప్రభావం చూపుతోందని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. 

 ఎన్నికల నగారా.. యుద్ధానికి సిద్ధం!                                    

సమావేశం చివరలో రాబోయే రాజకీయ సవాళ్లపై చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మంత్రులు తమ తమ శాఖల పనితీరును మెరుగుపరుచుకోవాలని సూచించారు. సూర్యఘర్, పీఎం కుసుమ్ వంటి కేంద్ర - రాష్ట్ర ఉమ్మడి పథకాలు ప్రజల్లోకి సమర్థవంతంగా వెళ్లేలా చూడాలన్నారు. ముఖ్యంగా పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ ప్రక్రియను కేవలం ప్రభుత్వ కార్యక్రమంలా కాకుండా, ప్రజలతో మమేకమయ్యే వేదికగా మార్చుకోవాలని మంత్రులకు పిలుపునిచ్చారు.                

టాప్ హెడ్ లైన్స్

Dharmana Prasada Rao : మరో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం తప్పదు - భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ క్రెడిట్ జగన్‌దే - ధర్మాన సంచలన వ్యాఖ్యలు |
మరో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం తప్పదు - భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ క్రెడిట్ జగన్‌దే - ధర్మాన సంచలన వ్యాఖ్యలు |
Breaking News:
"విద్యార్థులపై కాల్పులు జరిపించింది హోంమంత్రే" లోక్‌సభలో రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు
Thalliki Vandanam Cybercrime: తల్లికి వందనం పథకంలో సైబర్ మోసం.. 28 మంది అకౌంట్లలో నగదు మాయం, ట్విస్ట్ ఏంటంటే
తల్లికి వందనం పథకంలో సైబర్ మోసం.. 28 మంది అకౌంట్లలో నగదు మాయం, ట్విస్ట్ ఏంటంటే
Chandrababu 4.0 PR Strategy: చంద్రబాబు 4.0'లో మారిన పీఆర్ మార్క్ - మోదీ వ్యూహంతో రీ-పొజిషనింగ్ - అంతా వైరల్ కంటెంటే!
చంద్రబాబు 4.0'లో మారిన పీఆర్ మార్క్ - మోదీ వ్యూహంతో రీ-పొజిషనింగ్ - అంతా వైరల్ కంటెంటే!

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Inter Student Commits Suicide: నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
GHMC Indiramma Housing Scheme: KCR డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
AP Legislative Council MLC Elections: కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
Jubilee Hills CI Suspension: ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
స్పీడ్ లవర్స్‌కు గుడ్ న్యూస్‌.. కొత్త 2027 కవాసాకి నింజా 300 వచ్చేసింది, అప్పుడే డెలివరీలు కూడా ప్రారంభం
2027 కవాసాకి నింజా 300 ఎంట్రీ.. యూత్‌ కోసం స్మూత్‌ థ్రిల్లింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌, పవర్‌లో తగ్గేదేలే!
Fridge Water : వర్షాకాలంలో ఫ్రిజ్‌లో నీరు ఎక్కువ రావడానికి కారణాలు ఇవే.. ఈ సెట్టింగ్ మార్చి చెక్ పెట్టేయండి
వర్షాకాలంలో ఫ్రిజ్‌లో నీరు ఎక్కువ రావడానికి కారణాలు ఇవే.. ఈ సెట్టింగ్ మార్చి చెక్ పెట్టేయండి
Rains In AP And Telangana: భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
Embed widget