అన్వేషించండి

JC Prabhakar Reddy Tadipatri Politics: తాడిపత్రి చదరంగం - వైసీపీతో కాదు.. పెద్దారెడ్డితోనే ఫైట్! జేసీ మార్క్ పాలిటిక్స్ వెనుక అసలు కథ ఇదీ

Tadipatri : తాడిపత్రి రాజకీయాలు భగ్గమంటూనే ఉన్నాయి. తాడిపత్రిలో అడుగు పెట్టడానికి పెద్దారెడ్డికి చాలా చిక్కులు వచ్చి పడుతున్నాయి. ఎవరైనా రాజకీయం చేయవచ్చు కానీ పెద్దారెడ్డి మాత్రం కాదని అంటున్నారు.

JC Brothers Vs Ketireddy Family:  ఉమ్మడి అనంతపురం జిల్లా రాజకీయాల్లో తాడిపత్రి నియోజకవర్గానికి ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన చరిత్ర, వేడి ఉంటాయి. ప్రస్తుతం  టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మార్క్ పాలిటిక్స్‌తో తాడిపత్రి రాజకీయం నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఇటీవల జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు స్థానికంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.  తనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో గానీ, ఆ పార్టీలో ఉండే ఇతర నేతలతో గానీ ఎలాంటి వ్యక్తిగత శత్రుత్వం లేదు.. తన పోరాటం కేవలం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డితోనే అని ఆయన స్పష్టం చేశారు. పెద్దారెడ్డి మినహా వైసీపీ నుంచి ఎవరైనా తాడిపత్రిలో రాజకీయం చేసుకోవచ్చని, తనకు అభ్యంతరం లేదని జేసీ ప్రకటించడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. పెద్దారెడ్డి మాత్రమే ఎందుకు వద్దన్నదానిపై అనేక ప్రచారాలు జరుగుతున్నాయి. 

రెండు కుటుంబాల మధ్య దశాబ్దాల ఫ్యాక్షన్ గొడవలు

 జేసీ ప్రభాకర్ రెడ్డి కేవలం పెద్దారెడ్డిని మాత్రమే టార్గెట్ చేయడం వెనుక బలమైన కారణం ఉంది. రాయలసీమలో ఒకప్పుడు నడిచిన ఫ్యాక్షన్ రాజకీయాలే దీనికి కారణం అని ఎక్కువ మంది చెబుతున్నారు.  దశాబ్దాల క్రితం జేసీ కుటుంబానికి  , కేతిరెడ్డి కుటుంబానికి మధ్య  ఫ్యాక్షన్ గొడవలు ఎక్కువగా ఉండేవి. చాలా మంది చనిపోయారు కూడా. కేతిరెడ్డి పెద్దారెడ్డి సోదరుడు కేతిరెడ్డి సూర్యనారాయణరెడ్డి కూడా తాడిపత్రి రైల్వే స్టేషన్ వద్ద హత్యకు గురయ్యారు. ఆ తర్వాత అప్పటి ప్రభుత్వం పెద్దల సమక్షంలో కొన్ని ఒప్పందాలు జరిగాయని.. ఆ ప్రకారం ఒకరి నియోజకవర్గాల్లో ఒకరు జోక్యం చేసుకోవద్దని ఒప్పందం జరిగిందని చెబుతారు.  

సరిహద్దుల ఒప్పందం ఏమిటి?

గతంలో కుదిరిన ఫ్యాక్షన్ రాజీ ప్రకారం.. జేసీ బ్రదర్స్ తాడిపత్రి నియోజకవర్గానికే పరిమితం కావాలి. అదే సమయంలో కేతిరెడ్డి కుటుంబం ధర్మవరం లేదా అనంతపురం రూరల్  రాజకీయాలు చూసుకోవాలి తప్ప.. తాడిపత్రి సరిహద్దుల్లోకి రాకూడదు అనేది ఇరువర్గాల మధ్య ఉన్న పాత ఒప్పందం అని చెబుతారు. అయితే, 2019 ఎన్నికల సమయంలో వైఎస్సార్సీపీ తరపున కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి బరిలోకి దిగడం, అక్కడ ఎమ్మెల్యేగా గెలవడంతో ఈ దశాబ్దాల నాటి ఫ్యాక్షన్ ఒప్పందం పూర్తిగా ఉల్లంఘించినట్లయింది.  ఐదేళ్ల వైసీపీ పాలనలో పెద్దారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో.. జేసీ ప్రభాకర్ రెడ్డి ఇల్లు, కార్యాలయాలపై దాడులు జరగడం, ఇరు వర్గాల మధ్య తీవ్రమైన ఘర్షణలు చోటుచేసుకోవడం తాడిపత్రిలో శాంతిభద్రతల సమస్యను సృష్టించింది. తన సొంత గడ్డపైనే దశాబ్దాలుగా పాటిస్తున్న  రాజకీయ సరిహద్దుల నియమాన్ని పెద్దారెడ్డి బ్రేక్ చేశారనే కసి, కోపం జేసీ ప్రభాకర్ రెడ్డిలో బలంగా నాటుకుపోయినట్లుగా తెలుస్తోంది. 

అందుకే పెద్దారెడ్డిని అడుగు పెట్టనివ్వని జేసీ 

అందుకే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. జేసీ ప్రభాకర్ రెడ్డి తన పాత శత్రుత్వాన్ని క్లియర్ చేసుకునే పనిలో పడ్డారు. వైసీపీ అనే పార్టీని సైడ్ ట్రాక్ చేసి, కేవలం పెద్దారెడ్డిని ఒంటరిని చేసే వ్యూహాన్ని ఆయన అమలు చేస్తున్నారు. వైసీపీలో ఉన్న ఇతర సామాజిక వర్గాల నేతలను, ద్వితీయ శ్రేణి నాయకులను తన వైపు తిప్పుకుంటూ.. పెద్దారెడ్డికి తాడిపత్రిలో లీడర్ల సపోర్ట్ లేకుండా చేస్తున్నారు.  పెద్దారెడ్డిని తాడిపత్రి రాజకీయాల నుంచి శాశ్వతంగా తరిమేయడమే నా లక్ష్యం  అనే సంకేతాన్ని జేసీ తన క్యాడర్‌కు ఇస్తున్నారు.

తాడిపత్రిని వదిలేది లేదంటున్న కేతిరెడ్డి 

 సోషల్ మీడియా వేదికగా కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్గం కూడా దీనికి కౌంటర్లు ఇస్తోంది. ప్రజాస్వామ్యంలో ఎవరైనా, ఎక్కడైనా పోటీ చేసే హక్కు ఉంటుందని.. తమను అడ్డుకోవడం జేసీ ప్రభాకర్ రెడ్డి అహంకారానికి నిదర్శనమని వారు విమర్శిస్తున్నారు. తాము కూడా తాడిపత్రిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షాన పోరాడుతామని పెద్దారెడ్డి అనుచరులు చెబుతున్నారు. తాడిపత్రిలో సాగుతున్న ఈ జేసీ-కేతిరెడ్డి కోల్డ్ వార్ కేవలం ఈనాటి రాజకీయాల వల్ల వచ్చింది కాదు.. ఇది దశాబ్దాల నాటి ఫ్యాక్షన్ రాజీలు, సరిహద్దుల ఉల్లంఘనల  కొనసాగింపు అనుకోవచ్చు.  జేసీ ప్రభాకర్ రెడ్డి అనుకున్నట్లుగా పెద్దారెడ్డిని పొలిటికల్ స్క్రీన్ నుంచి అవుట్ చేస్తారా.. లేక కూటమి హయాంలోనూ ఈ ఇద్దరు నేతల మధ్య ఘర్షణలు తాడిపత్రిని మళ్లీ పాత ఫ్యాక్షన్ రోజుల్లోకి తీసుకెళ్తాయా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది. ప్రస్తుతం మాత్రం తాడిపత్రి రాజకీయ చదరంగంలో పావులు పూర్తిగా జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పినట్లుగానే కదులుతున్నాయి.  

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Actress Trisha Controversy: త్రిష చుట్టూ తిరుగుతున్న తమిళ రాజకీయం - డిప్యూటీ సీఎంను ను చేస్తారా?
త్రిష చుట్టూ తిరుగుతున్న తమిళ రాజకీయం - డిప్యూటీ సీఎంను ను చేస్తారా?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Agri Gold Victims: అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం - ఆస్తులు వేలం వేసి చెల్లింపులు - ఆటంకాలు లేకుండా పూర్తి చేయగలరా?
అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం - ఆస్తులు వేలం వేసి చెల్లింపులు - ఆటంకాలు లేకుండా పూర్తి చేయగలరా?
Tesseract Company Land Allocation Controversy: రేవంత్ సోదరులే టార్గెట్‌గా బీఆర్ఎస్ పొలిటికల్ మైండ్‌గేమ్ - టెస్సరాక్ట్ భూముల వివాదంలో కాంగ్రెస్ డిఫెన్స్‌లో పడిందా?
రేవంత్ సోదరులే టార్గెట్‌గా బీఆర్ఎస్ పొలిటికల్ మైండ్‌గేమ్ - టెస్సరాక్ట్ భూముల వివాదంలో కాంగ్రెస్ డిఫెన్స్‌లో పడిందా?
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Embed widget