Peddireddy On Chandrababu : మైనింగ్‌లో అప్పటి అక్రమాలు ఆపేశాం - చంద్రబాబుకు పెద్దిరెడ్డి కౌంటర్ !
ఏపీలో మైనింగ్ అక్రమాలు జరగడం లేదని పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు.
Peddireddy On Chandrababu : ఆంధ్రప్రదేశ్‌లో విచ్చలవిడిగా అక్రమ మైనింగ్ చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆరోపణలను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఖండించారు. గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకల్ని నిర్మూలించామని ఇప్పుడు ఎలాంటి అవకతవకలు జరగకుండా మైనింగ్ జరుగుతోందన్నారు. చంద్రబాబు నాయుడు హయాంలో పెంచి పోషించిన మైనింగ్ మాఫియాకు అడ్డుకట్ట వేస్తూ, మా ప్రభుత్వం పలు సంస్కరణలు చేప్టటామన్నారు. అందుకే మైనింగ్ శాఖకు దేశంలోనే మూడవ బెస్ట్ ర్యాంకు వచ్చిందన్నారు. రాష్ట్రంలో కొండల్ని, చెరువులను తవ్వేస్తున్నారంటూ ఆరోపణలు చేయడం విడ్డూరమని ఆరోపణల్లో ఎలాంటి వాస్తవాలు లేవని పెద్దిరెడ్డి తెలిపారు.
కలెక్టర్ అవతారమెత్తిన మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, కమిషనర్ కు సీరియస్ వార్నింగ్!
రిషికొండలో ఎలాంటి అక్రమాలు జరగలేదని.., పర్యావరణ అనుమతులు ఇచ్చిన ప్రకారమే అక్కడ మట్టి తవ్వకాలు జరిగాయని అందుకు ప్రభుత్వానికి ఆ సంస్థ రూ.6 కోట్లు రాయిల్టీ కూడా చెల్లించిందన్నారు. సిమెంట్ తయారీలో కేవలం 3 శాతం మాత్రమే లేటరైట్ వినియోగిస్తారని.., మరి, భారతీ సిమెంట్ రోజుకు 1000 లారీల లేటరైట్ ఎందుకు కొనుగోలు చేస్తుందని ఆయన ప్రశ్నించారు. 2014-19 మధ్య లేటరైట్ తవ్వకుండానే సిమెంటు పరిశ్రమలు నడిచాయా అనేది చంద్రబాబే చెప్పాలన్నారు.
ఒక్కొక్కరి అకౌంట్లో రూ.10 వేలు వేయనున్న సీఎం జగన్
కుప్పంలో చంద్రబాబు ఆరోపిస్తున్నట్టు 75 అక్రమ మైనింగ్ ప్రాంతాల్లో.. ఆ లీజులన్నీ ఇచ్చింది గత టీడీపీ ప్రభుత్వంతో పాటు అంతకుమందు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇచ్చినవేనని తెలిపారు. కాంగ్రెస్, టిడిపి హయాంలోనే మొత్తం 71 లీజులకు అనుమతులు ఇచ్చారని.., వాటిల్లో ప్రస్తుతం 31 లీజులు పనిచేస్తున్నాయని.., 71 లీజులకు డిమాండ్ నోటీసులు ఇచ్చి నిలిపేసినట్లు తెలిపారు. కాటసాని బ్రదర్స్ మైనింగ్ పేరుతో తాను బినామీ వ్యాపారం చేస్తున్టన్లుగా చంద్రబాబు చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమన్నారు.
జగన్, కేసీఆర్‌కు కేఏ పాల్ బంపర్ ఆఫర్! చంద్రబాబు, పవన్‌కు కూడా - ‘విమానాలూ పంపుతా’
సీఎంగా ఉన్నప్పుడు కృష్ణా కరకట్ట పక్కన ఇంటి పక్కనే కృష్ణా నదీ గర్భంలో పెద్దఎత్తున ఇసుక అక్రమ తవ్వకాలు జరిగితే చంద్రబాబు కళ్ళప్పగించి చూస్తూ ఉన్నాడే తప్ప అడ్డుకోలేదన్నారు. ఇసుక దోపిడీపై ఎన్జీటీ రూ. 100 కోట్లు జరిమానా వేసింది మరిచారా ? అని ప్రశ్నించారు. అయితే తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం శాటిలైట్ చిత్రాలతో సహా తమ వద్ద పూర్తి సమాచారం ఉందని తమ ప్రభుత్వం రాగానే విచారణ జరిపించి ప్రజాధనం కక్కిస్తామని అంటున్నారు.