అన్వేషించండి

Bhatti Vikramarka: 'కట్టుకథలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారు' - కేసీఆర్ వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం భట్టి కౌంటర్

Telangana News: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సూర్యాపేటలో చేసిన వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. పదేళ్లు సీఎంగా చేసిన వ్యక్తి పచ్చి అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు.

Bhatti Vikramarka Slams Brs Chief Kcr: పదేళ్లు సీఎంగా పని చేసిన వ్యక్తి పచ్చి అబద్దాలు చెప్పారని.. ఇంతలా దిగజారి మాట్లాడడం సరికాదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) మండిపడ్డారు. సూర్యాపేటలో (Suryapeta) ఆదివారం పంటల పరిశీలన అనంతరం బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ఢిల్లీలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భట్టి మాట్లాడారు. బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లో చేరుతుంటే ఆయన తట్టుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. కట్టుకథలు చెప్పి ప్రజలను మభ్యపెట్టాలని ప్రయత్నించారని ధ్వజమెత్తారు. మైక్ సమస్య వస్తే.. కరెంట్ కోతలంటూ అబద్ధాలు చెప్పారని అన్నారు. 'చలికాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మా పాలనలో ఇంకా వర్షాకాలం రానే లేదు. కాళేశ్వరం ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ అంటూ డబ్బా కొట్టారు. ఇప్పుడు అది దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. కేసీఆర్ హయాంలో అప్పులు చేసి రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారు.' అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

'ఎన్ని హామీలు నెరవేర్చారు.?'

పదేళ్ల పాలనలో కేసీఆర్ ఎన్ని హామీలు నెరవేర్చారో చెప్పాలని భట్టి విక్రమార్క నిలదీశారు. 'అందరికీ డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించారా.?. ప్రతీ మండలంలో ఇంగ్లీష్ మీడియం స్కూళ్లు, ప్రతీ నియోజకవర్గంలో కేజీ టూ పీజీ విద్యాలయాలు నిర్మించారా.?. దళితులకు మూడెకరాల భూమి పంపిణీ చేశారా.?. ఐదేళ్లలో రైతు రుణమాఫీ చేశారా.?. వాననీటిని రిజర్వాయర్లలో నింపే పరిస్థితి లేకుండా చేసింది ఎవరు.?. వీటన్నింటిపైనా చర్చకు సిద్ధమా.?' అని భట్టి ప్రశ్నించారు.

'విద్యుత్ ప్రణాళికలు ఇలా'

ఏప్రిల్, మే నెలలోనూ సరిపడా విద్యుత్ ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించినట్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) తెలిపారు. 2013లోనే యూపీఏ ప్రభుత్వం దేశమంతా గ్రిడ్ అనుసంధానం చేసిందని గుర్తు చేశారు. 'తెలంగాణకు (Telangana) 4 వేల మెగావాట్ల విద్యుత్ ఇవ్వాలని విభజనం చట్టంలోనే ఉంది. దాని ప్రకారమే రాష్ట్రానికి ఎన్టీపీసీ మంజూరైంది. బొగ్గు లభించే ప్రాంతానికి 350 కి.మీ దూరంలో యాదాద్రి పవర్ ప్లాంట్ పెట్టారు. దీంతో థర్మల్ ప్లాంట్ కు బొగ్గు సరఫరా కోసం భారీగా ఖర్చవుతోంది. పర్యావరణ అనుమతులు పొందడంలో ఆలస్యం వల్ల నిర్మాణ వ్యయం భారీగా పెరిగింది. సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో భద్రాద్రి ప్లాంట్ నిర్మించాలి. కానీ, కమీషన్ల కోసం సబ్ క్రిటికల్ టెక్నాలజీతో భద్రాద్రి ప్లాంట్ చేపట్టారు. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం జరుగుతోంది. సరఫరా లేకుంటే ఇంత వినియోగం ఎలా జరుగుతుంది.' అని భట్టి ప్రశ్నించారు.

Also Read: Sri Rama Kalyana Talambralu: భద్రాద్రి రామయ్య భక్తులకు గుడ్ న్యూస్ - ఇలా చేస్తే మీ ఇంటికే రాములోరి కల్యాణ తలంబ్రాలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Adani Issue: జగన్‌తో పాటు షర్మిలదీ అదే సవాల్ - చంద్రబాబు ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు ?
జగన్‌తో పాటు షర్మిలదీ అదే సవాల్ - చంద్రబాబు ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు ?
Jeedimetla Fire Accident Today: జీడిమెట్ల అగ్ని ప్రమాదంలో ఇంకా అదుపులోకి రాని మంటలు- భయాందోళనలో స్థానికులు
జీడిమెట్ల అగ్ని ప్రమాదంలో ఇంకా అదుపులోకి రాని మంటలు- భయాందోళనలో స్థానికులు
Ram Gopal Varma Video: నాకు భయమా! పోలీసుల నోటీసులపై ఆర్జీవీ సంచలన వీడియో విడుదల
నాకు భయమా! పోలీసుల నోటీసులపై ఆర్జీవీ సంచలన వీడియో విడుదల
Revanth Reddy: తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

జీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలుRail Bus in Mysore Rail Museum | తెలుగు రాష్ట్రాలకే ప్రత్యేకమైన రైలు బస్సు ఇలాగే ఉండేది | ABP DesamPrithvi Shaw Unsold IPL 2025 Auction | అద్భుతమైన భవిష్యత్తును చేతులారా నాశనం చేసుకున్న పృథ్వీ షా | ABP DesamMS Dhoni Auction Plan CSK IPL 2025 Team | ధోని ప్లాన్ వెనుక ఇంత మ్యాటర్ ఉందా..? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Adani Issue: జగన్‌తో పాటు షర్మిలదీ అదే సవాల్ - చంద్రబాబు ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు ?
జగన్‌తో పాటు షర్మిలదీ అదే సవాల్ - చంద్రబాబు ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు ?
Jeedimetla Fire Accident Today: జీడిమెట్ల అగ్ని ప్రమాదంలో ఇంకా అదుపులోకి రాని మంటలు- భయాందోళనలో స్థానికులు
జీడిమెట్ల అగ్ని ప్రమాదంలో ఇంకా అదుపులోకి రాని మంటలు- భయాందోళనలో స్థానికులు
Ram Gopal Varma Video: నాకు భయమా! పోలీసుల నోటీసులపై ఆర్జీవీ సంచలన వీడియో విడుదల
నాకు భయమా! పోలీసుల నోటీసులపై ఆర్జీవీ సంచలన వీడియో విడుదల
Revanth Reddy: తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
Andhra Pradesh Rajya Sabha: ఏపీ నుంచి కూటమికి ముగ్గురు రాజ్యసభ సభ్యులు - నాగబాబుతో పాటు ఈ ఇద్దరికీ చాన్స్
ఏపీ నుంచి కూటమికి ముగ్గురు రాజ్యసభ సభ్యులు - నాగబాబుతో పాటు ఈ ఇద్దరికీ చాన్స్
Maharashtra CM: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్‌- కేంద్రమంత్రిగా ఏక్‌నాథ్ షిండే!
మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్‌- కేంద్రమంత్రిగా ఏక్‌నాథ్ షిండే!
Pawan Kalyan: పిఠాపురంలో రైల్వే హాల్ట్, రైల్వే ఓవర్ బ్రిడ్జి కావాలి - కేంద్ర మంత్రిని కోరిన పవన్ కల్యాణ్
పిఠాపురంలో రైల్వే హాల్ట్, రైల్వే ఓవర్ బ్రిడ్జి కావాలి - కేంద్ర మంత్రిని కోరిన పవన్ కల్యాణ్
Kollywood: తమిళ తంబీలకు తీరని కల... కోలీవుడ్ నుంచి 1000 కోట్ల సినిమా వచ్చేది ఎప్పుడు?
తమిళ తంబీలకు తీరని కల... కోలీవుడ్ నుంచి 1000 కోట్ల సినిమా వచ్చేది ఎప్పుడు?
Embed widget