IPL, 2022 | Qualifier 2 | Narendra Modi Stadium, Ahmedabad - 27 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RR
RR
VS
RCB
RCB
IPL, 2022 | Final | Narendra Modi Stadium, Ahmedabad - 29 May, 08:00 pm IST
(Match Yet To Begin)
GT
GT
VS
TBC
TBC

Law Vs Justice : జగన్ 2024కు పొలిటికల్ అజెండా సెట్ చేసినట్లేనా..?

అమరావతి విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు కేంద్రంగా ఏపీ రాజకీయం మారుతోంది. కోర్టు తీర్పును శాసనసభా వేదికగా ప్రభుత్వం నిర్మోహమాటంగా తప్పుబట్టింది. తీర్పునే పొలిటికల్ అజెండాగా మార్చుకుంటున్నారా? వచ్చే ఎన్నికలకు ప్రచారాంశం చేసుకుంటున్నారా ? ఇది వర్కవుట్ అవుతుందా?

FOLLOW US: 

"చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో.." అనే పల్లవితో సాగే పాట తెలుగు నాట నాలుగు దశాబ్దాల నుంచి ప్రజల నోళ్లలో నానుతూనే ఉంది. నలభై ఏళ్లు గడిచినా ఆ పాట ఇంకా ఫ్రెష్‌గానే ఉండటానికి కారణం పరిస్థితులే అనుకోవచ్చు. చట్టానికి.. న్యాయానికి మధ్య ఘర్షణ వాతావరణం ఎప్పుడూ ఉండటమే కారణం అనుకోవచ్చు.  తాజాగా ఏపీ అసెంబ్లీలో దాదాపు ఆరు గంటల పాు అధికార పక్షం చర్చ పెట్టి న్యాయం కన్నా చట్టమే ఫైనల్ అని తేల్చే ప్రయత్నం చేశారు. మరి ఎవరిది పైచేయి ? చెప్పగలగడం సాధ్యమా?

చట్టాల్లో శాసన వ్యవస్థే ఫైనల్ అన్న ఏపీ శాసనసభ !

చట్టం వర్సెస్ న్యాయం..అనే ఘర్షణ చాలా సందర్భాల్లో జరుగుతుందే. చట్టప్రకారం  న్యాయస్థానాలు తీర్పులిస్తుంటాయి. కానీ అసలు చట్టమే న్యాయబద్ధంగా ఉందా లేదా అన్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో తలెత్తి.. దానిపై న్యాయస్థానం స్పందించి.. మరోసారి   చట్టం చేయడానికి కూడా వీలులేదు అన్న రీతీలో తీర్పిచ్చింది. మూడు రాజధానులు - అభివృద్ధి వికేంద్రీకరణ అన్న దానిపై న్యాయస్థానం తీర్పిచ్చి కొన్ని రోజులు అవుతోంది. దీనిపై ప్రభుత్వం ఏం చేస్తుంది..ఎలా స్పందిస్తుంది అన్న ఆసక్తి కొన్నాళ్లుగా ఉంది. హైకోర్టు చేసింది తప్పే.. మేం.. మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నాం.. అని ఏ శాసనం కుదరదు అన్నారో .. ఆ శాసన సభ వేదికపై నుంచే సీఎం జగన్‌ ప్రకటించారు. ఎన్నాళ్లు నుంచో చట్టం న్యాయం పోరాటాన్ని మరింత ముందుక తీసుకెళ్లారు.

కోర్టు తీర్పును సైతం ధిక్కరించి మూడు రాజధానుల వాదన వినిపిస్తున్న సీఎం ! 

అయితే చట్టానికి న్యాయానికి జరుగుతున్న ఈ సమరంలో అంతిమ విజేత ఎవరు.. ఎవరు తేల్చాలి అన్న దానిపై వివిధ వాదనలున్నాయి కానీ.. ఈ సీఎం జగన్ మాత్రం.. ఈ పోరుబాటను తన రాజకీయ బాటగా మలుచుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా అర్థం అవుతోంది. అమరావతి నచ్చక చేస్తున్నారో.. అందరినీ మెప్పించడానికి చేస్తున్నారో తెలీదు కానీ.. వైఎస్‌ఆర్‌సీపీ  ప్రభుత్వం మూడు రాజధానులు  అనే ఒక విధానాన్ని తీసుకుంది.  చకా చకా మూడు రాజధానులు కట్టేసి.. వచ్చే ఎన్నికల్లో అన్ని ప్రాంతాల్లో ఓట్లు సాధించాలన్నది వైసీపీ ఐడియా.. కానీ..కోర్టులు.. కరోనా దానికి బ్రేక్ వేశాయి. అయితే టైప్ మారింది కానీ అజెండా మాత్రం మూడు రాజధానులే అయింది. మూడు రాజధానులు ప్రారంభించి ఎన్నికలకు వెళ్లాలని జగన్ అనుకున్నారు. ఇప్పుడు మూడు రాజధానులు చేయనివ్వడం లేదని ఎన్నికలకు వెళతారు  అంతే తేడా. పరిస్థితి అలాగే కనిపిస్తోంది. పరిపాలన వికేంద్రీకరణ మా విధానం. రాజధానులపై నిర్ణయం మా హక్కు. మా బాధ్యత. వికేంద్రీకరణ విషయంలో వెనుకడుగు వేయబోం అని స్పష్టంగా చెప్పారు. అంటే కోర్టు తీర్పు వచ్చాక ప్రభుత్వ నిర్ణయం ఏంటి..? కోర్టు చెప్పినట్లుగా అమరావతిని ఏకైక రాజధానిగా అభివృద్ధి చేస్తుందా.. లేక తన విధానానికే కట్టుబడి ఉంటుందా అన్న సందేహాలు వచ్చాయి. ఇక సభలోనే స్పష్టంగా చెప్పేశాక ప్రభుత్వ విధానం ఏంటో క్లియర్ అయినట్లే.. దానిని ఎలా ముందుకు తీసుకువెళతారు అన్నది ప్రశ్న.

కోర్టు తీర్పును రాజకీయంగా మల్చుకునే వ్యూహంలో అధికార పార్టీ ! 

చట్టపరంగా ఉన్న అవకాశాలను వినియోగించుకుంటూనే.. దీనిని రాజకీయంగా తనకు అనుకూలంగా మార్చుకోవడానికి జగన్ ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది.  వైఎస్ఆర్‌సీపీ వ్యూహం అలాగే ఉంది. ఇప్పుడే కాదు. ఈ అనుమానాలు ముందు నుంచీ ఉన్నాయి. ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన అభివృద్ధి వికేంద్రీకరణ- బిల్లులను సవాలు చేస్తూ న్యాయస్థాననాల్లో కేసులు నమోదు అయినప్పుటి నుంచీ ప్రభుత్వం వివిధ దశల్లో తన తీరును మార్చుకుంది. ముందుగా దీనిపై త్వరగా విచారణ ముగించి .. మూడు రాజధానులు పాలన ప్రారంభించాలనుకున్న ప్రభుత్వం తరువాత వెనుకడుగు వేసింది. న్యాయస్థానాల్లో కానీ.. బయట కానీ. మూడు రాజధానుల విషయంపై ముందు చూపించిన దూకుడు తర్వాత లేదు. ఎందుకంటే .. కోర్టు కేసులతో కాలహరణం జరుగుతోంది. ఇంకోవైపు కరోనా.. మరోవైపు అడుగంటిన ఆర్థిక పరిస్థితి. ప్రభుత్వం ఉన్న పరిస్థితుల్లో మూడు రాజధానుల ఏర్పాటు వ్యయ ప్రయాసలతో కూడుకున్న పని. హడావిడిగా చేపట్టి.. నిధుల కోసం ఇబ్బంది పడితే.. మొదటికే మోసం రావొచ్చు..అని భావించి ఉండొచ్చు. అందులో భాగంగానే రాజధాని కేసుల నుంచి ప్రభుత్వం వైదొలిగింది. అభివృద్ధి వికేంద్రీకరణ చట్టాన్ని ఉపసంహరించుకుంటున్నామని ప్రకటించి.. ఆతర్వాత సభలోనూ ఉపసంహరించుకున్నారు. అసలు అమల్లోనే లేని చట్టంపై తీర్పు ఏంటన్నది ప్రభుత్వ వాదన. అయితే కోర్టు కేవలం మూడు రాజధానుల చట్టబద్ధత గురించి మాత్రమే చూడలేదు. అమరావతి రైతులతో అప్పుడు ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం.. ఆ ఒప్పంద ఉల్లంఘన గురించి తీర్పునిచ్చింది. వారికి న్యాయం జరగాలంటే... ఒకే రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయాల్సిందే అని చెప్పింది.

మూడు రాజధానులపై ఎన్నికలకు వెళ్లే వ్యూహం ! 

అయితే ఇక్కడ విషయం.  అసలు ప్రభుత్వం చట్టాన్ని ఎందుకు ఉపసంహరించుకుంది అని.. "మరింత " మెరుగైన చట్టం అంటే.. ముందు చట్టంలో లొసుగులు ఉన్నాయా.. లేక ఆ చట్టప్రకారం అయితే.. కోర్టులో ఓటమి అనుకున్నారా అన్నది తెలీదు. . ఇప్పుడంటే కోర్టు చట్టం చేయవద్దని చెప్పింది. కానీ.. కోర్టు తీర్పు రాకముందే కొత్త చట్టాన్ని ఎందుకు తీసుకురాలేదు. కోర్టు తీర్పులు చట్టం చేసే తమ అధికారాన్ని అడ్డుకోలేవు అని చెబుతున్న ప్రభుత్వం.. ముందే చట్టం చేయాల్స ఉంది. మరి రాజధానులపై చాలా  ఉత్సుకతతో ఉన్న ప్రభుత్వం.. ఎందుకు.. మరింత మెరుగైన చట్టాన్ని వెంటనే తీసుకురావడం లేదు. చట్టం తయారు కాలేదా.. లేక ఏవైనా వ్యూహం ఉందా అని ఆలోచిస్తే.. రెండోదే సరైందనిపిస్తుంది ఇప్పుడు చట్టం తీసుకొచ్చి.. రాజధాని పనులు మొదలుపెడితే.. అవి ఎటూ కావు. కనీసం ప్రారంభ పనులు కూడా చేయలేరు. ఏమీ చేయలేకపోయారు అనే అపవాదు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే దీనిని ఎన్నికల అంశం చేయాలని నిర్ణయించుకున్నట్లుగా అర్థం అవుతోంది. వాస్తవానికి కోర్టు తీర్పు అనేది వైకాపా ప్రభుత్వానికి వ్యతికమే అయినా.. చాలా విషయాల్లో వారికి రిలీఫ్ ఇచ్చింది అనుకోవాలేమో.. ఎందుకంటే మూడు రాజధానులు కట్టే అవకాశం తమకు రాలేదు అని చెప్పుకోవచ్చు. అదే అంశంపై ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉండటం కూడా వైఎస్ఆర్‌సీపీకి నెగటివ్‌లో పాజిటివ్ అనుకోవాలి.

మంచి చేయాలనుకున్నారు కానీ న్యాయవ్యవస్థ అడ్డుకుందనే సందేశాన్ని పంపుతున్నారా ?


ఇప్పుడు చట్టం చేస్తారో .. లేదా చట్టం చేస్తే చెల్లుబాటు అవుతందా లేదా అన్నది తేలడానికి కొంత కాలం పడుతుంది. అసలు చట్టం చేసే పేరతో కొంతకాలం కాలయాపన చేసి.. ఎన్నికలకు వెళ్లాలని వైసీపీ ఉన్నట్లుగా అర్థమవుతోంది. ఇప్పుడు ఆ పరిస్థితి ఎలాగో కోర్టే కల్పించింది. ఇప్పుడు.. చట్టాలు చేసే తమ శాశనాధికారాన్ని..   న్యాయవ్యవస్థ అడ్డుకుంది. అని చెప్పుకునే అవకాశం వచ్చింది. అలాగే రాజకీయంగా కూడా మిగిలిన ప్రాంతాల్లో .. రాజధానుల ఏర్పాటును మిగిలిన వ్యవస్థలు అడ్డుకుంటున్నాయని.. చెప్పడానికి జగన్‌కు అవకాశం ఉంది. ఈ రాష్ట్రంలోని ఎక్కువ ప్రాంతాలకు వెళ్లి.. నేను మీ చెంతకు రాజధాని తీసుకువద్దామనుకున్నాను... నన్ను ఎన్నుకుంటే అదే చేస్తాను.. అని చెప్పుకునే అవకాశం ఆయనకు ఉంటుంది.  కానీ అవతలి వారు.. ప్రతీ ప్రాంతంలోనూ.. మీ ప్రాంతానికి రాజధాని రావడం లేదు.. వేరే చోట అభివృద్ధి చేస్తున్నాం.. అని చెప్పుకోవలసి ఉంటుంది. ఓ రకంగా ఇది జగన్‌కు అడ్వాంటేజ్. అయితే ఈ వాదనను జనం ఎలా రిసీవ్ చేసుకుంటారన్నది ముఖ్యం.

న్యాయవ్యవస్థను ముందు పెట్టి రాజకీయ అజెండా ?

అయితే ప్రజల ఆలోచన ఎలా ఉంది.. అన్ని ప్రాంతాల వారు మూడు రాజధానులకు అనుకూలంగా ఉన్నారా లేదా అన్నది చూడాలి. రాజకీయంగా చూస్తే.. కేవలం ఒక్క వేసీపీ మాత్రమే ఈ వాదన చేస్తోంది. మిగిలిన పార్టీలు అన్నీ వ్యతిరేకంగా ఉన్నాయి.  మరి ప్రజలు ఎలా ఉన్నారో.. ప్రజలు అంతిమంగా తమ ప్రాంతానికి మేలు జరిగిందా లేదా అన్నది చూస్తారు. మేం చేయాలనుకున్నాం. . చేయలేకపోయాం.. ఇప్పుడు చేస్తాం.. అన్న వాదనని ప్రజలు విశ్వసిస్తారా.. అది ఎన్నికలలో ప్రయోజనాన్ని ఇస్తుందా లేదో చూడాలి. పక్కా పొలిటికల్‌ లెక్కల్లో చూసుకున్నా కూడా వైఎస్ఆర్‌పీ రాయలసీమలో అత్యంత బలంగా ఉంది. అక్కడ రాజధాని ఇస్తామన్నా.. ఇవ్వకున్నా.. ఎలాగూ వైసీపీనే వస్తుంది అన్న లెక్క ఉంది. అలాగే ఉత్తరాంధ్రకు ఏకంగా ఎగ్జిక్యూటివ్ కాపిటల్ ఇస్తాం అన్నా.. అక్కడ అంత పాజిటివిటీ కనిపించడం లేదు. పైగా ఎగ్జిక్యూటివ్ కాపిటల్ వైజాగ్‌లో మొత్తం టీడీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు. గోదావరి జిల్లాల ప్రజలు ఎటువైపు ఉన్నారో తెలీదు. కృష్ణ- గుంటూరు జిల్లాలు రాజధానిని సీరియస్‌గా తీసుకుంటున్నారో లేదో తేల్చలేం. ఎన్నికల్లో ఇంకా చాలా అంశాలుంటాయి. కానీ వైఎస్‌ఆర్‌సీపీ మాత్రం లోకల్ బాడీ ఎన్నికలే దానికి సూచిక అంటోంది. అన్నిచోట్ల 85 నుంచి 90 స్థానాలు గెలిచామంటే.. తమ పాలసీకి జనం జై కోట్టినట్లే అంటోంది.. చూడాలి మరి రిజల్ట్.. ఎలా ఉంటుందో.. ఇప్పటికైతే..జగన్‌ అజెండాను సెట్ చేసినట్లే.. !

Published at : 25 Mar 2022 06:57 PM (IST) Tags: jagan AP Politics High Court Amravati Amravati Judgment

సంబంధిత కథనాలు

Atmakur By Election: ఏపీలో మోగిన ఉప ఎన్నికల నగారా, ఆత్మకూరు బై ఎలక్షన్ ఎప్పుడంటే ! రేసులో ముందున్న విక్రమ్ రెడ్డి

Atmakur By Election: ఏపీలో మోగిన ఉప ఎన్నికల నగారా, ఆత్మకూరు బై ఎలక్షన్ ఎప్పుడంటే ! రేసులో ముందున్న విక్రమ్ రెడ్డి

Rajya Sabha Nominations: రాజ్యసభకు టీఆర్ఎస్ అభ్యర్థులు దామోదర్‌రావు, పార్థసారధి నామినేషన్‌ దాఖలు

Rajya Sabha Nominations: రాజ్యసభకు టీఆర్ఎస్ అభ్యర్థులు దామోదర్‌రావు, పార్థసారధి నామినేషన్‌ దాఖలు

BJP Telugu States Rajya Sabha: తెలుగు రాష్ట్రాల నుంచి ఒకరికి రాజ్యసభ ! బీజేపీలో ఎవరా అదృష్టవంతుడు ?

BJP Telugu States Rajya Sabha:  తెలుగు రాష్ట్రాల నుంచి ఒకరికి రాజ్యసభ ! బీజేపీలో ఎవరా అదృష్టవంతుడు ?

Five Congress Leaders : కాంగ్రెస్‌కు గుడ్ బై చెబుతున్న సీనియర్లు ! ఆపడం లేదా ? ఆగడం లేదా ?

Five Congress Leaders : కాంగ్రెస్‌కు గుడ్ బై చెబుతున్న సీనియర్లు ! ఆపడం లేదా ? ఆగడం లేదా ?

3 Years of YSR Congress Party Rule : మూడేళ్ల పాలనలో నవరత్నాలు మెరిసినదెంత ? ప్రజలకు చేరిందెంత ?

3 Years of YSR Congress Party Rule : మూడేళ్ల పాలనలో నవరత్నాలు మెరిసినదెంత ? ప్రజలకు చేరిందెంత ?
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Modi Hyderabad Tour Today: నేడే హైదరాబాద్‌కు ప్రధాని, రంగంలోకి 2 వేల మంది పోలీసులు - పూర్తి షెడ్యూల్ ఇదీ

Modi Hyderabad Tour Today: నేడే హైదరాబాద్‌కు ప్రధాని, రంగంలోకి 2 వేల మంది పోలీసులు - పూర్తి షెడ్యూల్ ఇదీ

Diabetes: అధ్యయనంలో షాకింగ్ రిజల్ట్, టైప్ 2 డయాబెటిస్ ఉంటే మెదడు త్వరగా ముసలిదైపోతుంది

Diabetes: అధ్యయనంలో షాకింగ్ రిజల్ట్, టైప్ 2 డయాబెటిస్ ఉంటే మెదడు త్వరగా ముసలిదైపోతుంది

YS Jagan Davos Tour: మచిలీపట్నంలో కర్బన రహిత ఇండస్ట్రియల్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ జోన్‌, ఏపీతో ఏస్‌ అర్బన్‌ డెవలపర్స్‌ ఒప్పందం

YS Jagan Davos Tour: మచిలీపట్నంలో కర్బన రహిత ఇండస్ట్రియల్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ జోన్‌, ఏపీతో ఏస్‌ అర్బన్‌ డెవలపర్స్‌ ఒప్పందం

Bandi Sanjay Sensational Comments: తెలంగాణలో మసీదులన్నీ తవ్వాలి, బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Bandi Sanjay Sensational Comments: తెలంగాణలో మసీదులన్నీ తవ్వాలి, బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు