అన్వేషించండి

Kalvakuntla Kavitha Telangana Rakshana Sena: సీఎం కావాలంటే జింఖానా అంత మనసుండాలి.. చంచల్‌గూడ అంత కాదు - టీఆర్ఎస్ కవితకు బీజేపీ విష్ణు కౌంటర్

Vishnuvardhan Reddy counter to Kavitha: సీఎం అయితే హైదరాబాద్‌లోని ఆంధ్రుల విగ్రహాలను ఏపీకి పార్సిల్ చేస్తామన్న కవిత వ్యాఖ్యలపై బీజేపీ నేత విష్ణు సెటైర్లు వేశారు.

Smashing Andhra Leaders Statues Vijayawada Parcel: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ప్రాంతీయ విభేదాల మంటలు రాజుకుంటున్నాయి. ఇటీవల కల్వకుంట్ల కవిత స్థాపించిన తెలంగాణ రక్షణ సేన నిర్వహించిన కార్యక్రమంలో ఏపీ నేతలను ఉద్దేశించి ఆమె చేసిన తీవ్ర వ్యాఖ్యలు ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య పొలిటికల్ హీట్‌ను పెంచాయి. దీనిపై భారతీయ జనతా పార్టీ   సీనియర్ నేత విష్ణువర్ధన్ రెడ్డి గట్టిగా కౌంటర్ ఇవ్వడంతో ఈ వివాదం సరికొత్త మలుపు తిరిగింది.  

 కవిత  పార్సిల్ రాజకీయం 

తెలంగాణ రక్షణ సేన (TRS) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హైదరాబాద్‌లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఏపీ నేతలను, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని సంచలన వ్యాఖ్యలు చేశారు. మేము అధికారంలోకి రాగానే ఇక్కడున్న ఆంధ్రా నాయకుల విగ్రహాలను పగలగొట్టి, వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న విజయవాడకు పార్సిల్ చేస్తాం  అంటూ ఆమె తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. హైదరాబాద్‌లో పవన్ కల్యాణ్  తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ  పెట్టాలనుకోవడంపై మండిపడుతూ.. ముందు ఆయన తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీ నేతలు ఇక్కడికి వచ్చి పెత్తనం చేయాలని చూస్తే పళ్లు రాలగొడతామంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి.

 విష్ణువర్ధన్ రెడ్డి ఘాటు కౌంటర్  సెటైర్లు

కవిత చేసిన ఈ వ్యాఖ్యలపై బీజేపీ  జాతీయ కౌన్సిల్ సభ్యులు విష్ణువర్ధన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.  విగ్రహాలు కూల్చడానికి, ప్రాంతాల మధ్య విద్వేషాలు రగల్చడానికి మీకు ముఖ్యమంత్రి పదవి కావాలా కవిత గారు? అంటూ ఆయన ప్రశ్నించారు.  ముఖ్యమంత్రి కావాలంటే మీకు ‘జింఖానా గ్రౌండ్’ అంత విశాలమైన హృదయం ఉండాలి; అంతే తప్ప  చంచల్‌గూడ జైలు అంత చిన్న మనసు ఉండకూడదు  అంటూ గతంలో ఆమె జైలుకు వెళ్లిన ఉదంతాన్ని గుర్తు చేస్తూ పరోక్షంగా సంచలన సెటైర్లు వేశారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండాలనుకునే వారు సమాజాన్ని జోడించేలా మాట్లాడాలి కానీ, ఇలా విగ్రహాలు పగులగొడతామంటూ విద్వేషాలు రెచ్చగొట్టడం తగదని హితవు పలికారు. 

 జనసేన సభకు అనుమతి నిరాకరణ - కాంగ్రెస్ మార్క్ రాజకీయం 

ఇదే తరుణంలో హైదరాబాద్‌లో జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ నిర్వహించ తలపెట్టిన  తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ కు పోలీసులు అనుమతి నిరాకరించడంపై కూడా విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు. శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయనే సాకుతో సభను అడ్డుకోవడం వెనుక కాంగ్రెస్ ప్రభుత్వ రాజకీయ దురుద్దేశం స్పష్టంగా కనిపిస్తోందని ఆయన విమర్శించారు. ఒక పక్క విపక్షాలు సెంటిమెంట్‌ను వాడుకుంటుంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తోందని మండిపడ్డారు.
 
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేళ పాత గాయాలను రేపుతూ, విగ్రహాల కూల్చివేత రాజకీయాలకు పిలుపునివ్వడం ద్వారా కవిత సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారాలని చూశారు. కానీ, దానికి విష్ణువర్ధన్ రెడ్డి ఇచ్చిన చంచల్‌గూడ కౌంటర్ సోషల్ మీడియాలో మరింత చర్చకు కారణం అవుతోంది. 

టాప్ హెడ్ లైన్స్

TVK Wins Tamil Nadu By Polls: తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
Telangana Power Crisis: తెలంగాణలో కరెంట్ కష్టాలు - రూ.5,420 కోట్ల ట్రూ-అప్ షాక్ - ప్రజాగ్రహాన్ని తెలంగాణ ప్రభుత్వం తప్పించుకోగలదా?
తెలంగాణలో కరెంట్ కష్టాలు - రూ.5,420 కోట్ల ట్రూ-అప్ షాక్ - ప్రజాగ్రహాన్ని తెలంగాణ ప్రభుత్వం తప్పించుకోగలదా?
KCR Farmhouse 45 Acres Missing Land: కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో 45 ఎకరాల మిస్సింగ్ భూమి కలకలం - నోటీసులు రెడీ..రాజకీయ భూకంపం తప్పదా?
కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో 45 ఎకరాల మిస్సింగ్ భూమి కలకలం - నోటీసులు రెడీ..రాజకీయ భూకంపం తప్పదా?
TDP Janasena Seat Sharing: స్థానిక పోరులో పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ - 7 కార్పొరేషన్లపై కన్ను.. చంద్రబాబు రియాక్షన్ ఏంటి?
స్థానిక పోరులో పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ - 7 కార్పొరేషన్లపై కన్ను.. చంద్రబాబు రియాక్షన్ ఏంటి?

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Govt Good News: జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
TVK Wins Tamil Nadu By Polls: తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
EYES Web Series Review - 'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
AI Abuse Prevention: ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
BC Reservations In AP: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
Spiderman Brand New Day OTT : మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Embed widget