అన్వేషించండి

Telangana Municipal Elections Results 2026: మున్సిపల్ ఫలితాలు రేవంత్ పాలకు రిఫరెండమేనా? చరిత్ర చెప్పేది మాత్రం భిన్నం !

Municipal verdictఛ తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు తమ పాలనకు ఆమోదం అని కాంగ్రెస్ ప్రకటించుకుంటోంది. కానీ చరిత్ర మాత్రం వేరే విధంగా లెక్క తేలుస్తోంది.

Municipal verdict is not  referendum:   తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై రాజకీయ పార్టీలు ఎవరి విశ్లేషణ వారు చేసుకుంటున్నారు.  ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ ఎన్నికలను ప్రభుత్వ పాలనకు  రిఫరెండం గా తీసుకోవాలని సవాల్ విసిరారు.  మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆ సవాల్‌ను వ్యక్తిగతంగా స్వీకరిస్తానని బదులిచ్చారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికలను ఎప్పుడూ ప్రభుత్వ పనితీరుకు సంపూర్ణ రిఫరెండంగా భావించలేమని చరిత్ర చెబుతోంది. 

అధికార పక్షానికే పట్టం.. సహజ సూత్రం 

సాధారణంగా ఏ రాష్ట్రంలోనైనా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినప్పుడు ఓటర్లు అధికారంలో ఉన్న పార్టీ వైపు మొగ్గు చూపడం ఒక సహజమైన ప్రక్రియ. మున్సిపాలిటీలు,  పంచాయతీలు అభివృద్ధి చెందాలన్నా, నిధులు సకాలంలో విడుదల కావాలన్నా రాష్ట్ర ప్రభుత్వ సహకారం తప్పనిసరి. అందుకే, ప్రజలు తమ స్థానిక వార్డుల అభివృద్ధిని కాంక్షించి, అధికార పార్టీ అభ్యర్థులకే ఓటు వేసేందుకు ప్రాధాన్యత ఇస్తారు. ఇది  పాలనపై మెప్పు కాదు, స్థానిక అవసరాల కోసం తీసుకునే ఒక వ్యూహాత్మక నిర్ణయం మాత్రమే అనుకోవచ్ు. 

 గత చరిత్ర చెబుతున్న సత్యం 

చరిత్రను పరిశీలిస్తే స్థానిక ఎన్నికల ఫలితాలకు, అసెంబ్లీ ఎన్నికల తీర్పునకు పొంతన ఉండదు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం నాలుగు మున్సిపాలిటీలకే పరిమితమైంది. కానీ, సరిగ్గా మూడున్నరేళ్ల తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అదే కాంగ్రెస్ అనూహ్య విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. దీన్ని బట్టి చూస్తే, స్థానిక సంస్థల ఫలితాలు రాబోయే అసెంబ్లీ ఎన్నికల భవిష్యత్తును నిర్ణయించవని స్పష్టమవుతోంది.

విపక్షాల వాదన - గెలిచినప్పుడు మౌనం 

ప్రభుత్వ వ్యతిరేకతను చాటిచెప్పేందుకు విపక్షాలు ఏ ఎన్నికలు జరిగినా వాటిని  రిఫరెండం  అని పిలవడం రివాజుగా మారింది. అయితే, ఫలితాలు ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చినప్పుడు మాత్రం ఆ అంశంపై విపక్షాలు మౌనం వహిస్తాయి. నిజానికి స్థానిక ఎన్నికల్లో గెలుపు ఓటములు అభ్యర్థుల వ్యక్తిగత ప్రభావం, స్థానిక కుల సమీకరణాలు , ప్రభుత్వ అండదండలపై ఆధారపడి ఉంటాయి తప్ప, కేవలం ముఖ్యమంత్రి పనితీరుపైనే ఆధారపడి ఉండవు.

అభివృద్ధికి లభించిన అదనపు బలం 

ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన ఆధిక్యాన్ని ప్రభుత్వం మరింత వేగంగా అభివృద్ధి చేయడానికి ప్రజలు ఇచ్చిన మద్దతుగా చూడాలి. అధికార పార్టీకి క్షేత్రస్థాయిలో బలం చేకూరడం వల్ల ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి వేగంగా వెళ్లే అవకాశం ఉంటుంది. వార్డు మెంబర్లు, చైర్మన్లు అధికార పార్టీ వారే ఉంటే పాలనలో సమన్వయం సులభమవుతుందనే భావనతోనే ఓటర్లు ఈ తీర్పు ఇచ్చారని విశ్లేషించవచ్చు. కేటీఆర్ విసిరిన రిఫరెండం సవాల్ రాజకీయ విమర్శలకు వేదికగా మారినప్పటికీ, క్షేత్రస్థాయిలో ఓటరు నాడి వేరుగా ఉంది. స్థానిక సంస్థలు నిలబడాలంటే రాష్ట్ర ప్రభుత్వ మద్దతు అవసరమని భావించిన ఓటర్లు, ప్రస్తుత ప్రభుత్వానికి మరింత బాధ్యతను అప్పగించారు. ఈ ఫలితాలు ప్రభుత్వానికి బలాన్ని ఇచ్చాయి తప్ప, ప్రజాభిప్రాయం పూర్తిగా  ప్రభుత్వానికి అనుకూలంగా ఉందని చెప్పలేం. 

టాప్ హెడ్ లైన్స్

Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Rebel BRA MLAs looking back | ఫిరాయింపు ఎమ్మెల్యేల ‘రివర్స్ గేర్’.. గులాబీ గూటివైపు చూపులు?
Rebel BRA MLAs looking back | ఫిరాయింపు ఎమ్మెల్యేల ‘రివర్స్ గేర్’.. గులాబీ గూటివైపు చూపులు?
Telangana Graduate MLC Elections 2027: పట్టభద్రుల ఎమ్మెల్సీలుగా పోటీకి యువనేతలు పోటాపోటీ -అన్ని పార్టీలు యువతకే ప్రాధాన్యం ఇవ్వనున్నాయా?
పట్టభద్రుల ఎమ్మెల్సీలుగా పోటీకి యువనేతలు పోటాపోటీ -అన్ని పార్టీలు యువతకే ప్రాధాన్యం ఇవ్వనున్నాయా?
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి భారత్ జన వికాస్ పార్టీ - బీజేపీ నో.. వైసీపీ క్లోజ్! మళ్లీ రీ-ఎంట్రీ వెనుక మర్మమేంటి?
విజయసాయిరెడ్డి భారత్ జన వికాస్ పార్టీ - బీజేపీ నో.. వైసీపీ క్లోజ్! మళ్లీ రీ-ఎంట్రీ వెనుక మర్మమేంటి?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Embed widget