అన్వేషించండి

Mrps: ఏపీలో ఎన్డీయే కూటమికి ఎమ్మార్పీఎస్ మద్దతు - 35 అంశాలతో చంద్రబాబుకు మందకృష్ణ మాదిగ వినతి

Andhrapradesh News: ఏపీలో ఎన్డీయే కూటమికి మద్దతిస్తున్నట్లు ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలిపారు. ఆదివారం ఆయన టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యి 35 అంశాలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు.

Mrps Mandakrishna Madiga Meet Chandrababu: సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో ఎన్డీయే కూటమికి మద్దతు ఇచ్చేందుకు ఎమ్మార్పీఎస్ నిర్ణయించిందని అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ (Mandakrishna Madiga) తెలిపారు. ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబుతో (Chandrababu) ఆయనతో సహా ఎమ్మార్పీఎస్ (Mrps) నేతలు ఆదివారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణ, మాదిగలకు రాజకీయ ప్రాధాన్యతపై చర్చించారు. టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎం.ఎస్.రాజుకు అవకాశం కల్పించాలని చంద్రబాబు దృష్టికి తెచ్చారు. అలాగే, వైసీపీ ప్రభుత్వం దళితులకు రద్దు చేసిన పథకాలు తిరిగి ప్రారంభించాలని బాబును కోరారు. దాదాపు 35 అంశాలతో కూడిన వినతి పత్రాన్ని ఆయనకు అందజేశారు. 'కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత మొట్టమొదటి సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేయాలి. రాజ్యాంగ బద్ద సంస్థల్లో మాదిగ వర్గానికి తగు ప్రాధాన్యం ఇవ్వాలి. అలాగే అన్ని కార్పొరేషన్లలో, నామినేటెడ్ పదవుల్లో తమ వర్గానికి ప్రాధాన్యం ఇవ్వాలి.' అని చంద్రబాబును కోరారు.

టీడీపీ గెలుపుతోనే..

టీడీపీతో మాదిగలది శాశ్వత బంధమని చంద్రబాబు అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం విజయానికి మాదిగలు కీలక పాత్ర పోషించాలని సూచించారు. '40 ఏళ్లుగా పార్టీని మాదిగ సామాజికవర్గం ఆదరిస్తోంది. అలాంటి మాదిగ వర్గాన్ని పైకి తెచ్చేందుకు టీడీపీ ఎప్పుడూ ప్రాధాన్యం ఇస్తుంది. టీడీపీ గెలుపు మాదిగల గెలుపు అవుతుంది. ప్రభుత్వంపై తెలుగుదేశం ఎంత గట్టిగా పోరాడుతుందో.. అంతకంటే గట్టిగా ఎమ్మార్పీఎస్ పోరాటం చేస్తోంది. మాదిగ సామాజిక వర్గాన్ని అధికారంలో భాగస్వాములను చేస్తాం. దళితులపై వైసీపీ ప్రభుత్వ దమనకాండను ఎదుర్కోవడంలో మందకృష్ణ పోరాటం అభినందనీయం.' అని చంద్రబాబు పేర్కొన్నారు.

సీఎం జగన్ పై విమర్శలు

మాదిగలను ఆకాంక్షలను టీడీపీ అధినేత చంద్రబాబు ముందుంచామని.. అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి ప్రాధాన్యతలో అవన్నీ నెరవేరుస్తామని ఆయన హామీ ఇచ్చినట్లు మందకృష్ణ మాదిగ తెలిపారు. వర్గీకరణ విషయంలో జగన్ మాదిగలను మోసం చేశారని.. సుప్రీంకోర్టులో వర్గీకరణ విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అడ్వకేటును కూడా పెట్టలేదని విమర్శించారు. మాదిగల సంక్షేమాన్ని జగన్ గాలికి వదిలేశారని ధ్వజమెత్తారు. మాదిగలంతా వచ్చే ఎన్నికల్లో కూటమి గెలుపు కోసం పని చేస్తారని స్ఫష్టం చేశారు. ఈ నెల 30న గుంటూరులో ఎన్నికల ప్రచార సరళిపై రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు. గ్రామ స్థాయి నుంచి ఇంటింటికీ వెళ్లి కూటమి గెలుపు కోసం ప్రచారం నిర్వహిస్తామని వెల్లడించారు. 'కేంద్రంలో మోదీపై, రాష్ట్రంలో చంద్రబాబుపై మాకు నమ్మకం ఉంది. మాదిగలకు రాజకీయ ప్రాతినిథ్యం కల్పిస్తామని బాబు హామీ ఇచ్చారు. 29 రిజర్వుడ్ సీట్లలో మాదిగలకు జగన్ కేవలం 10 స్థానాలు మాత్రమే ఇస్తే.. చంద్రబాబు టీడీపీ పోటీ చేసే 24లో 14 మాదిగలకు కేటాయించారు. జనసేన పోటీ చేసే రిజర్వుడ్ స్థానాలు మూడింటిలో ఒకటి మాదిగలకు ఇవ్వాలని పవన్ ను కోరుతాం. ఎన్డీయే కూటమి గెలుపు మాదిగల గెలుపగా భావిస్తాం.' అని మందకృష్ణ పేర్కొన్నారు.

ఆశావహుల క్యూ

మరోవైపు, టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి ఆదివారం ఆశావహులు క్యూ కట్టారు. ఆఖరి జాబితాలో తమకు టిక్కెట్ కేటాయించేలా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ డేగల ప్రభాకర్ ను వెంటబెట్టుకుని చంద్రబాబును కలిశారు. అటు, కంది చంద్రశేఖర్ అభ్యర్థిత్వాన్ని విజయనగరం లోక్ సభ కోసం పరిశీలించాలని మాజీ మంత్రి పతివాడ నారాయణ స్వామి కోరారు. భీమిలి టికెట్ కోసం కోరాడ రాజబాబు ప్రయత్నిస్తున్నారు.

Also Read: Svsn Varma: 'పవన్ కల్యాణ్ ను భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం' - 3 పార్టీలు సమన్వయంతో పని చేసేందుకు ప్రణాళిక సిద్ధమన్న టీడీపీ ఇంఛార్జీ వర్మ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Assembly: ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
KTR: 'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
CM Chandrababu: 'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Aus vs India First Test Day 1 Highlights | భారత పేసర్ల ధాటికి కుయ్యో మొర్రోమన్న కంగారూలు | ABP DesamAus vs Ind First Test First Innings | పెర్త్ లో పేకమేడను తలపించిన టీమిండియా | ABP Desamపేలిన ఎలక్ట్రిక్ స్కూటీ, టాప్ కంపెనీనే.. అయినా బ్లాస్ట్!ప్రసంగం మధ్యలోనే  ఏడ్చేసిన కాకినాడ కలెక్టర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Assembly: ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
KTR: 'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
CM Chandrababu: 'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
AP Assembly PAC Issue: జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
TTD : టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్ - ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్- ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
AR Rahman Award: విడాకులతో వార్తల్లో నిలిచిన రెహమాన్‌కు అవార్డు... అంత బాధలో చిరు ఊరట, ఆ గుడ్ న్యూస్ ఏమిటంటే?
విడాకులతో వార్తల్లో నిలిచిన రెహమాన్‌కు అవార్డు... అంత బాధలో చిరు ఊరట, ఆ గుడ్ న్యూస్ ఏమిటంటే?
Devaki Nandana Vasudeva Review - దేవకీ నందన వాసుదేవ రివ్యూ: కృష్ణుడు కంసుడి కథకు కొత్త టచ్ - మహేష్ మేనల్లుడి సినిమా ఎలా ఉందంటే?
దేవకీ నందన వాసుదేవ రివ్యూ: కృష్ణుడు కంసుడి కథకు కొత్త టచ్ - మహేష్ మేనల్లుడి సినిమా ఎలా ఉందంటే?
Embed widget