అన్వేషించండి

Janasena expansion in South: దక్షిణాదిన పార్టీ విస్తరణ దిశగా పవన్ మాస్టర్ ప్లాన్స్ - సినిమాలు చేస్తూ సాధ్యమేనా?

Pawan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన పార్టీని ఇతర రాష్ట్రాల్లోనూ విస్తరించే దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే ఆయన సినిమాలు చేస్తూ పార్టీని విస్తరించడం సాధ్యమేనా అన్న ప్రశ్న అందరిలోనూ వస్తోంది.

Pawan is silently expanding the Jana Sena party in the South:  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన పార్టీని కేవలం ఆంధ్రప్రదేశ్‌కే పరిమితం చేయకుండా, ఇతర రాష్ట్రాల్లోనూ విస్తరించే దిశగా అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో మాజీ ఎమ్మెల్యే పి.ఎస్. ప్రకాష్ వంటి నేతలు పార్టీలో చేరడం జనసేన జాతీయ విస్తరణ  ప్రయత్నాలకు ప్రారంభం అనుకోవచ్చు. 

త్రిశూల్ వ్యూహంతో పార్టీ విస్తరణ
   
జనసేన పార్టీ ప్రస్థానంలో 2024 ఎన్నికలు ఒక మైలురాయిగా నిలిచాయి. ఆంధ్రప్రదేశ్‌లో 100% స్ట్రైక్ రేట్‌తో విజయం సాధించిన తర్వాత, పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన రాజకీయ దృష్టిని పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణ .  తమిళనాడు వైపు మళ్లిస్తున్నారు. బెంగళూరులోని చిక్‌పేట్ మాజీ ఎమ్మెల్యే పి.ఎస్. ప్రకాష్ పార్టీలో చేరడం ద్వారా కర్ణాటకలో ఉన్న తెలుగు జనాభా మరియు,  పవన్ కళ్యాణ్ అభిమాన గణం   మద్దతును ఓటు బ్యాంకుగా మార్చుకోవాలని ఆయన భావిస్తున్నారు. ఇది కేవలం ఒక చేరిక మాత్రమే కాదు, కర్ణాటక రాజకీయాల్లో జనసేన ముద్ర వేయడానికి వేసిన తొలి అడుగుగా విశ్లేషకులు భావిస్తున్నారు.పవన్ కళ్యాణ్ ప్రవేశపెట్టిన  త్రిశూల్ వ్యూహంలో పార్టీ విస్తరణ ఒక కీలకమైన భాగం. ఈ వ్యూహం ప్రకారం.. పార్టీ కేవలం ఒక వ్యక్తి చరిష్మాపై ఆధారపడకుండా, ఇతర రాష్ట్రాల్లో కూడా క్షేత్రస్థాయి నాయకత్వాన్ని నిర్మించడమే లక్ష్యం. కర్ణాటకలోని బళ్లారి, రాయచూరు, బెంగళూరు వంటి ప్రాంతాల్లో తెలుగు మాట్లాడే ప్రజలు అధికంగా ఉండటం జనసేనకు కలిసొచ్చే అంశం. గతంలోనే కర్ణాటక ఎన్నికల సమయంలో పవన్ నిర్వహించిన ప్రచారానికి వచ్చిన స్పందనను చూసి, అక్కడ సొంతంగా క్యాడర్‌ను నిర్మించుకుంటే భవిష్యత్తులో కింగ్ మేకర్‌గా ఎదిగే అవకాశం ఉందని ఆయన అంచనా వేస్తున్నారు.

ప్రాంతీయ శక్తిగా ఎదగాలన్నది పవన్ దీర్ఘకాలిక లక్ష్యం

కేవలం ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో భాగస్వామిగా ఉండటమే కాకుండా, దక్షిణాది రాష్ట్రాల్లో ఒక బలమైన ప్రాంతీయ శక్తిగా ఎదగాలన్నది పవన్ దీర్ఘకాలిక లక్ష్యం. సనాతన ధర్మం, సామాజిక న్యాయం వంటి అంశాలపై ఆయన చేస్తున్న ప్రసంగాలు ఇతర రాష్ట్రాల్లోని యువతను కూడా ఆకర్షిస్తున్నాయి. కర్ణాటకలో మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ చేరికతో అక్కడ జనసేన జెండా అధికారికంగా  ఎగరడం ప్రారంభమయింది.  రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో లేదా తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటకలోని కొన్ని స్థానాల్లో పోటీ చేయడం ద్వారా తన సత్తా చాటాలని జనసేనాని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

తెలంగాణ, తమిళనాడులోనూ బలంగా విస్తరణ 

కర్ణాటక తర్వాత పవన్ చూపు తెలంగాణ , తమిళనాడుపై ఉంది. తెలంగాణలో ఇప్పటికే జనసేనకు బలమైన అనుచరగణం ఉంది, అక్కడ సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టం చేసేందుకు సభ్యత్వ నమోదు కార్యక్రమాలను కూడా ముమ్మరం చేశారు. పొరుగు రాష్ట్రాల్లోని నేతలు జనసేన సిద్ధాంతాల పట్ల ఆకర్షితులై పార్టీలోకి రావడం అనేది పవన్ కళ్యాణ్ రాజకీయ పరిణతిని , పెరుగుతున్న ఆయన జాతీయ స్థాయి ఇమేజ్‌ను సూచిస్తోంది. ముఖ్యంగా బీజేపీతో ఉన్న మిత్రధర్మం .  కేంద్రంలో ఆయనకు ఉన్న ప్రాముఖ్యత ఈ విస్తరణకు మరింత తోడ్పడుతున్నాయి.

పవన్ ముందు బలమైన సవాళ్లు

 ఇతర రాష్ట్రాల్లో విస్తరణ అనేది అంత సులభమైన విషయం కాదు. అక్కడ ఇప్పటికే స్థిరపడిన ప్రాంతీయ పార్టీలను, జాతీయ పార్టీలను ఢీకొని నిలబడాలంటే కేవలం అభిమానం సరిపోదు, బలమైన ఆర్థిక వనరులు, క్షేత్రస్థాయి యంత్రాంగం అవసరం. పి.ఎస్. ప్రకాష్ వంటి సీనియర్ నేతల అనుభవం కర్ణాటకలో పార్టీ పునాదులు వేయడానికి ఉపయోగపడవచ్చు. పవన్ కళ్యాణ్ తన సినిమాలను పక్కన పెట్టి పూర్తిస్థాయిలో ఇతర రాష్ట్రాలపై దృష్టి సారిస్తేనే ఈ  విస్తరణ కల  సాకారమయ్యే అవకాశం ఉందని ఎక్కువ మంది నమ్మకం.  

టాప్ హెడ్ లైన్స్

BJP All Cells Joint Coordinator: విద్యార్థి నాయకుడి నుంచి జాతీయ పదవి దాకా.. బీజేపీ ఆల్ సెల్స్ జాయింట్ కో-ఆర్డినేటర్‌గా ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి నియామకం !
విద్యార్థి నాయకుడి నుంచి జాతీయ పదవి దాకా.. బీజేపీ ఆల్ సెల్స్ జాయింట్ కో-ఆర్డినేటర్‌గా ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి నియామకం !
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
BJP New National Executive: నితిన్ నవీన్ టీంలో పురందేశ్వరి, రాంమాధవ్, విష్ణువర్థన్ రెడ్డి - తెలంగాణ నేతలకు దక్కని చోటు !
నితిన్ నవీన్ టీంలో పురందేశ్వరి, రాంమాధవ్, విష్ణువర్థన్ రెడ్డి - తెలంగాణ నేతలకు దక్కని చోటు !
MLC Nagababu Cabinet Rank: కేబినెట్ హోదా’తో సరిపెట్టిన పవన్ వ్యూహం.. నాగబాబుకు ఇక మంత్రి యోగం లేనట్లేనా?
కేబినెట్ హోదా’తో సరిపెట్టిన పవన్ వ్యూహం.. నాగబాబుకు ఇక మంత్రి యోగం లేనట్లేనా?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget