అన్వేషించండి

Political Publicity: ప్రధాని పొదుపు పిలుపును పబ్లిసిటీ స్టంట్స్ గా మార్చేస్తున్న నేతలు - దేశమంతా ఇంతే - మారరుగా !

Savings Stunt: ప్రధాని పిలుపునిచ్చిన పొదుపు ఉద్యమం వింతైన పబ్లిసిటీ సర్కస్ లా మారిపోయింది. నిశ్శబ్దంగా జరగాల్సిన ఈ మార్పును నేతలు కెమెరా ఈవెంట్‌గా మార్చేసి ప్రచారం చేసుకుంటున్నారు.

Savings Vs Showoff:  ప్రధాని నరేంద్ర మోదీ దేశ ఆర్థిక క్షేమం కోసం  పొదుపు  పాటించాలని ఇచ్చిన పిలుపును మన రాజకీయ నేతలు అత్యంత వేగంగా స్వీకరించారు. అయితే, వారు స్వీకరించింది  పొదుపు ను కాదు.. దాని చుట్టూ ఉన్న పబ్లిసిటీ ని! ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులు ఎంత పొదుపు చేస్తున్నారనేది పక్కన పెడితే, మేము పొదుపు చేస్తున్నామని చాటిచెప్పుకోవడానికి చేస్తున్న ఖర్చు మాత్రం సామాన్యులను విస్మయానికి గురిచేస్తోంది. మంచి ఆశయం కాస్తా ఇప్పుడు ఒక భారీ  పబ్లిసిటీ స్టంట్ గా మారిపోయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

 సైకిల్ యాత్రలు - డ్రోన్ కెమెరాలు 

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తన కాన్వాయ్‌ను తగ్గించి, బుల్లెట్ ప్రూఫ్ కార్లను వదిలి సాధారణ వాహనాల్లో ప్రయాణిస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు. ఇది హర్షించదగ్గ పరిణామమే అయినా, కొందరు నేతలు చేస్తున్న హడావుడి మాత్రం విచిత్రంగా ఉంది. కొందరు మంత్రులు పెట్రోల్ ఆదా చేయాలంటూ సైకిళ్ల మీద ఆఫీసులకు వెళ్తున్నారు. కానీ, ఆ సైకిల్ తొక్కుతున్న దృశ్యాలను బంధించడానికి ముందు ఒక ఏసీ కారులో వీడియో గ్రాఫర్ల టీమ్, పైన ఒక డ్రోన్ కెమెరా తిరుగుతుండటం చూసి నెటిజన్లు నవ్వుకుంటున్నారు. అంటే సైకిల్ ఆదా చేసిన పెట్రోల్ కంటే, షూటింగ్ కోసం వాడిన కార్లు ఎక్కువ పెట్రోల్ ఖర్చు చేస్తున్నాయన్నమాట!

 ఎకానమీ క్లాస్ సెల్ఫీలు 

ఇక విమాన ప్రయాణాల్లోనూ నేతలు తమ రూటు మార్చారు. బిజినెస్ క్లాస్ వదిలేసి ఎకానమీ క్లాస్‌లో కూర్చుని పక్కన ఉన్న సామాన్యుడితో సెల్ఫీ దిగి,  సామాన్యుడిలా నేను  అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అయితే, ఆ ఒక్క సెల్ఫీ దిగడానికి ఆ నేత వెంట వచ్చే గన్‌మెన్లు, పీఏలు, ఫోటోగ్రాఫర్ల కోసం విడిగా టికెట్లు కొని ప్రభుత్వ ఖజానాకు భారం వేస్తున్నారనే నిజాన్ని ఎవరూ గమనించడం లేదు. ఈ ప్రహసనాన్ని చూస్తున్న తోటి ప్రయాణికులు  ఆర్భాటం తగ్గించుకుంటే చాలు, మా పక్కన కూర్చోనక్కర్లేదు అని అంతర్గతంగా చర్చించుకుంటున్నారు.

 ఫ్లెక్సీల మీద పొదుపు సందేశాలు 

మరో విడ్డూరం ఏమిటంటే.. కాగితం ఆదా చేయాలని, అనవసర ఖర్చులు తగ్గించాలని వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్‌లు పంపుతున్న నేతలు, అదే సందేశాన్ని వందలాది భారీ ఫ్లెక్సీల మీద ముద్రించి నగరం నిండా కట్టేస్తున్నారు. ఒక ఫ్లెక్సీకి అయ్యే ఖర్చుతో పదుల సంఖ్యలో నిరుపేదలకు భోజనం పెట్టవచ్చని, కానీ ఆడంబరాల కోసం చేసే ఈ ఖర్చును  పొదుపు ' అని ఎలా పిలుస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పొదుపు మంత్రం జపిస్తున్న వారు ముందస్తుగా ఈ ఫ్లెక్సీల సంస్కృతికి చెక్ పెడితే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదే స్ఫూర్తిని ఇతర నేతలు కేవలం కెమెరా ముందే కాకుండా, కెమెరా లేనప్పుడు కూడా పాటిస్తేనే దానికి సార్థకత లభిస్తుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చాలా మంది మంత్రులు తమ ఆఫీసుల్లో ఏసీల వాడకం తగ్గిస్తున్నామని చెబుతూనే, విదేశీ పర్యటనలకు భారీ టీమ్స్‌ను వెంటబెట్టుకుని వెళ్లడం ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనంగా కనిపిస్తోంది.

 నిజాయితీ లేని ఆడంబరం దేనికి? 

నిజమైన పొదుపు అనేది నిశ్శబ్దంగా, బాధ్యతాయుతంగా జరగాలి. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు విలాసాలను తగ్గించుకుంటే అది దేశ ఆర్థిక వ్యవస్థకు బలం చేకూరుస్తుంది. కానీ, ప్రతి చిన్న మార్పును మైకులు పట్టుకుని ఊదరగొట్టడం వల్ల ఆ ఆశయం పలచనవుతుంది. ఆర్భాటాల కోసం చేసే ఖర్చును నిజాయితీగా తగ్గిస్తేనే అది ప్రధాని ఆశయానికి గౌరవం తెచ్చినట్లవుతుంది. కేవలం  పబ్లిసిటీ కోసం చేసే ఈ  పొదుపు నాటకాలు ప్రజలు గమనిస్తున్నారని నేతలు గుర్తించాలని నెటిజన్లు అంటున్నారు.  

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bonda Uma TDP: అంబటి భేటీ వివాదంపై బోండా ఉమా యూటర్న్ త్రిసభ్య కమిటీకి వివరణ - పార్టీ లైన్ దాటేదే లేదని ప్రకటన
అంబటి భేటీ వివాదంపై బోండా ఉమా యూటర్న్ - త్రిసభ్య కమిటీకి వివరణ - పార్టీ లైన్ దాటేదే లేదని ప్రకటన
E20 Petrol Controversy: ఇప్పుడు E20 పెట్రోల్‌పై నిరసనలు - కోర్టుకెళ్లిన గడ్కరీ - అసలు ముప్పు ఎవరికి?
ఇప్పుడు E20 పెట్రోల్‌పై నిరసనలు - కోర్టుకెళ్లిన గడ్కరీ - అసలు ముప్పు ఎవరికి?
Chandrababu Serious On Bonda Uma: వైసీపీతో వేదికలు పంచుకుంటే వేటే? - బొండా ఉమా ఎపిసోడ్‌తో టీడీపీ క్రమశిక్షణకు చంద్రబాబు కఠిన పరీక్ష!
వైసీపీతో వేదికలు పంచుకుంటే వేటే? - బొండా ఉమా ఎపిసోడ్‌తో టీడీపీ క్రమశిక్షణకు చంద్రబాబు కఠిన పరీక్ష!
Mudragada Kapu Reservation Legacy: కాపు రిజర్వేషన్లపై వైసీపీ నేతల భారీ ప్రకటనలు - పార్టీ విధానాన్ని మార్పించగలరా?
కాపు రిజర్వేషన్లపై వైసీపీ నేతల భారీ ప్రకటనలు - పార్టీ విధానాన్ని మార్పించగలరా?
Advertisement

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
Maruti Brezza 2026: మారుతి బ్రెజ్జాలో బడ్జెట్‌ ఫ్రెండ్లీ వేరియంట్‌ ఇదే! - తగ్గిన ధర, పెరిగిన ఫీచర్లు
2026 మారుతి బ్రెజ్జా పూర్తి ధరల జాబితా విడుదల - ఏ వేరియంట్‌ రేటు ఎంతంటే?
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Driving Safety Tips: రోడ్డు మీద హీరో కావాలంటే స్పీడ్ కాదు.. సేఫ్టీ ముఖ్యం! ప్రతి డ్రైవర్ తప్పక తెలుసుకోవాల్సిన టిప్స్
బండి స్పీడ్‌లో ఉంది.. కానీ బ్రెయిన్‌ అలర్ట్‌గా ఉందా? ప్రమాదాలను తప్పించే సింపుల్ ట్రిక్స్
Embed widget