అన్వేషించండి

Telangana Cabinet Reshuffle : తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ఒత్తిళ్లు - రేవంత్ రెడ్డి వ్యూహం ఏంటి?

CM Revanth Cabinet: తెలంగాణ రాజకీయాల్లో మంత్రివర్గ విస్తరణ అంశం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. మంత్రివర్గ మార్పు చేర్పుల కోసం ఆయనపై ఒత్తిడి వస్తోంది.

Revanth Reddy working on the Telangana cabinet reshuffle: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనదైన శైలిలో పాలన సాగిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ అధిష్టానం వద్ద ఆయన పరపతి గతంతో పోలిస్తే గణనీయంగా పెరిగింది. వరుస విజయాలు  తెలంగాణ కాంగ్రెస్‌లో రేవంత్ రెడ్డి మాటకు తిరుగులేని పరిస్థితి కనిపిస్తోంది. 

కేబినెట్ మార్పులపై ఆచి తూచి అడుగులు 

మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న స్థానాలతో పాటు పని చేయని వారిని తీసేసి కొత్త వారితో  భర్తీ చేయాలన్న చర్చ కొంత కాలంగా జరుగుతోంది.  అయితే ఇప్పుడున్న మంత్రులను కదిలించడం ,  కొత్తవారిని తీసుకోవడం వల్ల పార్టీలో అంతర్గత విభేదాలు తలెత్తే ప్రమాదం ఉందని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న టీమ్ తోనే సమన్వయం చేసుకుంటూ వెళ్లడం మేలని ఆయన ఆలోచనగా తెలుస్తోంది. అనవసరంగా కేబినెట్ ప్రక్షాళన చేసి అసంతృప్తికి తావివ్వడం కంటే పాలనపై దృష్టి పెట్టడమే ఉత్తమమని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు సమాచారం. కానీ ఆయనపై ఒత్తిడి పెరుగుతోంది.  ఆశావహులు పలువురు తమ ప్రయత్నాలను ఢిల్లీ స్థాయి నుంచి చేసుకుంటున్నారు. 

సామాజిక సమీకరణాల లెక్కలు                           

మంత్రివర్గ విస్తరణ చేపడితే సామాజిక వర్గాల వారీగా సమతుల్యత పాటించడం రేవంత్ రెడ్డికి పెద్ద సవాలుగా మారనుంది. రెడ్డి సామాజిక వర్గంతో పాటు బీసీ, ఎస్సీ , మైనారిటీ వర్గాలకు సరైన ప్రాతినిధ్యం కల్పించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆశావహుల జాబితా చాంతడంత ఉండటంతో ఎవరిని తీసుకున్నా మిగిలిన వారిలో అసహనం కలిగే అవకాశం ఉంది. ఈ కారణాల వల్ల రేవంత్ రెడ్డి ప్రస్తుతానికి ఎలాంటి రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడటం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ పై హైకమాండ్ నుండి రేవంత్ రెడ్డికి పూర్తి స్వేచ్ఛ లభించినట్లు సమాచారం. ఎవరిని మంత్రిగా తీసుకోవాలి,  ఎవరిని తొలగించాలి అనే నిర్ణయాధికారం ఆయనకే వదిలేసినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ రేవంత్ రెడ్డి తక్షణమే ఈ ప్రక్రియను చేపట్టేందుకు ఆసక్తి చూపడం లేదని ..కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

పరిషత్ ఎన్నికలు, గ్రేటర్ ఎన్నికల తర్వాతే ఆలోచన                      

 బడ్జెట్ సమావేశాలు, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు వంటి   కీలక రాజకీయ పరిణామాల తర్వాతే దీనిపై ఒక నిర్ణయం ఉండవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అప్పటి వరకు ప్రస్తుత మంత్రుల పనితీరును గమనించి ఆ తర్వాతే మార్పులు చేసే అవకాశం ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి తన పట్టును మరింత పెంచుకోవడం పైనే దృష్టి సారించారు. ఆశావహుల్ని ఎలా ఎదురు చూస్తూ ఉండేలా చేయనున్నారు.                           

టాప్ హెడ్ లైన్స్

Modi Cabinet Expansion | దీపావళికి ముందే మోదీ క్యాబినెట్ ప్రక్షాళన!  తెలంగాణ, ఏపీ కోటాలో మార్పులు?
Modi Cabinet Expansion | దీపావళికి ముందే మోదీ క్యాబినెట్ ప్రక్షాళన!  తెలంగాణ, ఏపీ కోటాలో మార్పులు?
SIRపై తెలంగాణ కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్.. హైదరాబాద్‌లో భారీ సభకు రెడీ..
SIRపై తెలంగాణ కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్.. హైదరాబాద్‌లో భారీ సభకు రెడీ..
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Holidays: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా 4 రోజులు సెలవులు, ట్విస్ట్ ఏంటంటే..
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా 4 రోజులు సెలవులు, ట్విస్ట్ ఏంటంటే..
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Ranabaali Day 1 Collections : రణబాలి ఫస్ట్ డే కలెక్షన్స్ - తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఆక్యుపెన్సీ... విరోష్ కపుల్ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే?
రణబాలి ఫస్ట్ డే కలెక్షన్స్ - తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఆక్యుపెన్సీ... విరోష్ కపుల్ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే?
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఒక్క మూవ్‌తో గేమ్ మార్చేసిన త్రిగుణ్! ముకేశ్‌ని హర్ట్‌ చేసిన ఝాన్సీ! కెప్టెన్‌గా రాంప్రసాద్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఒక్క మూవ్‌తో గేమ్ మార్చేసిన త్రిగుణ్! ముకేశ్‌ని హర్ట్‌ చేసిన ఝాన్సీ! కెప్టెన్‌గా రాంప్రసాద్!
Surya Luxury Living:  దుబాయ్‌లో షారుఖ్ ఖాన్ ప్రాజెక్టులో లగ్జరీ ఇల్లు కొన్న సూర్యకుమార్ యాదవ్, వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ సరికొత్త ఇన్వెస్ట్‌మెంట్
దుబాయ్‌లో షారుఖ్ ఖాన్ ప్రాజెక్టులో లగ్జరీ ఇల్లు కొన్న సూర్యకుమార్ యాదవ్, వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ సరికొత్త ఇన్వెస్ట్‌మెంట్
Google Search: గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
కారు ధరకు బైక్.. Royal Enfield Classic 650 హైపర్‌షిఫ్ట్- ఫీచర్లు, ప్రత్యేకతలు ఇవే
కారు ధరకు బైక్.. Royal Enfield Classic 650 హైపర్‌షిఫ్ట్- ఫీచర్లు, ప్రత్యేకతలు ఇవే
Embed widget