News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Newsclick: న్యూస్ క్లిక్ పోర్టల్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థా అరెస్ట్

చైనాకు అనుకూలంగా వార్తలు రాస్తోందని ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యూస్ క్లిక్ పోర్టల్ పై  మరో కొత్త కేసు నమోదు చేశారు.

FOLLOW US: 
Share:

చైనాకు అనుకూలంగా వార్తలు రాస్తోందని ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యూస్ క్లిక్ పోర్టల్ పై  మరో కొత్త కేసు నమోదు చేశారు దిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు. ఆ సంస్థకు చెందిన కార్యాలయంతో, జర్నలిస్టుల ఇళ్లు సహా 30 ప్రదేశాలలో దాడులు నిర్వహించారు. న్యూస్ క్లిక్ ఎడిటర్ ఇన్ చీఫ్తో పాటు పలువురు జర్నలిస్టులను స్పెషల్ సెల్ పోలీసులు తమ కార్యాలయానికి తీసుకెళ్లారు.

న్యూస్ క్లిక్ ఆన్ లైన్ పోర్టల్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థాను ఢిల్లీ పోలీసుల అరెస్ట్ చేశారు. ఆయనతోపాటు మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. చైనా అనుకూల ప్రచారానికి నిధులు అందుకున్నారని ఆరోపణలు రావడంతో ఉప చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ న్యూస్ ఫోటోలకు విదేశీ నిధులపై దర్యాప్తు నేపథ్యంలో ఆయనను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం ఉదయం 30 చోట్ల జర్నలిస్టుల ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహించారు. డిజిటల్ పరికరాలు, పలు డాక్యుమెంట్లను సీజ్ చేశారు.

ఇప్పటివరకు ప్రబీర్ పుర్కాయస్థతో పాటు ఆ సంస్థ హెచ్ఆర్ హెడ్ అమిత్ చక్రవర్తిని అరెస్టు చేసినట్లు ఢిల్లీ పోలీస్ అధికార ప్రతినిధి సుమన్ నల్వా వెల్లడించారు. అయితే అమిత్ చక్రవర్తికి ఈ కేసుతో ఏమిటి సంబంధం అనే వివరాలు పోలీసులు వెల్లడించలేదు. 

పోలీసుల తీరుపై విమర్శలు...
మరోవైపు న్యూస్ క్లిక్ తో సంబంధం ఉన్న జర్నలిస్టులు, రచయితల ఇళ్లపై పోలీసులు దాడి చేయడంపై ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తాము ఈ పరిణామాలను పర్యవేక్షిస్తున్నామని వివరాలతో వెల్లడిస్తామంటూ ట్వీట్ చేసింది. న్యూస్ క్లిక్ పై దాడులు విపక్ష కూటమి ఇండియా నేతలు తీవ్రంగా ఖండించారు. వాస్తవాలు మాట్లాడే వారి గళాన్ని అణచివేసేందుకు కేంద్రం సోదాలు చేసిందని విమర్శించారు. బీహార్ లో కుల గణనలో బయటపడిన విషయాల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి కేంద్రం న్యూస్ క్లిక్ అంశాన్ని తెరపైకి తీసుకు వచ్చిందని విపక్షాలు మండిపడ్డాయి.

న్యూస్ క్లిక్ సంస్థకు చైనా నుంచి నిధులు అందుతున్నాయి అంటూ ఈ ఏడాది ఆగస్టులో న్యూయార్క్ టైమ్స్ లో కథనం ప్రచూరితమైంది. చైనా ప్రభుత్వానికి సన్నిహితంగా ఉండే అమెరికా మిలియనీర్ నివిల్ రాయి సింగం నుంచి గ్లోబల్ నెట్వర్క్ లో భాగంగా ఉన్న న్యూస్ క్లిక్ నిధులు పొందినట్లు ఆ కథలలో పేర్కొంది. దీంతో చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు మంగళవారం న్యూస్ క్లిక్ ఆఫీస్ తో పాటు ఆ సంస్థలో పనిచేసే జర్నలిస్టుల ఇల్లు సహా మొత్తం 30చోట్ల సోదాలు జరిపారు. ఈ సందర్భంగా భారీగా పోలీసు బలగాలను మోహరించారు. 

పోలీసు దాడుల విషయాన్ని ఇద్దరు జర్నలిస్టులు ధ్రువీకరించారు. తమ ల్యాప్‌టాప్‌లు, ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్‌ ద్వారా వెల్లడించారు. అంతకుముందు న్యూస్ క్లిక్ కు  ఫండింగ్ ఎక్కడినుంచి వస్తుందనే విషయమై దిల్లీలోని ఆ సంస్థ కార్యాలయంపై ఈడీ సోదాలు నిర్వహించింది. ఈడీ ఇచ్చిన సమాచారంతోనే ప్రస్తుతం దిల్లీ పోలీసు ప్రత్యేక విభాగం పోలీసులు దాడులు చేస్తున్నారని తెలుస్తోంది.

Published at : 03 Oct 2023 11:41 PM (IST) Tags: Delhi arrested Journalists NewsClick Prabir Purkayastha

ఇవి కూడా చూడండి

Telangana BJP : ఎమ్మెల్యేలుగా ప్రమాణానికి  బీజేపీ దూరం - అక్బరుద్దీనే కారణమన్న రాజాసింగ్ !

Telangana BJP : ఎమ్మెల్యేలుగా ప్రమాణానికి బీజేపీ దూరం - అక్బరుద్దీనే కారణమన్న రాజాసింగ్ !

BRSLP Meeting : బీఆర్ఎస్ ఎల్పీ నేతగా కేసీఆరే - కాంగ్రెస్ సర్కార్ పై పోరాటానికి రెడీ !

BRSLP Meeting :  బీఆర్ఎస్ ఎల్పీ నేతగా కేసీఆరే -  కాంగ్రెస్ సర్కార్ పై పోరాటానికి రెడీ !

ఢిల్లీకి బయల్దేరిన సీఎం రేవంత్‌ రెడ్డి- మంత్రివర్గ విస్తరణ శాఖ కేటాయింపుపై చర్చలు

ఢిల్లీకి బయల్దేరిన సీఎం రేవంత్‌ రెడ్డి- మంత్రివర్గ విస్తరణ శాఖ కేటాయింపుపై చర్చలు

ప్రజాభవన్‌ వద్ద కేసీఆర్‌ పేరుపై మట్టిపూత- సెల్ఫీలు తీసుకుంటున్న సందర్శకులు - వద్దని వారించిన బండ్ల గణేష్

ప్రజాభవన్‌ వద్ద కేసీఆర్‌ పేరుపై మట్టిపూత- సెల్ఫీలు తీసుకుంటున్న సందర్శకులు - వద్దని వారించిన బండ్ల గణేష్

Nitish Kumar: నితీష్ మాటలను పట్టించుకోని రాహుల్ గాంధీ, అదే కాంగ్రెస్ కొంప ముంచిందా?

Nitish Kumar: నితీష్ మాటలను పట్టించుకోని రాహుల్ గాంధీ, అదే కాంగ్రెస్ కొంప ముంచిందా?

టాప్ స్టోరీస్

Free Bus Journey to Women: మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - మార్గదర్శకాలివే

Free Bus Journey to Women: మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - మార్గదర్శకాలివే

Extra Ordinary Man Review - ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ రివ్యూ: నితిన్ నవ్వించారా? హిట్ అందుకుంటారా?

Extra Ordinary Man Review - ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ రివ్యూ: నితిన్ నవ్వించారా? హిట్ అందుకుంటారా?

CM Jagan Vs TDP : టీడీపీ, వైసీపీ మధ్య పొటాటో రాజకీయం - అంతా జగనే చేశారా ?

CM Jagan Vs TDP :   టీడీపీ, వైసీపీ మధ్య పొటాటో రాజకీయం -  అంతా జగనే చేశారా ?

Best Selling EV Brands: భారతదేశంలో బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ కారు కంపెనీలు ఇవే - టాప్‌లో ఏ కంపెనీ ఉందంటే?

Best Selling EV Brands: భారతదేశంలో బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ కారు కంపెనీలు ఇవే - టాప్‌లో ఏ కంపెనీ ఉందంటే?