అన్వేషించండి

Komatireddy Venkat Reddy : తుది శ్వాస వరకూ కాంగ్రెస్‌లోనే - బీజేపీలో చేరిక ప్రచారాన్ని ఖండించిన కోమటిరెడ్డి !

బీజేపీలో చేరబోతున్నారని జరుగుతున్న ప్రచారాన్ని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఖండించారు. తుది శ్వాస వరకూ కాంగ్రెస్‌లోనే ఉంటానన్నారు.

భారతీయ జనతాపార్టీ లో చేరబోతున్నారని ( BJP ) జరుగుతున్న ప్రచారంపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ( MP Komati Reddy ) స్పందించారు. ఆ ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు. తుదిశ్వాస విడిచే వరకు కాంగ్రెస్‌ పార్టీలోనే కొనసాగుతానని ప్రకటించారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా ఢిల్లీలో ఉన్న ఆయన మరో ఎంపీ, టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో ( Revanth Reddy ) కలిసి మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు. ఒకే ఇంట్లోనే ఎన్నో గొడవలు ఉంటాయని.. అలాంటిది కాంగ్రెస్‌ పార్టీలో విభేదాలు ఉండటం సహజమన్నారు. బీజేపీ,టీఆర్ఎస్‌లలో  కాంగ్రెస్‌ కన్నా ఎక్కువ గొడవలున్నాయన్నారు. 

రేవంత్ వర్సెస్ సీనియర్ల పంచాయతీకి ముగింపు ఎప్పుడు ? పంజాబ్ గుణపాఠాన్ని కాంగ్రెస్ నేతలు నేర్చుకోలేదా ?

ఇటీవల కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రధానమంత్రి నరేంద్రమోదీని ( PM Modi ) కలిశారు. ఆయనకు అపాయింట్‌మెంట్ ఇప్పించడంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలకంగా పని చేశారని.. త్వరలో ఆయనను కమలం గూటికి చేరుస్తారన్న ప్రచారం జరిగింది. అదే సమయంలో కోమటిరెడ్డి సోదరుడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ( Rajagopal Reddy ) కాంగ్రెస్‌లో తాను ఉండబోవడం లేదని ప్రకటించారు. గౌరవం లేని చోట ఉండలేనని ప్రకటించారు. దీంతో సోదరులిద్దరూ కలిసి బీజేపీలోకి వెళ్తారని ప్రచారం జరిగింది. గతంలో పలుమార్లు బీజేపీని పొగిడిన రాజగోపాల్ రెడ్డి తాను ఆ పార్టీలో చేరుతానని ప్రకటించారు కూడా. అయితే తాను   అభివృద్ధి కోసం ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర మంత్రులను కలిశానని రాజకీయాలకు సంబంధం లేదన్నారు.  తన సోదరుడు, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి ( Munugodu MLA ) అభిప్రాయాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని అవి ఆయన వ్యక్తిగత అభిప్రాయాలన్నారు. 

‘ముత్యాలముగ్గు’లో హీరోయిన్‌లా నా పరిస్థితి, రేవంత్ రెడ్డే విలన్ : జగ్గారెడ్డి

కోమటిరెడ్డి వెంకటరెడ్డి పీసీసీ చీఫ్ పదవి ఆశించారు. అయితే ఆ పదవిని హైకమాండ్ రేవంత్ రెడ్డికి అప్పగించింది. దీంతో కోమటిరెడ్డి తీవ్ర అసంతృప్తికి గురై పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. అయితే తర్వాత సైలెంటయ్యారు. ఇటీవల రేవంత్ రెడ్డితో కలిసి పనిచేస్తున్నారు. కోమటిరెడ్డి ఇంటికి రేవంత్ రెడ్డి కూడా వెళ్లారు. అనూహ్యంగా ప్రదానిని కోమటిరెడ్డి కలవడంతో బీజేపీలో చేరుతున్నారన్న ప్రచారం ఊపందుకుంది. ఇప్పుడు తుది శ్వాస వరకూ కాంగ్రెస్‌లోనే ( Congress ) ఉంటానని కోమటిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BRS: అదానీ, రేవంత్ భాయ్ భాయ్ టీషర్టులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు - అసెంబ్లీలోకి నో ఎంట్రీ, పోలీసులతో వాగ్వాదం
అదానీ, రేవంత్ భాయ్ భాయ్ టీషర్టులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు - అసెంబ్లీలోకి నో ఎంట్రీ, పోలీసులతో వాగ్వాదం
Crime News: నంద్యాల జిల్లాలో ఘోరం - ప్రేమించలేదని బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఇంటర్ విద్యార్థి
నంద్యాల జిల్లాలో ఘోరం - ప్రేమించలేదని బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఇంటర్ విద్యార్థి
Telangana Thalli Statue: ఆ విగ్రహం తెలంగాణ తల్లి కాదు కాంగ్రెస్ తల్లి- మేం తిరస్కరిస్తున్నాం : కవిత
ఆ విగ్రహం తెలంగాణ తల్లి కాదు కాంగ్రెస్ తల్లి- మేం తిరస్కరిస్తున్నాం : కవిత
Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బంగ్లాదేశ్ జెండా  చించేసిన రాజా సింగ్ఆ ఊళ్లోనే పెద్దపులి తిష్ట! డ్రోన్లతో గాలింపుభారత్ ఘోర ఓటమి ఆసిస్ సిరీస్ సమంరైతులకు నో ఎంట్రీ, రోడ్లపై ఇనుప మేకులు, బోర్డర్‌లో భారీ బందోబస్తు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS: అదానీ, రేవంత్ భాయ్ భాయ్ టీషర్టులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు - అసెంబ్లీలోకి నో ఎంట్రీ, పోలీసులతో వాగ్వాదం
అదానీ, రేవంత్ భాయ్ భాయ్ టీషర్టులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు - అసెంబ్లీలోకి నో ఎంట్రీ, పోలీసులతో వాగ్వాదం
Crime News: నంద్యాల జిల్లాలో ఘోరం - ప్రేమించలేదని బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఇంటర్ విద్యార్థి
నంద్యాల జిల్లాలో ఘోరం - ప్రేమించలేదని బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఇంటర్ విద్యార్థి
Telangana Thalli Statue: ఆ విగ్రహం తెలంగాణ తల్లి కాదు కాంగ్రెస్ తల్లి- మేం తిరస్కరిస్తున్నాం : కవిత
ఆ విగ్రహం తెలంగాణ తల్లి కాదు కాంగ్రెస్ తల్లి- మేం తిరస్కరిస్తున్నాం : కవిత
Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
Pushpa 2 First Weekend Collection: నార్త్‌లో ఆదివారం దుమ్ము దులిపిన పుష్ప 2 - అల్లు అర్జున్ మూవీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఎంతంటే?
నార్త్‌లో ఆదివారం దుమ్ము దులిపిన పుష్ప 2 - అల్లు అర్జున్ మూవీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఎంతంటే?
WhatsApp Message Reminder: ‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
Special Trains: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
Embed widget