YSRCP News : వైఎస్ఆర్‌సీపీలో ఎలాంటి బాధ్యతలు లేని విజయసాయిరెడ్డి - ఇక రిటైర్మెంటేనా ?
వైఎస్ఆర్‌సీపీలో విజయసాయిరెడ్డిని పూర్తిగా పక్కన పెట్టేశారా ?చెవిరెడ్డికి అనుబంధ సంఘాల బాధ్యతలు !గతంలోనే సోషల్ మీడియా ఇంచార్జ్ గా తొలగింపుఢిల్లీలోనే ఎక్కువ సమయం గడుపుతున్న విజయసాయిరెడ్డి
YSRCP News : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విజయ సాయిరెడ్డి ప్రాధాన్యం మరింత తగ్గిపోయిందన్న భావన ఆ పార్టీ నేతల్లో పెరుగుతోంది. ఎమ్మెల్యేలు,ఇంచార్జులతో సీఎం జగన్ నిర్వహించిన సమీక్షలో.. విజయసాయిరెడ్డి చూస్తున్న అనుబంధ సంఘాల బాధ్యతల్ని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చూసుకుంటారని సీఎం జగన్ చెప్పారు. ఈ అంశమే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. విజయసాయిరెడ్డి అన్నీ చూసుకోలేకపోతున్నారని.. ఆయన స్థానంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పని చేస్తారన్నారు.
విజయసాయిరెడ్డికి ప్రత్యేకమైన పార్టీ బాధ్యతలేమీ లేనట్లే !
గత ఎన్నికలకు ముందు విజయసాయిరెడ్డి అత్యంత కీలకంగా పని చేశారు. కానీ ఇప్పుడు విజయసాయిరెడ్డికి పెద్దగా ఏమీ బాధ్యతలు లేవు. అనుబంధ సంఘాల ఇంచార్జ్ గా ఉన్నారు. కొన్నాళ్లుగా సైలెంట్ గా ఉన్నప్పటికీ ఇటీవల విజయసాయిరెడ్డి మళ్లీ కాస్త యాక్టివ్ అవుతున్నారు. అనుబంధ సంఘాలతో రోజూ సమీక్షలు చేస్తున్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి వద్దనుకున్న రీజినల్ కో ఆర్డినేటర్ బాధ్యతల్ని విజయసాయిరెడ్డికి ఇచ్చారని చెప్పుకున్నారు. కానీ అలాంటిదేమీ లేదని సీఎం జగన్ తాజా ప్రకటనతో తేలిపోయిందని వైసీపీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
చంద్రబాబు మాటలపై కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి కౌంటర్! ఆ విషయం ఒప్పుకుంటారా అని సూటి ప్రశ్న
చెవిరెడ్డికి బదులు ఆయన కుమారుడికి చంద్రగిరి టిక్కెట్ !
కొంత కాలంగా సీఎం జగన్‌కు చెవిరెడ్డి అత్యంత సన్నిహితమయ్యారు. చాలా వరకు అంతర్గత వ్యవహారాలు చక్క బెడుతున్నారు. ఇప్పుడు ఆయనకు మరింత కీలకమైన బాధ్యతలు ఇవ్వడానికే చెవిరెడ్డిని ఎన్నికల్లో పోటీ చేయవద్దని.. తన వద్దకు రావాలని జగన్ పిలుపునిచ్చినట్లుగా చెబుతున్నారు. వారసులెవరికీ టిక్కెట్లు లేవని జగన్ ఖరాఖండిగా చెబుతున్నారు. కానీ చెవిరెడ్డికి మాత్రం ఆయన కుమారుడికే చాన్స్ ఇస్తామని చెప్పారు. ఈ విషయాన్ని చెవిరెడ్డి కార్యకర్తల మీటింగ్ పెట్టుకుని మరీ చెప్పారు. భూమన , ధర్మాన లాంటి నాయకులు కూడా తమ వారసులకు టిక్కెట్లు ఇప్పించుకోవడానికి తంటాలు పడుతున్నారని కానీ చెవిరెడ్డికి మాత్రమే ప్రత్యేక అనుమతిని జగన్ ఇచ్చారని అంటున్నారు. చెవిరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి తానే అభ్యర్థినని.. గడప గడపకూ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. చెవిరెడ్డి ఇప్పటికే సీఎం క్యాంప్ కార్యాలయంలో కీలకంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు.
అతిథులు ఎవరొచ్చినా ముందు స్తూపం దగ్గరికే; అప్పట్లో నాపై విపరీతమైన దాడి జరిగింది - కేసీఆర్
ఇప్పటికే అనుబంధ విభాగాల సమన్వయకర్తగా చెవిరెడ్డి
నిజానికి గత ఫిబ్రవరిలో అనుబంధ విభాగాల రాష్ట్ర సమన్వయ కర్తగా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిని నియమించారు. ఇంచార్జ్ గా విజయసాయిరెడ్డి ఉన్నారు. ఆయన కింద కో ఇన్ఛార్జిగా చెవిరెడ్డి ఉన్నారు. ఇప్పుడు సాయిరెడ్డిని పక్కకు తప్పించి చెవిరెడ్డికి బాధ్యతలు అప్పగించినట్లయిందన్న వాదన వినిపిస్తోంది. ఇప్పటికే వైసీపీ సోషల్ మీడియా బాధ్యతల నుంచి సాయిరెడ్డిని తప్పించి సజ్జల కుమారుడికి ఇచ్చేశారు. ఇప్పుడు ఈ కోఆర్డినేటర్ పదవి నుంచి సాయరెడ్డిని పక్కన పెట్టడం వైఎస్ఆర్‌సీపీలో కూడా చర్చనీయాంశం అవుతోంది. ప్రస్తుతం విజయసాయిరెడ్డికి పార్టీలో ఎలాంటి బాధ్యతలు లేవని చెబుతున్నారు.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial