అన్వేషించండి

Vijayawada City: విజయవాడ పాతనగరంపై పట్టు కోసం పోటాపోటీ - సెంట్రల్ చేజిక్కించుకునేందుకు ఇరుపార్టీల తంటాలు

ViJayawada City: విజయవాడలో రాజకీయం రంజుగా మారింది. నేతలు వివిధ పార్టీలు మారగా...పార్టీలు అభ్యర్థులను మార్చేసింది. పశ్చిమలో కొత్త, సెంట్రల్‌లో సీనియర్ల మధ్య పోటీ

Vijayawada West: ఎన్టీఆర్ జిల్లా విజయవాడ  లోక్‌సభ పరిధిలోని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 1967 నియోజకవర్గాల పునర్విభజన చట్టం అనుసరించి ఏర్పడింది. మొత్తం విజయవాడ (Vijayawada) పాత నగరం పరిధిలో ఉండే ఈ నియోజికవర్గం పూర్తిగా అర్బన్‌ ప్రాంతం. ప్రస్తుతం  వెలంపల్లి శ్రీనివాసరావు(Vellampalli Srinivasarao) వైసీపీ నంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇప్పుడు ఆయన సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీపడుతున్నారు. అక్కడ మూడోసారి బొండా ఉమ(Bonda uma) అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

పాతనగరంపై పట్టెవరది..?
విజయవాడ(Vijayawada) పాతనగరంపై పట్టుకోసం వామపక్షాలు, కాంగ్రెస్ మధ్య తీవ్రమైన పోటీ ఉండేది. రాజకీయాల్లో  పైచేయి కోసమే విజయవాడలో రౌడీయిజం పుట్టింది. ఎన్నికల్లో ఆధిపత్యం కోసం ఎన్నో హత్యలు జరిగాయి. వెలుగులోకి రాని ఘోరాలు చాలా చూసింది బెజవాడ. ముస్లింలు, వైశ్యులు అధికంగా ఉండే విజయవాడ పశ్చమ(Vijayawada West)లో కాంగ్రెస్‌దే పైచేయి అని చెప్పాలి. తెలుగుదేశం(Telugudesam) ఆవిర్భావం సందర్భంగా 1983లో తప్ప మరెప్పుడూ ఇక్కడ గెలిచిన దాఖలాలు లేవు. ఎక్కువసార్లు పొత్తులో భాగంగా మిత్రపక్షాలకు ఈ సీటు కేటాయిస్తుంది. 1967లో తొలిసారి ఇక్కడ ఎన్నికలు జరగ్గా...మూడుసార్లు వరుసగా కాంగ్రెస్(Congress) గెలుపొంది హ్యాట్రిక్ సాధించింది. ఆ పార్టీ నుంచి తొలిసారి మరుపిల్లి చిట్టి గెలుపొందగా...1972లో అసిప్ బాషా విజయం సాధించారు. 1978లో పోతిన చిన్నా  కాంగ్రెస్‌ నుంచి గెలుపొందారు. తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత 1983లో జరిగిన ఎన్నికల్లో  బి.ఎస్. జయరాజు(B.S.Jayaraju) తొలిసారి టీడీపీ నుంచి జయకేతనం ఎగురవేశారు. 1985లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, వామపక్షాల పొత్తులో భాగంగా ఈ సీటు సీపీఐకి కేటాయించగా...ఆ పార్టీ నుంచి ఉప్పలపాటి రామచంద్రరాజు గెలుపొందారు. 1989లో కాంగ్రెస్ నుంచి ఎం.కె.బేగ్ విజయంసాధించగా.. 1994లో మళ్లీ సీపీఐ(CPI) నుంచి కాకర్లపూడి సుబ్బరాజు గెలుపొందారు. 1999లో కాంగ్రెస్ పార్టీ  నుంచి జలీల్‌ఖాను జెండా ఎగురవేశారు. 2004లో షేక్‌ నసీర్‌వలీ సీపీఐ నుంచి గెలుపొందారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేసిన వెలంపల్లి శ్రీనివాసరావు కాంగ్రెస్ అభ్యర్థి మల్లికాభేగం(Mallika Bhegaum)పై 8,300 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఆ తర్వాత ప్రజారాజ్యం(Prajarajaym) కాంగ్రెస్‌లో విలీనం కావడంతో వెలంపల్లి శ్రీనివాస్‌ బీజేపీలో చేరారు. 2014 ఎన్నికల్లో  ఆయన బీజేపీ(BJP) తరపున బరిలో దిగగా...వైసీపీ నుంచి జలీల్‌ఖాన్ పోటీ చేసి గెలుపొందారు. తదనంతరం జలీల్‌ఖాన్ తెలుగుదేశం పార్టీలో చేరగా...వెలంపల్లి శ్రీనివాస్‌ వైసీపీలోకి వెళ్లారు. 2019 ఎన్నికల్లో వెలంపల్లి వైసీపీ నుంచి బరిలో దిగగా...తెలుగుదేశం నుంచి జలీల్‌ఖాన్ కుమార్తె షబానాను  పోటీచేయించారు. ఈ ఎన్నికల్లో  వెలంపల్లి శ్రీనివాస్ విజయం సాధించి...జగన్(Jagan) ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు ఆయన విజయవాడ సెంట్రల్(Vijayawada Central) నియోజకవర్గానికి మారగా....వైసీపీ నుంచి షేక్ అసిఫ్‌ పోటీపడుతున్నారు. ఆయనపై ఎన్డీఏ కూటమి అభ్యర్థి బీజేపీ(BJP) నుంచి సుజనాచౌదరి(Sujana Chowdary) రంగంలోకి దిగారు.

మధ్య నగరంపై  గురి
2008 నియోజకవర్గాల పునర్విభజన చట్టం ప్రకారం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఏర్పాటైంది. కంకిపాడు, ఉయ్యూరు  నియోజకవర్గాలను  రద్దు చేసి విజయవాడ తూర్పు, సెంట్రల్, పెనమలూరు నియోజకవర్గాలను ఏర్పాటు చేశారు. ఆ విధంగా  విజయవాడ పశ్చిమలో కొంత భాగాన్ని,అప్పటి విజయవాడ తూర్పులో కొంతభాగాన్ని  తీసుకుని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం  ఏర్పాటైంది. పూర్తిగా అర్బన్ నియోజకవర్గమైన  విజయవాడ సెంట్రల్‌కు తొలిసారి 2009లో ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్‌ నుంచి మల్లాది విష్ణు(Malladhi Vishnu) సమీప ప్రజారాజ్యం అభ్యర్థి వంగవీటి రాధపై విజయం సాధించారు. కేవలం 848 ఓట్ల తేడాతో విష్ణు  గెలుపొందారు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం నుంచి బొండా ఉమమహేశ్వరరావు  వైసీపీ అభ్యర్థి గౌతంరెడ్డిపై  27వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. గత ఎన్నికల్లో తెలుగుదేశం నుంచి మరోసారి  బొండా ఉమ పోటీపడగా....వైసీపీ నుంచి మల్లాది విష్ణు  పోటీ చేశారు. కేవలం 25 ఓట్లు తేడాతో మల్లాది విష్ణు జయకేతనం ఎగురవేయడం విశేషం. ఈ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మల్లాది విష్ణు...రెండుసార్లు కూడా స్పల్ప మెజార్టీతో విజయలక్ష్మీని అందుకున్నారు. ఇప్పుడు తెలుగుదేశం నుంచి మూడోసారి బొండా ఉమ పోటీపడుతుండగా.. వైసీపీ నుంచి మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ బరిలో దిగారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Samantha Father Death: సమంత ఇంట్లో విషాదం... తండ్రిని కోల్పోయిన స్టార్ హీరోయిన్
సమంత ఇంట్లో విషాదం... తండ్రిని కోల్పోయిన స్టార్ హీరోయిన్
Telangana News: ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త, వారికి సైతం సమానంగా చెల్లింపు
Telangana News: ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త, వారికి సైతం సమానంగా చెల్లింపు
Pawan Kalyan: తూర్పు తీరంలో దేశ భద్రతకు ముప్పు, ఉగ్రవాది కసబ్ ఎలా వచ్చాడు- పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
తూర్పు తీరంలో దేశ భద్రతకు ముప్పు, ఉగ్రవాది కసబ్ ఎలా వచ్చాడు- పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
Audi Q7 Facelift: ఆడీ క్యూ7 ఫేస్‌లిఫ్ట్ వచ్చేసింది - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
ఆడీ క్యూ7 ఫేస్‌లిఫ్ట్ వచ్చేసింది - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మురళి కృష్ణుడి అలంకారంలో  శ్రీప‌ద్మావ‌తి అమ్మవారునర్సుపై కొడవలితో దాడి, లవర్ పనే..! సీసీటీవీ వీడియోఊరి మీద విరుచుకుపడి ప్రాణాలు తీసేసిన పెద్దపులిISKCON Monk Chinmoy Krishna Das Arrest In Bangladesh | బంగ్లాదేశ్ లో మైనార్టీలపై హింసకు ఇదే నిదర్శనం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Samantha Father Death: సమంత ఇంట్లో విషాదం... తండ్రిని కోల్పోయిన స్టార్ హీరోయిన్
సమంత ఇంట్లో విషాదం... తండ్రిని కోల్పోయిన స్టార్ హీరోయిన్
Telangana News: ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త, వారికి సైతం సమానంగా చెల్లింపు
Telangana News: ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త, వారికి సైతం సమానంగా చెల్లింపు
Pawan Kalyan: తూర్పు తీరంలో దేశ భద్రతకు ముప్పు, ఉగ్రవాది కసబ్ ఎలా వచ్చాడు- పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
తూర్పు తీరంలో దేశ భద్రతకు ముప్పు, ఉగ్రవాది కసబ్ ఎలా వచ్చాడు- పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
Audi Q7 Facelift: ఆడీ క్యూ7 ఫేస్‌లిఫ్ట్ వచ్చేసింది - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
ఆడీ క్యూ7 ఫేస్‌లిఫ్ట్ వచ్చేసింది - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Kakinada Pawan Kalyan: కాంప్రమైజ్ అయిపోయారా - రైస్ స్మగ్లింగ్‌లో టీడీపీ ఎమ్మెల్యేపై పవన్ ఆగ్రహం - కాకినాడ పోర్టులో తనిఖీలు
కాంప్రమైజ్ అయిపోయారా - రైస్ స్మగ్లింగ్‌లో టీడీపీ ఎమ్మెల్యేపై పవన్ ఆగ్రహం - కాకినాడ పోర్టులో తనిఖీలు
Lagacharla Land Acquisition:: లగచర్ల భూసేకరణ రద్దు- తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం 
లగచర్ల భూసేకరణ రద్దు- తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం 
Pawan Delhi: నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
Tiger Attack Komaram Bheem Asifabad District News: కొమురంభీం జిల్లాలో దారుణం- పెద్దపులి దాడిలో మహిళ మృతి- భయాందోళనలో స్థానికులు
కొమురంభీం జిల్లాలో దారుణం- పెద్దపులి దాడిలో మహిళ మృతి- భయాందోళనలో స్థానికులు
Embed widget