అన్వేషించండి

Sri Rama Kalyana Talambralu: భద్రాద్రి రామయ్య భక్తులకు గుడ్ న్యూస్ - ఇలా చేస్తే మీ ఇంటికే రాములోరి కల్యాణ తలంబ్రాలు

Telangana News: భద్రాద్రి రామయ్య కల్యాణ తలంబ్రాలను ఇంటికే డెలివరీ చేసేలా టీఎస్ఆర్టీసీ చర్యలు చేపట్టింది. దీనికి సంబంధించిన పోస్టర్ ను సంస్థ ఎండీ వీసీ.సజ్జనార్ సోమవారం విడుదల చేశారు.

Tsrtc To Home Delivery Bhadrachalam Sri Rama Kalyana Talambralu: భద్రాచలం రామయ్య భక్తులకు టీఎస్ఆర్టీసీ (Tsrtc) గుడ్ న్యూస్ చెప్పింది. శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో (Bhadrachalam) జరిగే శ్రీ సీతారామచంద్రుల కల్యాణోత్సవ తలంబ్రాలను ఈ ఏడాది కూడా భక్తులకు అందించేందుకు సిద్ధమైంది. దేవాదాయ శాఖ సహకారంతో రాములోరి కల్యాణ తలంబ్రాలను ఇంటికే డోర్ డెలివరీ చేసేలా చర్యలు చేపట్టింది. ఈ నెల 17న భద్రాచలంలో వైభవంగా జరిగే రామయ్య కల్యాణోత్సవ వేడుకలకు హాజరు కాలేని భక్తులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. రామయ్య తలంబ్రాలు కావాలనుకునే భక్తులు టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ కేంద్రాల్లో రూ.151 చెల్లించి వివరాలు నమోదు చేసుకోవాలి. రామయ్య కల్యాణం అనంతరం తలంబ్రాలను బుక్ చేసుకున్న భక్తులకు హోం డెలివరీ చేస్తారు.

పోస్టర్ రిలీజ్

హైదరాబాద్ లోని బస్ భవన్ లో భద్రాద్రి సీతారాముల కల్యాణ తలంబ్రాల బుకింగ్ పోస్టర్ ను టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ (Sajjanar) రిలీజ్ చేశారు. 'ఎంతో నియమ నిష్టలతో ధాన్యాన్ని గోటితో ఒలిచి తీసిన కోటి బియ్యం గింజలను తలంబ్రాలుగా ఎన్నో ఏళ్లుగా రాములోరి కల్యాణంలో ఉపయోగిస్తున్నారు. విశిష్టమైన ఈ తలంబ్రాలను భక్తుల ఇంటికి చేర్చాలని రెండేళ్ల క్రితమే టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ఈ ప్రయత్నానికి భక్తుల నుంచి మంచి స్పందన వచ్చింది. సంస్థపై ఉన్న విశ్వాసంతో భక్తులు భారీ సంఖ్యలో తలంబ్రాలను బుక్‌ చేసుకుంటున్నారు. 2022లో దాదాపు 89 వేల మంది భక్తులకు తలంబ్రాలను బుక్ చేసుకోగా.. గత ఏడాది 1.17 లక్షల మంది భక్తులకు తలంబ్రాలను సంస్థ అందజేసింది.' అని సజ్జనార్ అన్నారు.

రాష్ట్రంలోని అన్ని టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ కౌంటర్లలోనూ తలంబ్రాలను బుక్ చేసుకోవచ్చు. అలాగే, టీఎస్ఆర్టీసీ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కూడా భక్తుల వద్ద నేరుగా తలంబ్రాల ఆర్డర్లు బుక్ చేసుకుంటారు. తలంబ్రాల సేవను పొందాలనుకునే భక్తులు టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ ఫోన్ నెంబర్లు 040 - 23450033, 040 - 69440000, 040 - 69440069ను సంప్రదించాలని అధికారులు సూచించారు.

Also Read: KTR: 'కాంగ్రెస్ లోనే ఏక్ నాథ్ శిండేలు ఉన్నారు' - ఎన్నికల్లో ఓటమిపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

టాప్ హెడ్ లైన్స్

మంగళ గౌరీ వ్రత కథ: శ్రావణ మంగళవారం గౌరీ దేవి పూజ సమయంలో ఈ కథ తప్పనిసరిగా చదువుకోవాలి!
మంగళ గౌరీ వ్రత కథ: శ్రావణ మంగళవారం గౌరీ దేవి పూజ సమయంలో ఈ కథ తప్పనిసరిగా చదువుకోవాలి!
శ్రావణ మంగళగౌరీ పూజ 2026: పూజా సామగ్రి, సులువైన పూజావిధానం తెలుసుకోండి!
శ్రావణ మంగళగౌరీ పూజ 2026: పూజా సామగ్రి, సులువైన పూజావిధానం తెలుసుకోండి!
13-08-2026 గురువారం మీ రాశిఫలాలు!
13-08-2026 గురువారం మీ రాశిఫలాలు!
Solar Eclipse 2026: మొబైల్, టీవీలో ప్రత్యక్ష సూర్యగ్రహణాన్ని చూసినా నియమాలు పాటించాలా? తర్వాత స్నానం చేయలా?
మొబైల్, టీవీలో ప్రత్యక్ష సూర్యగ్రహణాన్ని చూసినా నియమాలు పాటించాలా? తర్వాత స్నానం చేయలా?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Adilabad Latest News: సీసీఐ పరిశ్రమపై జెన్ జీల పోరాటం- ముందే మేల్కోవాలని ముఖ్యమంత్రికి ప్రొఫెసర్ కాశీం సూచన 
సీసీఐ పరిశ్రమపై జెన్ జీల పోరాటం- ముందే మేల్కోవాలని ముఖ్యమంత్రికి ప్రొఫెసర్ కాశీం సూచన 
Telangana High Court: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
మంగళ గౌరీ వ్రత కథ: శ్రావణ మంగళవారం గౌరీ దేవి పూజ సమయంలో ఈ కథ తప్పనిసరిగా చదువుకోవాలి!
మంగళ గౌరీ వ్రత కథ: శ్రావణ మంగళవారం గౌరీ దేవి పూజ సమయంలో ఈ కథ తప్పనిసరిగా చదువుకోవాలి!
Agri Gold Victims: అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం - ఆస్తులు వేలం వేసి చెల్లింపులు - ఆటంకాలు లేకుండా పూర్తి చేయగలరా?
అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం - ఆస్తులు వేలం వేసి చెల్లింపులు - ఆటంకాలు లేకుండా పూర్తి చేయగలరా?
Karthika Deepam 2 Serial Today August 13th: కార్తీకదీపం 2 సీరియల్: రెస్టారెంట్ ఎవరిది? మాలిని 5 లక్షలు ఆఫర్! జ్యోత్స్న నిర్ణయమేంటి?
కార్తీకదీపం 2 సీరియల్: రెస్టారెంట్ కోసం బిగ్ ఫైట్? మాలిని 5 లక్షలు ఆఫర్! జ్యోత్స్న నిర్ణయమేంటి?
Embed widget