YSRCP Seema Tension: కృష్ణా బోర్డు కోసం కర్నూలు వాసుల పోరాటం - ధర్మదీక్షలకు పిలుపు ! వైఎస్ఆర్‌సీపీకి మరో టెన్షన్ తప్పదా ?
వైఎస్ఆర్‌సీపీకి కర్నూలు సెంటిమెంట్ ఇబ్బందికరంగా మారుతోంది. కృష్ణాబోర్డు కోసం రాయలసీమ ఉద్యమ సంఘాలు ధర్మదీక్ష లకు పిలుపునిచ్చాయి.
YSRCP Seema Tension : ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైఎస్ఆర్‌సీపీకి ఇప్పుడు రాయలసీమ సెంటిమెంట్ రివర్స్ అవుతున్నట్లుగా కనిపిస్తోంది. న్యాయరాజధాని అంశంపై సుప్రీంకోర్టులో చేసిన వాదనలు, జ్యూడిషియల్ అకాడమీని అమరావతికి తరలించడంతో పాటు తాజాగా కేఆర్ఎంబీ విషయంలోనూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమవుతోంది. ధర్మదీక్ష పేరుతో రాయలసీమకు న్యాయం చేయాలని కొన్ని సంఘాలు ఉద్యమబాట పట్టడం చర్చనీయాంశమవుతోంది.
కెఆర్ ఎంబి కార్యాలయాన్ని కర్నూలులో ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో ధర్మదీక్ష
రాష్ట్ర విభజన చట్టం 2014 ప్రకారం ఏర్పాటైన కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు కార్యాలయం ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంది. గోదావరి రివర్ మేనేజ్ మెంట్ బోర్డును తెలంగాణకు.. కృష్ణాబోర్డును ఏపీకి కేటాయించారు. ఈ బోర్డు కార్యాలయాన్ని విశాఖకు తరలించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. కృష్ణానదిపై కీలకమైన ప్రాజెక్టు ఉన్న ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రాం తంలో కాకుండా కృష్ణాజలాలకు సంబంధం లేని విశాఖపట్టణంలో కెఆర్ ఎంబి కార్యాలయం ఏర్పాటు చేయడమేమిటన్న వాదన రాయలసీమ వాసులలో వినిపిస్తోంది. అందుకే కెఆర్ ఎంబి కార్యాలయాన్ని కర్నూలులో ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో చేస్తున్న ఆందోళనల పరంపరంలో భాగంగా రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆధ్వర్యంలో ఈ నెల 18న నంద్యాల జిల్లా కలెక్టరేట్ వద్ద భారీ ఎత్తున ధర్మదీక్ష నిర్వహించనున్నారు.
కృష్ణా జలాల వివాద పరిష్కారానికి కృష్ణా బోర్డు !
కృష్ణా జలాల పంపకంలో ఎలాంటి వివాదాలు రాకుండా రాష్ట్ర విభ జన చట్టం 2014 కృష్ణా రివర్ మేనేజిమెంట్ బోర్డు కెఆర్‌ఎంబి అనే సాధికార వ్యవస్ధ రూపకల్పనకు నిర్దేశించింది. కారణా లేవైనా రాష్ట్ర ప్రభుత్వం బోర్డును విశాఖపట్టణం లో ఏర్పాటు చేయాలని గత ఏడాది సిఫార్సు చేయడంతో వి వాదం మొదలైంది. మొత్తం కృష్ణాజలాల వినియోగానికి సం బంధించిన అత్యంత కీలకమైన శ్రీశైలం ప్రాజెక్టు రాయలసీమ ప్రాంతానికి చెందిన ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉండగా, బో ర్డు ప్రధాన కార్యాలయాన్ని కృష్ణా జలాలతో సంబంధం లేని విశాఖపట్టణంలో ఏర్పాటు చేయడమేమిటని రాయలసీమ ఉద్యమవాదులు ప్రశ్నిస్తున్నారు. ఒకవిధంగా కృష్ణా జలాలకు సంబంధించిన వివాదమనే ఫుట్‌బాల్ ఆట రాయలసీ మలో జరుగుతుండగా, దగ్గరుండి పర్యవేక్షించాల్సిన రెఫరీ వంటి బోర్డు ఎక్కడో వైజాగ్‌లో ఉండడమేమిటని రాయల సీమవాదులు ప్రశ్నిస్తున్నారు. పలురకాల ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు చేసిన రాయలసీమ సాగునీటి సాధన సమితి, అటు ముఖ్యమంత్రి కార్యాలయానికి, ఇటు బోర్డు ఛైర్మన్‌కు లేఖలు కూడా రాసిం ది.
వైఎస్ఆర్‌సీపీ నేతల నుంచి కొరవడిన స్పందన !
వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల, కృష్ణా జిల్లాకు చెందిన రైతు సంఘాల నాయకులు కూడా కర్నూలులో బోర్డును పెట్టాలంటున్నారు. శ్రీభాగ్ ఒడం బడికను అమలు చేయాలనే డిమాండ్‌తో 2022 డిసెంబర్ 5న కర్నూలులో నిర్వహించిన సీమ గర్జన సభలో పాల్గొన్న రా యలసీమ ప్రజాప్రతినిధులు పలువురు కర్నూలులో కృష్ణా బోర్డు ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ను సమర్ధించారు. తమ వంతు ప్రయత్నంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని ప్రకటించారు. అయితే ఎలాంటి ముందడుగు పడలేదు. దీంతో నంద్యాల జిల్లా కలెక్టరేట్ వద్ద రాయలసీమ ధర్మదీక్ష పేరుతో భారీ ఎత్తున ప్రదర్శన ఏర్పాటు చేయాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి నిర్ణయించింది. కర్నూలులోని కృష్ణా బోర్డు ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో నిర్వహించే ఈ కార్యక్రమం లో అన్ని రాజకీయ పార్టీల, రైతుసంఘాల, ప్రజాసంఘాల ప్ర తినిధులు, రాయలసీమ నలుమూలల నుంచి రాయలసీమ వాదులు పాల్గొంటారని చెబుతున్నారు.
కర్నూలుకు అన్యాయం జరుగుతోందన్న భావన !
కర్నూలు ప్రభుత్వం న్యాయరాజధాని ఇస్తున్నట్లుగా ప్రకటించింది. కానీ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. న్యాయరాజధాని ఆలోచన విరమించుకున్నామని సుప్రీంకోర్టుకు ప్రభుత్వం తెలియచేయడం సంచలనం సృష్టించింది. తర్వాత జ్యూడిషియల్ అకాడమీని కర్నూలులో ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించి.. జీవో ఇచ్చి చివరి క్షణంలో మార్చారు. ఇప్పుడు కేఆర్ఎంబీని కూడా విశాఖుక తరలిస్తున్నారు. ఇవన్నీ వివాదాస్పదమవుతున్నాయి.