Tadipatri : అనంతపురం ఎస్పీ సాయంతో చంపేసే ప్లాన్ - తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే ఆరోపణ
Andhra Pradesh : తనను చంపేందుకు ప్లాన్ చేస్తున్నారని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆరోపించారు. దీనికి అనంతపురం ఎస్పీ సహకారం ఉందన్నారు.
Former Tadipatri MLA Kethireddy Peddareddy : తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డితో కలిసి అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ నన్ను అంతం అందించేందుకు కుట్టలో పడుతున్నారేమోనని అనుమానంగా ఉందని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. దసరా పండుగ అనంతరం తాడిపత్రికి వెళ్తానని స్పష్టం చేశారు. తాడి పత్రి వెళ్లేందుకు పర్మిషన్ కోరితే ఇవ్వకపోగా తిరిగి తన మీదనే మరో మూడు కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నాడని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్సిపి నాయకులు నేతలు కార్యకర్తలపై అనేక కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారని ఆరోపించారు.
తాడిపత్రి కి నేను వెళ్తాను అంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అంటున్నారని విమర్శించారు. తన సొంత ఊరు లోకి నేను వెళ్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎందుకు వస్తుందని ఎస్పీని ప్రశ్నించినా సరైన సమాధానం లేదన్నారు. తాను ఎక్స్ ఎమ్మెల్యే ప్రజా ప్రతినిధుని అయినటువంటి నాకే ఇలా ఉంటే సామాన్య నేతలకు పరిస్థితి ఎలా ఉందో దీన్ని చూస్తుంటేనే అర్థం అవుతోందన్నారు. ఎస్పీ జగదీష్ కనీసం మా ఫోన్లు కూడ లిఫ్ట్ చేయడం లేదు. మేము ఎవర్ని అడగాలో మాకు తెలియడం లేదు. కిందిస్థాయి అధికారులను అడిగితే పై స్థాయి అధికారులను అడగాలని చెబుతున్నారు వారికి ఫోన్లు చేస్తే కూడా సమాధానం లేదు ఎవరితోనైనా అడిగిస్తే మా పై అధికారులను అడగాలని చెబుతున్నారు జిల్లా ఎస్పీల నుంచి పై స్థాయి అధికారులు ఎవరూ స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
పుట్టబోయే బిడ్డకు దువ్వాడ జగన్ అని పేరు పెడతారట - టీవీ ఇంటర్యూల్లో హల్చల్ చేస్తున్న దువ్వాడ, దివ్వెల
ఆఖరికి ఆ దేవుడిని అడగాలేమో అనిపిస్తోందన్నారు. ఆ దేవుడు కనిపించడు దేవుడు కనిపిస్తే వీళ్ళందర్నీ శిక్షించాలని వేడుకుంటానని కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు. నాకు నా కుటుంబానికి ప్రాణహాని ఉంది. JC ప్రభాకర్ రెడ్డి, జిల్లా పోలిసుల వల్ల ప్రాణహాని ఉంది. జిల్లా ఎస్పీ మీద నాకు నమ్మకం పోయింది. తాడిపత్రి లో ఎన్నికల అనంతరం జరిగిన హింస పై అప్పట్లో SIT వేశారు. కానీ ఇంతవరకు తాడిపత్రి గొడవలపై SIT ఇంతవరకు చార్జిషీట్ వేయలేదు.నా మీద మళ్ళీ ఇప్పుడు కేసులు పెట్టీ.. నన్ను హత్య చేయించడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. సాక్షాత్తూ ఎస్పీ జగదీష్ సహకారంతోనే జేసీ కుట్రలు చేస్తున్నారన్నారు. ఎన్నికల పోలింగ్ నుంచి ఇప్పటిదాకా పలుసార్లు నన్ను చంపేందుకు జేసీ ప్రయత్నించారని ఆరోపించారు.
మా అన్న కేతిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డిని 2006లో చంపారు. అదే పద్ధతిలో నన్ను హతమార్చేందుకు జేసీ కుట్రలు చేస్తున్నారు. జేసీ గూండాలకు ఎస్పీ జగదీష్ సహాయ సహకారాలు అందజేస్తున్నారు.నాపై ఇప్పుడు మూడు హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. ఎన్నికల సమయంలో సిట్ విచారణ చేసిన ఘటనలపై మళ్లీ కేసులు ఎందుకు నమోదు చేశారో ఎస్పీ జగదీష్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఆదేశాలతోనే నన్ను తాడిపత్రి కి ఎస్పీ అనుమతించటం లేదు, నాకు నా కుటుంబ సభ్యులకు జేసీ ప్రభాకర్ రెడ్డి నుంచి ప్రాణహాని ఉంది, ఎస్పీ అనుమతితో తాడిపత్రి వెళ్లినా నా ఇంటిపై దాడి జరిగింది, అక్రమ కేసుల్లో వేధిస్తున్నారు, ఎస్పీ జగదీష్ సహకారంతోనే నన్ను చంపేందుకు జేసీ కుట్ర చేస్తున్నారని తాడపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆరోపించారు.