KTR Speech : ఎన్టీఆర్ తర్వాత కేసీఆర్ - ప్లీనరీలో కేటీఆర్ పవర్‌ఫుల్ స్పీచ్!
దేశానికి కావాల్సింది బుల్డోజర్ మోడల్.. గోల్ మాల్ గుజరాత్ మోడల్ కాదని..తెలంగాణ మోడల్ అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కేసీఆర్ నాయకత్వం దేశానికి అవసరం అని ప్రకటించారు.
దేశ విస్తృత ప్రయోజనాల రీత్యా జాతీయ రాజకీయాల్లో టిఆర్ఎస్ పార్టీ కీలక భూమిక పోషించాలని రాజకీయ తీర్మానాన్ని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రతిపాదించారు. తెలుగుజాతి చరిత్రలో ఇద్దరు మహనీయులు రాజకీయాలను మలుపు తిప్పారన్నారు. నందమూరి తారక రామారావు చరిత్ర సృష్టిస్తే, మన కేసీఆర్ గారు చరిత్రతో పాటు...రాష్ట్రాన్ని సృష్టించారన్నారు. ఇతర రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు ఉంటే, రాష్ట్రాన్ని తేచ్చిన వారే మనకు ముఖ్యమంత్రిగా ఉన్నారని.. తెలంగాణ ప్రజల ప్రత్యేక ఆకాంక్ష రాష్ట్రాన్ని సాధించి, ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికైన కెసిఆర్ గారి జన్మ ధన్యమని అప్పటి స్వర్గీయ ప్రణబ్ ముఖర్జీ తెలిపారని గుర్తు చేశారు. అరుణ్ జైట్లీ కూడా అభినందించారన్నారు.
దేశానికి దిక్సూచీగా తెలంగాణ !
ఈ రోజు తెలంగాణ ఆచరిస్తున్నది, రేపు దేశం తప్పక ఆచరించాల్సిన పరిస్థితి వచ్చే గొప్ప స్థాయికి మనరాష్ట్రం చేరుకుందని కేటీఆర్ స్పష్టం చేశారు. 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో అనేక మంది పరిపాలకులున్నా... రైతులకు వ్యవసాయ రంగానికి, రైతుబంధు లాంటి కార్యక్రమంతో అద్భుతమైన కార్యక్రమం తీసుకువచ్చిన పాలకులు ఎవరు లేరు ... తెలంగాణ పథకాలు రైతుబంధు, మిషన్ భగీరథ, టీఎస్ ఐపాస్ వంటి అనేక కార్యక్రమాలను కేంద్రం కాపీ చేస్తోందన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంలో చైనా ను తలదన్నే వేగంతో ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టామన్నారు. ఇప్పుడు భారతదేశానికి తెలంగాణ మోడల్ కావాలని .. లక్ష ఇరవై నాలుగు వేల రూపాయలున్న తలసరి ఆదాయం రూ. 278000 పెరిగిందన్నారు. మత పిచ్చి లేని, కుల పిచ్చి లేని పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలన్న విశ్వమానవ సౌభ్రాతృత్వమే తెలంగాణ మోడల్ అని కేటీఆర్ విశ్లేషించారు.
బీజేపీ పాలన అంతులేని వైఫల్యాల పుట్ట !
బీజేపీ పాలనా తీరుపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. తెలంగాణది అద్భుతమైన సాఫల్య చరిత్ర అయితే బిజెపిది, కేంద్రానిది అంతులేని వైఫల్యాల చరిత్రగా తేల్చారు. 2020 నాటికి భారత రైతు ఆదాయం రెట్టింపు చేస్తా అన్నారు... కానీ రైతుల కష్టాలు కన్నీళ్లు రెట్టింపు అయ్యాయన్నారు. నరేంద్ర మోడీ అంటే...రైతు విరోధి అని దేశం అంటున్నదని.. 2022 నాటికి నిరుపేదల అందరికీ ఇల్లు ఇస్తామన్నాడు... కానీ తన దివాలాకోరు ఆర్థిక విధానాలతో, పన్నుల పెంపు తో ఉన్న ఇల్లును అమ్ముకునే పరిస్థితి వచ్చిందన్నారు. నల్లధనం అంటే మోడీ తెల్లమొహం వేస్తున్నారని.. ఏడాదికి రెండు కోట్ల చొప్పున ఎనిమిది ఏళ్లలో 16 కోట్ల ఉద్యోగాలు ఇయ్యయాల్సింది పోయి.... ఉన్న ఉద్యోగాలను పడగొట్టి, ప్రభుత్వరంగ సంస్థలను అమ్ముతున్నారు... పకోడీలు వేసుకోవడం కూడా ఉద్యోగం అని చెప్పి దబాయిస్తున్నారని మండిపడ్డారు.
దేశానికి తెలంగాణ మోడల్ కావాలి !
ఇప్పుడు కావాల్సింది ఉద్వేగ భారతం కాదు... ఉద్యోగాల భారతమని కేటీఆర్ స్పష్టం చేశారు. గాంధీ విలువలు వల్లెవేస్తూ గాడ్సే మద్దతుదారులకు పరోక్షంగా మద్దతు పలుకుతారని.. తలా తోక లేని దౌత్యం విధానంతో ప్రపంచం ముందు నవ్వుల పాలు చేస్తున్నారని మండిపడ్డారు. మానవ అభివృద్ధి సూచిక... వరల్డ్ హంగర్ ఇండెక్స్లో... హ్యాపీనెస్ ఇండెక్స్... మహిళా రక్షణ సూచిక.. వంటి అన్ని అంశాల్లో భారతదేశ ర్యాంకులు దిగజార్చింది మోడీనేనని విమర్శించారు. ఎన్ డి ఏ అంటే నాన్ పర్ఫామెన్స్ ఆసెట్ అని కేటీఆర్ ప్రకటించారు. 40 ఏళ్ల కింద అ సమానంగా ఉన్నా భారత్-చైనా... ఇప్పుడు చైనా ఎక్కడ ఉంది...భారత్ ఎక్కడ ఉందని కేటీఆర్ ప్రశ్నించారు. అలా అభివృద్ధి చేసేలా నాయకత్వం కావాలని.. బహుశా ఆ నాయకత్వాన్ని తెలంగాణనే అందిస్తుందేమోనని కేటీఆర్ ఆశాభావం వ్యక్తంచేశారు. దేశానికి ఒక విజనరీ కావాలి టేలివిజనరి కాదన్నారు. భారత దేశానికి కేసీఆర్ లాంటి నాయకుడు కావాలన్నారు. బుల్డోజర్ మోడల్... బిల్డప్ మోడల్... గోల్ మాల్ గుజరాత్ మోడల్ కాదు... తెలంగాణ మోడల్ కావాలనిపిలుపునిచ్చారు.