అన్వేషించండి

Jubilee Hills by election: జూబ్లిహిల్స్ ఉపఎన్నికలో లోకేష్ సాయం కేసీఆర్ కోరారా? కాంగ్రెస్ ఆరోపణల్లో నిజం ఎంత ?

KCR: జూబ్లిహిల్స్ ఉపఎన్నికలో మద్దతు ఇవ్వాలని లోకేష్ ను కేసీఆర్ కోరినట్లుగా ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ చేసిన ఈ ఆరోపణలపై ఇంకా బీఆర్ఎస్ స్పందించలేదు.

Jubilee Hills by election Politics: తెలంగాణ రాజకీయాల్లో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అత్యంత కీలకంగా మారింది. మూడు ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ గెలుపు కోసం అన్ని రకాల వ్యూహాలను అమలు చేస్తున్నాయి. మూడు పార్టీలకూ ఉపఎన్నిక అత్యంత కీలకమే. ఎవరు గెలిస్తే వారికి ప్రజామోదం లభిస్తోందన్న ప్రచారం జరుగుతోంది. అందుకే ఆరు నూరైనా జూబ్లిహిల్స్‌లో గెలవాలన్న పట్టుదలగా అన్ని పార్టీలు ఉన్నాయి. 

బీఆర్ఎస్ పార్టీకి జూబ్లిహిల్స్ ఉపఎన్నిక అత్యంత ప్రతిష్టాత్మకం. ఇది ఆ పార్టీకి సిట్టింగ్ సీటు. ఇప్పటికే సిట్టింగ్ సీటు కంటోన్మెంట్ ను ఆ పార్టీ కోల్పోయింది. ఇప్పుడు జూబిహిల్స్ కోల్పోతే .. ఇప్పటికే ఆ పార్టీ పరిస్థితి డెడ్ అయిందని అది మరోసారి నిరూపితం అయిందని కాంగ్రెస్ నేతలు ఎగతాళి చేయడం ప్రారంభిస్తారు. అందుకే జూబ్లిహిల్స్ ఉపఎన్నికను బీఆర్ఎస్   ప్రెసిడెంట్ కేసీఆర్ సీరియస్ గా తీసుకున్నారు.  

మాగంటి గోపీనాథ్ మొదట తెలుగుదేశం పార్టీ తరపున గెలిచారు. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి టీడీపీలో ఉన్న ఆయన.. 2014లో పోటీ చేసే అవకాశాన్ని పొందారు. విజయం సాధించారు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాల్లో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మరో రెండు సార్లు గెలిచారు. అయితే ఈ రెండు సార్లు గెలుపులో ఆయనకు టీడీపీ సానుభూతిపరుల సపోర్టు బాగా ఉపయోగపడింది. అయితే మజ్లిస్ పార్టీ మద్దతు కూడా ఉపయోగపడింది. మాగంటి గోపీనాథ్ కోసం.. టీడీపీ సానుభూతిపరులు బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి ఉంటారని. ఈ సారి ఎవరు అభ్యర్థి అయినా బీఆర్ఎస్ కు ఓటు వేయరన్న ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో మజ్లిస్ పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీకి దూరం అయింది.           

ఈ క్రమంలో టీడీపీ మద్దుత కోసం కేసీఆర్ ప్రయత్నించారని కాంగ్రెస్ నేత సామ రామ్మోహన్ రెడ్డి ఆరోపణలు చేశారు. ఓ ప్రైవేటు కార్యక్రమంలో లోకేష్ హాజరయినప్పుడు.. కేటీఆర్ కూడా వెళ్లారని.. అక్కడ అర గంట సేపు చర్చలు జరిపారని అంటున్నారు. మొత్తం రెండు సార్లు సమావేశం జరిగిందని అంటున్నారు. మాగంటి గోపీనాథ్ కుటంబసభ్యులకే టిక్కెట్ ఇస్తామని.. టీడీపీ తరపున సహకరించాలని కోరినట్లుగా చెబుతున్నారు.                     

అయితే ఈ అంశంపై బీఆర్ఎస్ వర్గాల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఖండించడం కూడా చేయలేదు. ఈ అంశంపై స్పందిస్తే ఇంకా ఎక్కువ ప్రచారం జరుగుతుందన్న ఉద్దేశంతో సైలెంట్ గా ఉన్నారని అంటున్నారు. అయితే అంతర్గతంగా మాత్రం.. జూబ్లిహిల్స్ నియోజకవర్గంలో టీడీపీ ప్రభావం ఏమి ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. టీడీపీకి ఎంత మద్దతు ఉంటుదో వైసీపీకీ అంతే ఉంటుందని తమ పార్టీకి ఎప్పుడూ వైసీపీ మద్దతుగానే ఉంటుందని గుర్తు చేస్తున్నారు. లోకేష్ ను మద్దతు అడిగే పరిస్థితి రాదని చెబుతున్నారు.  తెలుగుదేశం పార్టీ వర్గాలు కూడా ఇంకా స్పందించలేదు.                   

టాప్ హెడ్ లైన్స్

Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
AP Municipal Elections: ఏపీలో ప్రత్యక్ష పద్ధతిలో మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు.. చట్టంలో మార్పులతో ఎవరికి లాభం?
ఏపీలో ప్రత్యక్ష పద్ధతిలో మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు.. చట్టంలో మార్పులతో ఎవరికి లాభం?

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Embed widget