News
News
వీడియోలు ఆటలు
X

AP MLC Elections : ఒక్క ఓటుతో జాతకాల తారుమారు - ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై తీవ్ర ఉత్కంఠ !

ఏపీలో శాసన మండలి ఎన్నికల ఉత్కంఠ

ఏడు స్థానాల కోసం బరిలో ఎనిమిది మంది

వైసీపీ తరపున ఒక్కరు క్రాస్ ఓటు చేసినా టీడీపీకి సీటు

ఎవరైనా గైర్హాజర్ అయినా, చెల్లని ఓటు వేసినా కష్టమే

ఎన్నికల్లో ఏం జరగబోతోంది ?

FOLLOW US: 
Share:

AP MLC Elections :  గురువారం ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనుననాయి. మెత్తం ఏడు స్దానాలకు 8మంది అభ్యర్దులు పోటీ పడుతున్నారు.  ఎన్నిక రాజకీయం రసవత్తరంగా మారింది.అధికార ప్రతి పక్షాల మధ్య రాజకీయం హైలైట్ గా మారింది. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకూ అసెంబీలి కమిటి హాలులో జరగనున్న ఓటింగ్ తరువాత  సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. వెంటనే ఫలితాలు తెలుస్తాయి. 

టీడీపీ తరపున బరిలో పంచుమర్తి అనూరాధ ! 

వైసీపీ నుంచి ఏడుగురు, టీడీపీ నుంచి ఒకరు నామినేషన్ దాఖలు చేశారు. వైసీపీ నుంచి బరిలో  జయమంగళ వెంకట రమణ,- మర్రి రాజశేఖర్, చంద్రగిరి ఏసురత్నం, బొమ్మి ఇజ్రాయిల్, కోలా గురువులు, పోతుల సునీత, పెనుమత్స సూర్యనారాయరాజు ఉన్నారు. టీడీపీ నుంచి బరిలో లోకి విజయవాడ మాజీ మేయర్ పంచుమర్తి అనురాధ తెర మీదకు వచ్చారు. ఇప్పటికే ఎమ్మెల్యేలకు ఎన్నికల పై  దిశా నిర్దేశం చేసిన అధికార,  ప్రతిపక్ష పార్టీలు  ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.  ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఇరు పార్టీలకు కీలకంగా మారింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ రెబల్ ఎమ్మెల్యేలు, అసంతృప్తి ఎమ్మెల్యేల ఓటు కీలకంగా మారింది. మరో వైపున అసంతృప్తి ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు, మంత్రులు సైతం రంగంలోకి దిగారు. 

వైసీపీ ఎమ్మెల్యేలంతా విజయవాడలోనే మకాం ! 

ముత్తం శాసన సభ్యులు   విజయవాడలోనే ఉన్నారు. కీలక ఎమ్మెల్యేలకు, మంత్రులకు పూర్తి బాధ్యతలు  అప్పగించారు. ఒక్కో శాసన మండలి సభ్యుడి బాధ్యతను 22మంది ఎమ్మెల్యేలకు అప్పగించారు. అప్పగించిన సభ్యులతో ఓటు వేయించే బాధ్యత మంత్రులదే  అని   సీఎం  జగన్ తెలిపారు. రెండు రోజుల  క్రితం  అసెంబ్లీ వేదికగా  నాలుగు సార్లు మాక్ పోల్ నిర్వహించారు. మరో సారి కూడా ఎలా ఓటు వెయ్యాలి  అనే అంశంపై శాసన సభ్యులకు మంత్రులు,ఇ తర కీలక నేతలు దిశా నిర్దేశం చేయనున్నారు. ఎవరికి కేటాయించిన గ్రూప్ సభ్యులతో వారు విడివిడిగా సమావేశాల నిర్వహిస్తున్నారు.
 
పంచుమర్తి అనురాధ నామినేషన్‌తో మారిన సీన్ ! 

తెలుగు దేశం పార్టీ ఇటీవల జరిగిన శాసన మండలి ఎన్నికల్లో అనూహ్యంగా మూడు స్దానాలను దక్కించుకుంది. దీంతో ఆ పార్టీ నేతల్లో ఉత్సాహం రెట్టింపయ్యింది. అదే ఊపులో ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో కూడా తెలుగు దేశం పార్టి అభ్యర్దీని నిలబెట్టింది.  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న అసంతృప్తి ఎమ్మెల్యేల ఓటింగ్ పై కూడ అనుమానాలు తలెత్తున్నాయి. అధికార పార్టీకి చెందిన నేతలు పూర్తిగా ఎన్నికల పైనే దృష్టి పెట్టారు. తెలుగు దేశం మూడు స్దానాలు కైవసం చేసుకోవటంతో తీవ్రంగా ఖంగుతిన్న వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టి ఆ తరవాత జరుగుతున్న ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లో పై చేయి సాదించేందుకు అలర్ట్ అయ్యింది.  

ఒక్క ఓటుతో మారిపోనున్న ఓ అభ్యర్థి జాతకం !
 
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒకరిద్దరు ఎమ్మెల్యేలు క్రాస్ ఓట్ చేసినా… చెల్లని ఓటు వేసినా టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనూరాధ గెలుస్తారు. అధికార పార్టీలో కొంత మంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారన్న ప్రచారం కొంత కాలంగా సాగుతోంది. ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు బయట పడ్డారు. అలా జిల్లాకు ఒకరు చొప్పున సైలెంట్ గా ఉంటున్న ఎమ్మెల్యేల విషయంలో ఇంటిలిజెన్స్‌ వర్గాలు కూడా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి చేరవేసినట్లు తెలుస్తుంది. దీంతో ఏడో స్థానం విషయంలో ఆయన టెన్షన్ పడిపోతున్నారు. సీఎం జగన్‌ ఒక్కో మంత్రికి 22 మంది ఎమ్మెల్యేలను అప్పగించి ఏడుగురుతో ఒక కమిటీ ఏర్పాటు చేశారు. సభ్యులందరికీ మాక్‌ పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. ఓటు ఎలా వేయాలన్న దానిపై అవగాహన కల్పిస్తున్నారు. ఎవరూ ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పు చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అనుమానంగా ఉన్న వారితో ప్రత్యేకంగా మాట్లాడుతన్నారు. పొరపాటున ఎవరైనా దారి తప్పిదే అది తీవ్ర ప్రభావం చూపిస్తుంది. జగన్ పట్టు జారిపోయిందన్న అభిప్రాయం కల్పిస్తుంది. అందుకే వైసీపీ అప్రమత్తమయింది. 

Published at : 23 Mar 2023 05:50 AM (IST) Tags: YSRCP Panchumarthi Anuradha Legislative Council Election MLA Kota Legislative Council Election

సంబంధిత కథనాలు

Kakinada MP Vanga Geetha: వైసీపీ ఎంపీ వంగా గీత నుంచి ప్రాణహాని! స్పందనలో  కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన ఆడపడుచు

Kakinada MP Vanga Geetha: వైసీపీ ఎంపీ వంగా గీత నుంచి ప్రాణహాని! స్పందనలో కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన ఆడపడుచు

Case On AP BJP Leader Devanan : పోస్టింగ్‌ల పేరుతో హోంశాఖ సెక్రటరీ సంతకం ఫోర్జరీ - ఏపీబీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షుడిపై ఢిల్లీలో కేసులు !

Case On AP BJP Leader Devanan : పోస్టింగ్‌ల పేరుతో హోంశాఖ సెక్రటరీ సంతకం ఫోర్జరీ - ఏపీబీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షుడిపై ఢిల్లీలో కేసులు !

Telangana politics : వేర్వేరుగా టీడీపీ, బీజేపీ అంతర్గత విస్తృత చర్చలు - తెలంగాణ రాజకీయాల్లో ఏం జరుగుతోంది ?

Telangana politics :  వేర్వేరుగా టీడీపీ, బీజేపీ అంతర్గత విస్తృత చర్చలు - తెలంగాణ రాజకీయాల్లో ఏం జరుగుతోంది ?

కాంగ్రెస్‌లోకి జూపల్లి, పొంగులేటి- ఈ నెలలోనే జాయినింగ్స్!

కాంగ్రెస్‌లోకి జూపల్లి, పొంగులేటి- ఈ నెలలోనే జాయినింగ్స్!

Varahi Yatra Poster: పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పోస్టర్ ఆవిష్కరించిన జనసేన

Varahi Yatra Poster: పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పోస్టర్ ఆవిష్కరించిన జనసేన

టాప్ స్టోరీస్

‘ఆదిపురుష్’ టీమ్ 7 నెలలు నిద్రపోకుండా పనిచేశారు, చిరంజీవి ఆశ్చర్యపోయారు: ప్రభాస్ - కన్నీళ్లు పెట్టుకున్న ఓంరౌత్

‘ఆదిపురుష్’ టీమ్ 7 నెలలు నిద్రపోకుండా పనిచేశారు, చిరంజీవి ఆశ్చర్యపోయారు: ప్రభాస్ - కన్నీళ్లు పెట్టుకున్న ఓంరౌత్

Academic Calendar: తెలంగాణలో పాఠశాలల కొత్త అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల - పరీక్షలు, సెలవుల వివరాలు ఇలా!

Academic Calendar: తెలంగాణలో పాఠశాలల కొత్త అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల - పరీక్షలు, సెలవుల వివరాలు ఇలా!

Cyclone Biparjoy: అరేబియా సముద్రంలో బిపర్‌జోయ్ తుపాను, వచ్చే 5 రోజులు ఇక్కడే బీభత్సమే - ఐఎండీ హెచ్చరిక

Cyclone Biparjoy: అరేబియా సముద్రంలో బిపర్‌జోయ్ తుపాను, వచ్చే 5 రోజులు ఇక్కడే బీభత్సమే - ఐఎండీ హెచ్చరిక

Odisha Train Accident: రైలు ప్రమాదంలో మృతుల సంఖ్యపై ఒడిశా ప్రభుత్వం కీలక ప్రకటన, మళ్లీ పాత మాటే!

Odisha Train Accident: రైలు ప్రమాదంలో మృతుల సంఖ్యపై ఒడిశా ప్రభుత్వం కీలక ప్రకటన, మళ్లీ పాత మాటే!