YSRCP Posts : మంది ఎక్కువైతే మజ్జిగ పలుచన ! వైఎస్ఆర్‌సీపీలో నేతల మధ్య సయోధ్య సాధ్యమేనా ?
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అన్ని స్థాయిల్లో పదవులు భర్తీ చేస్తున్నారు. జిల్లా ఇంచార్జులు, సమన్వయకర్తలు ఇలా అన్నీ పదవుల్లోకీ నేతలొచ్చారు. కానీ వారంతా సమన్వయం చేసుకోగలిగే సామర్థ్యంతో ఉన్నారా?
ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పదవుల పంపకాలు జోరు మీద ఉన్నాయి. జిల్లా అధ్యక్ష పదవులు, రీజినల్ కో ఆర్డినేటర్లు, ఇంచార్జ్ మంత్రులు ఇలా అన్నీ పదవులు భర్తీ చేసేశారు. ఇక పెడతామన్న అభివృద్ధి మండళ్లు మాత్రం పెండింగ్‌లో ఉన్నాయి. అయితే మంది ఎక్కువైతే మజ్జిగ పలుచన అవుతుందన్నట్లుగా పరిస్థితి మారే అవకాశం కనిపిస్తోంది. పదవులు పొందిన నేతలు.. ఇతర నేతల మధ్య సయోధ్య ఎలా సాధ్యమన్నది ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీలో హాట్ టాపిక్‌గా మారింది.
జిల్లాల ఇంచార్జులు అందర్నీ కలుపుకుని వెళ్లేవారేనా ?
మంత్రి పదవులు రాని వారికి జిల్లా అధ్యక్ష పదవులు ప్రకటించారు. గుంటూరు జిల్లాకు మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత ను నియమించారు.హోం మంత్రిగా సుచరిత పని చేసినప్పటికి రెండేళ్ళ కాలంలో కరోనా కారణంతో ఆమె బయటకు వచ్చిన దాఖలాలు చాలా తక్కువ. నియోజకవర్గంలో నిర్వహించే కార్యక్రమాలు కూడా ఆమె చాలా తక్కువగా అటెండ్ అయ్యేవారు . ముఖ్యమయిన కార్యక్రమాలకు కూడ లాస్ట్ మినిట్ లో హ్యాండ్ ఇచ్చే వారనే ప్రచారం ఉంది. ఇలాంటి పరిస్దితుల్లో గుంటూరు జిల్లా రాజకీయాల్లో ఆమె మార్క్ చూపించే విధంగా పని చేయటం పై సందేహాలు లేకపోలేదని కార్యకర్తల్లో వినిపిస్తున్న మాట. ఇక ఎన్టీఆర్ జిల్లా కు మాజీ మంత్రి వెలంపల్లి ని నియమించారు.ఆయన పక్క నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు వెలంపల్లికి మద్య కోల్డ్ వార్ నడుస్తుందనే టాక్ ఉంది.మరో నియోజకవర్గంలో దేవినేని అవినాష్ ఇంచార్జ్ గా ఉన్నారు.విజయవాడ నగరానికి అధ్యక్షుడిగా ఉన్న బొప్పన భువకుమార్ కి కూడ గ్యాప్ ఉంది.అంతకు మించి వెలంపల్లి ప్రాతినిద్యం వహిస్తున్న సొంత నియోజకవర్గలోనే కులాల వారీగా ఆయన పై అసంతృఫ్తి ఉంది..దేవాదాయ శాఖ మంత్రిగా పని చేసిన సమయంలో పేరుకు పదవులు ఇచ్చినప్పటికి తమకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వలేదని ఆవేదన క్యాడర్ లోంది. మిగిలిన నియోజకవర్గాల్లో శాసన సభ్యులు కూడ వెలంపల్లి నాయకత్వంలో పని చేస్తారా అనే సందేహాలు ఉన్నాయి.
తాజా మాజీ మంత్రులకు ఇతర నేతలతో గ్యాప్ !
కృష్ణాజిల్లా విషయానికి వస్తే మాజీ మంత్రి పేర్ని నానికి బాద్యతలు అప్పగించారు. జిల్లాలో ఒక పక్క కొడాలి నాని, తాజాగా అసంతృప్తిగా ఉన్న పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారధి , తాజా మంత్రి జోగి రమేష్ కూడ ఇదే జిల్లాలో ఉన్నారు. ఇందులో కొడాలి నానితోనే , పేర్నికి కాస్త లైజనింగ్ ఉంది. మిగిలిన వారిని కలుపుకోవాలన్నా, వారితో పనిచేయాలన్నా అంత ఈజీగా పరిస్దితులు లేవన్నది పార్టి నాయకుల్లో చర్చ జరుగుతుంది. ఎలూరు జిల్లాకు మాజీ మంత్రి ఆళ్ళ నాని జిల్లాలో ఆయన పార్టిని లీడ్ చేయటానికి బాగా కష్టపడాల్సి ఉంటుందని పార్టి నేతలే అంటున్నారు.ఇందుకు కారణం కూడ ఉంది.నాని రిజర్వ్ గా పాలిటిక్స్ లో ఉంటారనే ప్రచారం ఉంది. మాస్ గా జనంలోకి వెళ్ళి వారిని తన వైపుకు తిప్పుకునే పరిస్దితి లేదు. దీంతో పాటు జిల్లాలోని ఇతన నియోజకవర్గాల ఎమ్మెల్యేలు,ఇంచార్జ్ లతో కూడ ఆయనకు అంత దగ్గర రిలేషన్ లేదనే ప్రచారం జరుగుతోంది .
గోదావరి జిల్లాల్లో నేతలెక్కువ - కలసి పని చేయడం తక్కువ !
ఇక పశ్చిమ గోదావరి జిల్లా విషయానికి వస్తే మాజీ మంత్రి రంగ నాధ రాజు...సౌమ్యుడు. అంతే స్దాయిలో దూకుడు కూడ ఉంది. ఆర్దికంగా బలమయిన నేత కావటంతో పార్టిని ఎలాగయినా ముందుకు నడిపస్తారనే అభిప్రాయం ఉంది.మరో వైపు కాకినాడు జిల్లాకు మాజీ మంత్రి కన్నబాబు. ఇక్కడ కన్నబాబు పరిస్దితి అంతంత మాత్రమే. మంత్రిగా ఉన్న సమయంలో సొంత నియోజకవర్గం కు వచ్చినా స్దానిక అదికారులు కూడ అంత ఈజీగా రెస్పాండ్ అవ్వను అనే ప్రచారం ఉంది.ఇదే అసంతృఫ్తిని ఆయన పార్టి పెద్దలు వద్ద కూడ అనేక సార్ల ప్రస్తావించారని చెబుతుంటారు..ఇందుకు కారణం కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. పార్టికి ఉభయ గోదావరి జిల్లాలోనే అన్ని తానై నడిపిన వ్యక్తి ద్వారంపూడి. జగన్ తో నేరుగా సాన్నిహిత్యం ఉండటంతో ఆయనదే పై చేయి. ఇప్పుడు కాకినాడ జిల్లాకు కన్నబాబు నియమాకం చేసినప్పటికి క్యాడర్,తో పాటుగా మెజార్టి నాయకులు కూడ ద్వారంపూడి వద్దనే ఎక్కువగా రాజకీయం చేస్తుంటారు. దీంతో కన్నబాబు పార్టి లో ఎదురీది,రాజకీయం చేయాల్సి వస్తుందని స్దానిక క్యాడర్ అంటున్నారు.
సమన్వయం చేసుకోలేకపోతే మొదటికే మోసం !
ఇక మరో మంత్రి అవంతి శ్రీనివాస్ విశాఖ భాద్యుడు గా ఉన్నారు. విశాఖ రాజధాని అని వైసీపీ తెరమీదకు తెచ్చిన నాటి నుండి అక్కడ విజయ సాయి రెడ్డి, పూర్తిగా పట్టు సాధించారు.. అంతే కాదు ఇంచార్జ్ మంత్రిగా విడుదల రజని ని నియమించచటం చర్చకు కారణం అయ్యింది.ఇక పుష్ఫ శ్రీవాణి కి పార్వతి పురం మన్యం జిల్లా ని అప్పగించారు.. ఆమెకి స్థానిక నాయకులు మధ్య చాలా దూరం ఉందని సొంత పార్టీ నేతలే అంటూ నారు.....పార్టిని నడిపించేంత సీనియార్టి లేదన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు..అనిల్ కు మార్ యాదవ్,తిరుపతి వైఎస్ఆర్ జిల్లాలు అప్పగించారు.. దూకుడు మీద ఉన్న అనిల్ పార్టీ ని సమన్వయం తో నడపాలంటే, చాలా సహనం అవసరం అని నేతలు ఆయనకు క్లాస్ తీసుకుంటున్నారు..ఇక మరో తాజా మాజీ సంచలనాత్మక మంత్రికొడాలి నాని... గుంటూరు,పల్నాడు,బాపట్ల బాధ్యత లు ఇచ్చారు..ఆయా జిల్లాలో ఇప్పటికే కోన రఘుపతి,పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వంటి నేతలు ఉన్నారు..వారిని ఎలా సమన్వయం చేసుకుంటారు అనే ఆసక్తి పార్టీలో ఉంది...