అన్వేషించండి

TDP MLC Seats Competition: టీడీపీలో ఎమ్మెల్సీ సీట్ల ఉత్కంఠ - రెండు ఖాళీలకు భారీ పోటీ.. చంద్రబాబు మార్క్ సామాజిక సమీకరణాలు వర్కవుట్ అయ్యేనా?

TDP MLC Candidates Selection: ఆంధ్రప్రదేశ్ టీడీపీలో రెండు ఎమ్మెల్సీ సీట్లకు పెరిగిన పోటీ. సీఎం చంద్రబాబు నాయుడు ఎవరికి ఛాన్స్ ఇస్తారు? సీనియర్లకు చాన్స్ లభిస్తుందా?

Chandrababu Naidu MLC Seats Finalisation: ఆంధ్రప్రదేశ్‌లో రెండు శాసనమండలి స్థానాల భర్తీకి సమయం దగ్గరపడుతుండటంతో అధికార తెలుగుదేశం పార్టీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. రాబోయే కేబినెట్ భేటీ అనంతరం లేదా పార్టీ సీనియర్లతో జరిపే అత్యవసర భేటీలో సీఎం నారా చంద్రబాబు నాయుడు ఈ రెండు సీట్లపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. అయితే, 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు త్యాగం చేసిన సీనియర్లు, సామాజిక వర్గాల ప్రాతినిధ్యం మరియు పొత్తు ధర్మం మధ్య చంద్రబాబు ఎవరికి అవకాశం కల్పిస్తారనే అంశం అమరావతి వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. 

రెండు స్థానాల కోసం భారీ పోటీ 

ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాల కోసం టీడీపీ నుంచి ఆశావహుల జాబితా భారీగా ఉంది. ముఖ్యంగా గతం నుంచీ పార్టీకి విధేయులుగా ఉంటూ, ఎన్నికల సమయంలో పొత్తులు ,  ఇతర సమీకరణాల వల్ల అసెంబ్లీ టికెట్ లభించని పలువురు సీనియర్ నేతలు ఈ పదవిపై కోటి ఆశలు పెట్టుకున్నారు. రాయలసీమ, కోస్తా ప్రాంతాలకు చెందిన కొందరు ముఖ్య నేతలతో పాటు ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు, సామాజిక వర్గాల వారీగా బలమైన గుర్తింపు ఉన్న నాయకులు చంద్రబాబు, లోకేష్‌లను కలిసి తమ అభ్యర్థిత్వాలను పరిశీలించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

చంద్రబాబు చూసే సమీకరణాలేంటి? 

ఈ రెండు స్థానాల ఎంపికలో చంద్రబాబు ప్రధానంగా రెండు కీలకమైన అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. మొదటిది త్యాగాలకు గుర్తింపు . గత అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి పొత్తులో భాగంగా గెలిచే అవకాశాలు ఉన్నప్పటికీ తమ స్థానాలను మిత్రపక్షాలకు లేదా ఇతర నేతలకు వదులుకున్న నాయకులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచనలో పార్టీ అధిష్టానం ఉంది. రెండోది సామాజిక ,  ప్రాంతీయ సమతుల్యత . బీసీ, ఎస్సీ లేదా మైనార్టీ వర్గాలకు ప్రాతినిధ్యం పెంచడం ద్వారా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి రాజకీయంగా ప్రయోజనం చేకూరేలా ప్లాన్ చేస్తున్నారు.

కూటమి పార్టీ నుంచి ఈ సారి చాన్స్ లేనట్లే్ 

మరోవైపు, కూటమి భాగస్వామ్య పక్షాల నుంచి కూడా ఈ సీట్లపై ఒత్తిడి ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేనకు కొణిదెల నాగబాబు, బీజేపీకి సోము వీర్రాజులకు అవకాశాలు లభించినందున , ఈసారి రెండు స్థానాలనూ పూర్తి స్థాయిలో టీడీపీ ఖాతాలోనే ఉంచుకోవాలని తమ్ముళ్లు భావిస్తున్నారు. అయితే, కేంద్ర, రాష్ట్ర స్థాయిలో కూటమి బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు రాజకీయ వ్యూహకర్తగా చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారోనని పార్టీ శ్రేణులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.

కొత్త పేర్లు తెరపైకి వస్తాయా? 

ఈ రేసులో సీనియర్ నేతల పేర్లతో పాటు యువత, మహిళలకు కూడా అవకాశం ఇస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. గతంలో కావలి గ్రీష్మ వంటి యువ నాయకులకు, బీసీ నేతలకు అవకాశమిచ్చిన తీరును చూస్తే, ఈసారి కూడా ఊహించని సరికొత్త పేర్లను స్క్రీన్‌పైకి తెచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేసిన తీరు, నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేసిన నాయకుల డేటాను ఐప్యాక్ లేదా అంతర్గత సర్వేల ద్వారా తెప్పించుకుని చంద్రబాబు పరిశీలిస్తున్నారు. పార్టీ కోసం కష్టపడి నమ్మకంగా ఉన్న నాయకులకు సముచిత స్థానం కల్పిస్తూనే, రాబోయే స్థానిక పోరుకు కేడర్‌లో నూతన ఉత్సాహాన్ని నింపేలా చంద్రబాబు తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముగింపు దశకు చేరిన ఈ రేసులో ఆ ఇద్దరు అదృష్టవంతులు ఎవరనేది మరికొద్ది రోజుల్లోనే తేలనుంది.  

టాప్ హెడ్ లైన్స్

Telangana Graduates MLC Election : కాంగ్రెస్ సర్కార్‌కి లిట్మస్ టెస్ట్- పట్టభద్రుల ఎమ్మెల్సీ పోరుపై విద్యావంతుల తీర్పు ఏంటి?
కాంగ్రెస్ సర్కార్‌కి లిట్మస్ టెస్ట్- పట్టభద్రుల ఎమ్మెల్సీ పోరుపై విద్యావంతుల తీర్పు ఏంటి?
Nara Lokesh: మృత్యుంజయురాలు గోపిక - రాప్తాడు బాధితురాలి కోసం స్వయంగా లోకేశ్ వైద్య పర్యవేక్షణ !
మృత్యుంజయురాలు గోపిక - రాప్తాడు బాధితురాలి కోసం స్వయంగా లోకేశ్ వైద్య పర్యవేక్షణ !
YS Jagan AP Local Body Elections: సమరం మధ్యలో షాకింగ్ కామెంట్స్ - పల్లెల్లో పోరాడుతున్న క్యాడర్‌కు నిరాశ - జగన్ తొందపడుతున్నారా?
సమరం మధ్యలో షాకింగ్ కామెంట్స్ - పల్లెల్లో పోరాడుతున్న క్యాడర్‌కు నిరాశ - జగన్ తొందపడుతున్నారా?
Telangana Congress Politics: ఢిల్లీ హోటల్ వివాదంపై ఏఐసీసీకి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నివేదిక..!
ఢిల్లీ హోటల్ వివాదంపై ఏఐసీసీకి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నివేదిక..!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gurnoor Brar Magic:  టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. డ‌క్ వ‌ర్త్ సిస్టమ్ తో గ‌ట్టెక్కిన గిల్ సేన‌.. ఆక‌ట్టుకున్న శ్రేయ‌స్, రాహుల్, గుర్నూర్..
టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. డ‌క్ వ‌ర్త్ సిస్టమ్ తో గ‌ట్టెక్కిన గిల్ సేన‌.. ఆక‌ట్టుకున్న శ్రేయ‌స్, రాహుల్, గుర్నూర్..
MPTC Election Results: చనిపోయినా విజయీభవ.. ఎన్నికల్లో నెగ్గిన జనసేన ఎంపీటీసీ అభ్యర్థి
చనిపోయినా విజయీభవ.. ఎన్నికల్లో నెగ్గిన జనసేన ఎంపీటీసీ అభ్యర్థి
వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అరెస్ట్‌ను ఖండించిన మాజీ సీఎం జగన్
వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అరెస్ట్‌ను ఖండించిన మాజీ సీఎం జగన్
Illegal Defense Liquor Racket: భర్తలు తెస్తారు.. భార్యలు అమ్మేస్తారు! అల్వాల్‌లో డిఫెన్స్ మద్యం అక్రమ దందా రట్టు
భర్తలు తెస్తారు.. భార్యలు అమ్మేస్తారు! అల్వాల్‌లో డిఫెన్స్ మద్యం అక్రమ దందా రట్టు
Ponnam Prabhakar: హుస్నాబాద్‌లో ఇందిరమ్మ ఇంట్లో ఘనంగా దీపావళి వేడుకలు.. పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్‌లో ఇందిరమ్మ ఇంట్లో ఘనంగా దీపావళి వేడుకలు.. పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్
TGSRTC కార్మికులను నేలపై కూర్చోబెట్టి అవమానం! సిద్దిపేట డీఎంపై మంత్రి పొన్నం ఆగ్రహం
TGSRTC కార్మికులను నేలపై కూర్చోబెట్టి అవమానం! సిద్దిపేట డీఎంపై మంత్రి పొన్నం ఆగ్రహం
Misuse of RTI Act: మాజీ ప్రేయసి ఎంత మందిని ప్రేమించింది.. 1886 ప్రశ్నలతో ఆర్టీఐ దరఖాస్తులు.. యువకుడికి సమాచార కమిషన్ షాక్!
మాజీ ప్రేయసి ఎంత మందిని ప్రేమించింది.. 1886 ప్రశ్నలతో ఆర్టీఐ దరఖాస్తులు.. యువకుడికి సమాచార కమిషన్ షాక్!
MLC Mirza Rahmat Extortion: మీ వీడియోలు పోస్టు చేస్తామని ఎమ్మెల్సీకి బెదిరింపులు... రూ.5 కోట్లు డిమాండ్, ఆరుగురి అరెస్ట్
మీ వీడియోలు పోస్టు చేస్తామని ఎమ్మెల్సీకి బెదిరింపులు... రూ.5 కోట్లు డిమాండ్, ఆరుగురి అరెస్ట్
Embed widget