అన్వేషించండి

Delimitation 2026: డీలిమిటేషన్‌ రాజ్యాంగ సవరణ ఈ సారి ఖాయం - ఫార్ములా 50 శాతమా? టార్గెటెడ్ విభజనా?

Womens Reservation Bill: కేంద్రానికి రాజ్యాంగసవరణలకు అవసరమైన మద్దతు లభిస్తోంది. దీంతో డీలిమిటేషన్ బిల్లు ఆమోదం పొందడం ఖాయమే. కానీ ఏకాభిప్రాయం సాధ్యమేనా?

Delimitation formula for Lok Sabha seats:  దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన , మహిళా రిజర్వేషన్ బిల్లు  అమలుపై రాజకీయ సమీకరణాలు అత్యంత వేగంగా మారుతున్నాయి. గతంలో ఎన్డీఏ  కూటమికి పార్లమెంట్‌లో మూడింట రెండు వంతుల  మెజార్టీ లేకపోవడం వల్ల ఈ రాజ్యాంగ సవరణల ప్రక్రియ సాధ్యం కాదనే చర్చ నడిచింది. అయితే, లోక్‌సభలో అనూహ్యంగా తృణమూల్ కాంగ్రెస్  కి చెందిన సుమారు 20 మంది ఎంపీలు ప్రభుత్వానికి మద్దతుగా నిలవడం, ఇండీ  కూటమిలోని సమాజ్‌వాదీ పార్టీ వంటి కొన్ని ప్రాంతీయ పార్టీలు కూడా మహిళా రిజర్వేషన్ల క్రెడిట్ కోసం సానుకూల సంకేతాలు ఇస్తుండటంతో మోదీ-షా ద్వయానికి అవసరమైన సంఖ్యాబలం సమకూరుతున్నట్లు స్పష్టమవుతోంది.   అసలు డీలిమిటేషన్ ఏ ప్రాతిపదికన జరగబోతోంది? దక్షిణాది రాష్ట్రాల భవిష్యత్తు ఏంటి?  

నియోజకవర్గాల సంఖ్యను పెంచేందుకు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ప్రధానంగా రెండు భిన్నమైన ఫార్ములాలు ప్రచారంలో ఉన్నాయి.

1.  50 శాతం పెంపు 

ఈ ఫార్ములా ప్రకారం.. ప్రస్తుతం ఉన్న లోక్‌సభ సీట్ల సంఖ్యను   నేరుగా దాదాపు 50 శాతం పెంచుతారు.  కొత్త పార్లమెంట్ భవనాన్ని కూడా ఇదే సంఖ్యాబలానికి అనుగుణంగా నిర్మించారు. కేవలం జనాభా ప్రాతిపదికన   సీట్లను పెంచితే, జనాభా నియంత్రణ పాటించని ఉత్తరాది రాష్ట్రాలకు భారీగా సీట్లు పెరుగుతాయి. 

2. ప్రధాని ఆర్థిక సలహా మండలి టార్గెటెడ్ ఫార్ములా 

జనాభా ప్రాతిపదికన మాత్రమే సీట్లు పెంచితే దేశ సమగ్రతకు, సమాఖ్య స్ఫూర్తికి నష్టం వాటిల్లుతుందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి  ఒక ప్రత్యామ్నాయాన్ని సూచించింది. కేవలం జనాభాయే కాకుండా.. భౌగోళిక విస్తీర్ణం, ఆర్థిక వృద్ధి, అక్షరాస్యత వంటి వివిధ సూచీలను పరిగణనలోకి తీసుకుని 'టార్గెటెడ్ నియోజకవర్గాల విభజన' చేయాలని ప్రతిపాదించింది. దీనివల్ల ఉత్తరాదికి సీట్లు పెరిగినప్పటికీ, దక్షిణాది రాష్ట్రాలు మరీ ఘోరంగా నష్టపోకుండా ఒక సమతుల్యత సాధ్యమవుతుంది.

Also Read: SIR సర్వే కోసం మీ ఇంటికి అధికారులు వస్తున్నారా? సిద్ధం చేసుకోవాల్సిన పత్రాలు ఇవే!

 దక్షిణాది పార్టీల అసంతృప్తి.. దేనికి ఓటేస్తాయి? 

జనాభా ఆధారిత డీలిమిటేషన్ ఫార్ములాను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ వంటి దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. జనాభా నియంత్రణను పక్కాగా అమలు చేసి, దేశ ఆర్థిక వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నందుకు తమకు సీట్లను తగ్గించి శిక్షిస్తారా? అని చంద్రబాబు నాయుడు, స్టాలిన్ వంటి నేతలు ఇప్పటికే బహిరంగంగానే ప్రశ్నించారు. ఒకవేళ కేంద్రం 50 శాతం పెంపు ఫార్ములాను మొండిగా ముందుకు తీసుకెళ్తే దక్షిణాది పార్టీలు ఖచ్చితంగా వ్యతిరేకిస్తాయి. అయితే, ఒకవేళ ప్రధాని ఆర్థిక సలహా మండలి ప్రతిపాదించిన 'టార్గెటెడ్ అండ్ వెయిటెడ్'   పద్ధతిని ప్రవేశపెట్టి.. జనాభా నియంత్రించిన రాష్ట్రాలకు ప్రత్యేక వెయిటేజీ ఇస్తే మాత్రం దక్షిణాది పార్టీలు ఆ ఫార్ములాకు ఓటేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. 

 మహిళా రిజర్వేషన్లతో ముడిపడిన రాజకీయం 

మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టంగా మారినప్పటికీ, అది అమలు కావాలంటే డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తి కావడం సాంకేతికంగా అత్యంత కీలకం. ఉత్తరాదిలోని ఎస్పీ, ఆర్జేడీ వంటి పార్టీలు  కోటాలో కోటా ఓబీసీ మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్  డిమాండ్ చేస్తున్నాయి. అయితే, పార్లమెంట్‌లో ఎన్డీఏ బలం పెరుగుతున్న తరుణంలో, మహిళా ఓటర్ల మద్దతును పూర్తిగా స్వంతం చేసుకోవడానికి కేంద్రం ఈ రెండు బిల్లులను ఒకేసారి ముడిపెట్టి ఆమోదించే వ్యూహంతో ముందుకు వెళ్తోంది.

 సమాఖ్య స్ఫూర్తికి పరీక్షా సమయం 

రాబోయే రోజుల్లో డీలిమిటేషన్ చర్చ కేవలం సీట్ల సంఖ్యకు పరిమితం కాకుండా.. భారతదేశ  సమాఖ్య స్ఫూర్తి కి ఒక పెద్ద పరీక్షగా మారబోతోంది. మోదీ ప్రభుత్వం పార్లమెంట్‌లో లభించిన 2/3 వంతు మెజార్టీతో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటుందా, లేదా దక్షిణాది రాష్ట్రాల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని ఆర్థిక సలహా మండలి సూచించిన సమతుల్య ఫార్ములా వైపు మొగ్గు చూపుతుందా అనేది తేలాల్సి ఉంది.   

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vijay Cinema Style Politics: తమిళనాడులో విజయ్ పొలిటికల్ గ్లామర్ - సీఎం స్థాయి పర్యటనలు, సినిమా స్టైల్ రీల్స్.. రాజకీయంగా లాభమా? నష్టమా?
తమిళనాడులో విజయ్ పొలిటికల్ గ్లామర్ - సీఎం స్థాయి పర్యటనలు, సినిమా స్టైల్ రీల్స్.. రాజకీయంగా లాభమా? నష్టమా?
TDP MLC Seats Competition: టీడీపీలో ఎమ్మెల్సీ సీట్ల ఉత్కంఠ - రెండు ఖాళీలకు భారీ పోటీ.. చంద్రబాబు మార్క్ సామాజిక సమీకరణాలు వర్కవుట్ అయ్యేనా?
టీడీపీలో ఎమ్మెల్సీ సీట్ల ఉత్కంఠ - రెండు ఖాళీలకు భారీ పోటీ.. చంద్రబాబు మార్క్ సామాజిక సమీకరణాలు వర్కవుట్ అయ్యేనా?
Revanth Reddy Criminal Waste Remarks: రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
Bhogapuram Airport Credit War: భోగాపురం ఎయిర్‌పోర్ట్ క్రెడిట్ వార్ - చంద్రబాబు విజన్ ఉందా? జగన్ కష్టం ఉందా?
భోగాపురం ఎయిర్‌పోర్ట్ క్రెడిట్ వార్ - చంద్రబాబు విజన్ ఉందా? జగన్ కష్టం ఉందా?
Advertisement

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
తక్కువ ఇంధన ఖర్చు, అద్భుతమైన మైలేజ్.. త్వరలో మార్కెట్లోకి Baleno Facelift 2026 
తక్కువ ఇంధన ఖర్చు, అద్భుతమైన మైలేజ్.. త్వరలో మార్కెట్లోకి Baleno Facelift 2026 
Hrithik Roshan Vs Kangana Ranaut: సారీ హృతిక్... ఇంటర్నెట్‌లో జెన్ జీ రచ్చ... కంగనా ఫైర్ - అసలు ఏం జరిగిందంటే?
సారీ హృతిక్... ఇంటర్నెట్‌లో జెన్ జీ రచ్చ... కంగనా ఫైర్ - అసలు ఏం జరిగిందంటే?
Adilabad Airport Credit War: ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
CWG India Medals: కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
Samantha: బేబీ బంప్‌తో సమంత లేటెస్ట్ ఫోటోషూట్... పవర్ ఫుల్ మెసేజ్ కూడా
బేబీ బంప్‌తో సమంత లేటెస్ట్ ఫోటోషూట్... పవర్ ఫుల్ మెసేజ్ కూడా
Embed widget