అన్వేషించండి

Delimitation Bill 2026: ప్రధాని ఆర్థిక సలహా మండలి చేసిన డీలిమిటేషన్ సిఫార్సులతో కలకలం - దక్షిణాది రాష్ట్రాలు ఆమోదిస్తాయా?

Lok Sabha Expansion 850 Seats: ప్రధాని ఆర్థిక సలహా మండలి డిలిమిటేషన్న‌పై ‘టార్గెటెడ్’ నివేదికను సమర్పించింది. గతంలో ప్రతిపాదించిన 50 శాతం పెంపునకు, ఈ సిఫార్సులకు ఉన్న వ్యత్యాసాలు ఏమిటి?

EAC PM Delimitation Recommendations: భారత జాతీయ రాజకీయాల్లో అత్యంత సున్నితమైన, వ్యూహాత్మకమైన అంశం నియోజకవర్గాల పునర్విభజన  . జనాభా ప్రాతిపదికన మాత్రమే సీట్లను పెంచితే, జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయనే ఆందోళన చాలా కాలంగా ఉంది. ఈ  కారణంగా, ఏప్రిల్ 2026లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన  లిమిటేషన్ బిల్లు 2026  ద్వారా లోక్‌సభ స్థానాల గరిష్ట పరిమితిని 550 నుంచి 850కి పెంచేందుకు ప్రతిపాదించింది. దీనిపై దక్షిణాది నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్న తరుణంలో, ప్రధాని ఆర్థిక సలహా మండలి  విడుదల చేసిన కొత్త వర్కింగ్ పేపర్ సరికొత్త చర్చకు తెరలేపింది. కేవలం జనాభాను మాత్రమే ప్రాతిపదికగా తీసుకోకుండా..  మల్టీ-ఫ్యాక్టర్  విధానంలో నియోజకవర్గాలను విభజించాలని ఈ సలహా మండలి సూచించింది.

174 లోక్ సభ సీట్లను పెంచితే చాలు! 

ప్రధాని ఆర్థిక సలహా మండలి సభ్యురాలు షమీకా రవి, ముదిత్ కపూర్ రూపొందించిన ఈ నివేదిక ప్రకారం.. దేశవ్యాప్తంగా ఒకే రకమైన  విధానాన్ని కాకుండా, ‘టార్గెటెడ్’  ప్రాతిపదికన నియోజకవర్గాలను విభజించాలి. ఓటర్ల టర్నౌట్  , పట్టణీకరణ , ఎస్సీ-ఎస్టీ జనాభా నిష్పత్తి,   భాషాపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని లోక్‌సభ స్థానాలను పునర్వ్యవస్థీకరించాలని స్పష్టం చేసింది. ఈ మోడల్ ప్రకారం, ప్రస్తుతమున్న 543 స్థానాల్లో కేవలం 170 స్థానాలను మాత్రమే రెండు లేదా మూడు భాగాలుగా విభజించి, మొత్తం లోక్‌సభ పరిమాణాన్ని 824 సీట్లకు పెంచవచ్చని సూచించింది.  కేవలం జనాభాను మాత్రమే కొలమానంగా పెడితే ఉత్తరాది రాష్ట్రాల సీట్లు విపరీతంగా పెరిగి, దక్షిణాది ప్రాధాన్యత తగ్గుతుంది. అలా కాకుండా ఈ 'టార్గెటెడ్ మోడల్' ద్వారా లోక్‌సభలో దక్షిణాది రాష్ట్రాల ప్రస్తుత వాటా 23.7%  ఏమాత్రం తగ్గకుండా..  స్థిరంగా ఉంటుంది.

అమిత్ షా ప్రతిపాదనలకు స్పష్టమైన తేడా 
 
గతంలో కేంద్ర ప్రభుత్వం లేదా హోంమంత్రి అమిత్ షా ప్రతిపాదించిన 50 శాతం  పెంపు కు, ఈ సలహా మండలి ఇచ్చిన సూచనలకు మధ్య ఒక స్పష్టమైన వ్యత్యాసం ఉంది. ప్రభుత్వం ప్రతిపాదించిన 50% పెంపు మోడల్ ప్రకారం.. అన్ని పెద్ద రాష్ట్రాలలో సీట్లను ఒకే పద్ధతిలో పెంచుకుంటూ పోతే లోక్‌సభ స్థానాలు 816కి చేరుతాయి. ఉదాహరణకు, ఆ మోడల్‌లో తమిళనాడు సీట్లు 39 నుంచి 59కి, కేరళ సీట్లు 20 నుంచి 30కి, ఉత్తరప్రదేశ్ సీట్లు 80 నుంచి 120కి పెరుగుతాయి. అయితే, ప్రభుత్వ మోడల్ కేవలం సీట్ల సంఖ్యను పెంచడం ద్వారా దక్షిణాదికి నష్టం లేదని చెప్తున్నప్పటికీ.. జనాభా విస్ఫోటనం ఉన్న ఉత్తరాది రాష్ట్రాల ఆధిపత్యం పెరిగే అవకాశాలు ఉన్నాయనేది విమర్శకుల వాదన. దానికి భిన్నంగా, ప్రధాని ఆర్థిక సలహా మండలి తెచ్చిన 'మల్టీ-ఫ్యాక్టర్ మోడల్'.. నియోజకవర్గాల భౌగోళిక పరిమాణం మరియు ఓటింగ్ సరళిని బట్టి స్థానాలను స్ప్లిట్ చేయడం ద్వారా ఫెడరల్ బ్యాలెన్స్   ను కాపాడేందుకు ప్రయత్నిస్తుంది. ప్రభుత్వ ప్రణాళికల విషయానికి వస్తే.. 2026 బిల్లు ప్రకారం కొత్త నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ తదుపరి జరగబోయే జనాభా గణ పూర్తయిన తర్వాతే అమలులోకి వస్తుంది. ఈ లోగా ఢిల్లీ వేదికగా రాజకీయ ఏకాభిప్రాయం సాధించాలని మోదీ సర్కార్ భావిస్తోంది. దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగదని, వారి ప్రాతినిధ్యం తగ్గబోదని హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్‌లో స్పష్టమైన హామీ ఇచ్చారు. 2029 సార్వత్రిక ఎన్నికల కంటే ముందే ఈ ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలనేది ప్రభుత్వ రోడ్‌మ్యాప్.

దక్షిణాది పార్టీలు స్వాగతిస్తాయా? 

ఈ పరిణామాలపై దక్షిణాది ప్రాంతీయ పార్టీలు  ఎలా స్పందిస్తాయన్నది కీలకం.  తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం దక్షిణాది రాష్ట్రాలన్నీ ఈ విషయంలో ఉమ్మడి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ప్రధాని ఆర్థిక సలహా మండలి నివేదిక దక్షిణాది వాటాను కాపాడతామని థియరిటికల్‌గా చెప్తున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో నియోజకవర్గాల సరిహద్దులు మారేటప్పుడు రాజకీయ లబ్ధి ఉత్తరాది వైపే మొగ్గుతుందనే అనుమానం దక్షిణాది పార్టీల్లో బలంగా ఉంది. ఈ డీలిమిటేషన్ వివాదం కేవలం సీట్ల పెంపునకు సంబంధించిన సాంకేతిక ప్రక్రియ కాదు; ఇది భారతదేశ ఉత్తర-దక్షిణ ప్రాంతాల మధ్య ఉన్న రాజకీయ, ఆర్థిక సమతూకానికి సంబంధించిన అత్యంత సున్నితమైన అంశం. కేంద్ర ప్రభుత్వం ప్రధాని ఆర్థిక సలహా మండలి ఇచ్చిన టార్గెటెడ్ స్ప్లిటింగ్  సూచనలను పరిగణనలోకి తీసుకుని, దక్షిణాది ముఖ్యమంత్రులతో చర్చలు జరిపి నమ్మకం కలిగిస్తేనే.. ఈ మెగా ప్రాజెక్టు ఎలాంటి రాజకీయ సంక్షోభాలు లేకుండా ముందుకు సాగుతుంది. 

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Vijay River Interlinking: చంద్రబాబు - విజయ్ భేటీలో అసలు మ్యాటర్ - గోదావరి-కావేరి అనుసంధానం సాధ్యమేనా?
చంద్రబాబు - విజయ్ భేటీలో అసలు మ్యాటర్ - గోదావరి-కావేరి అనుసంధానం సాధ్యమేనా?
Modi Cabinet Expansion | దీపావళికి ముందే మోదీ క్యాబినెట్ ప్రక్షాళన!  తెలంగాణ, ఏపీ కోటాలో మార్పులు?
Modi Cabinet Expansion | దీపావళికి ముందే మోదీ క్యాబినెట్ ప్రక్షాళన!  తెలంగాణ, ఏపీ కోటాలో మార్పులు?
Modi Cabinet Expansion: కేంద్ర మంత్రి ఎల్. మురుగన్ హఠాత్ రాజీనామా - మోదీ కేబినెట్ విస్తరణకు వేళాయెనా?
కేంద్ర మంత్రి ఎల్. మురుగన్ హఠాత్ రాజీనామా - మోదీ కేబినెట్ విస్తరణకు వేళాయెనా?
Telangana Congress Vote Chori Meeting: తెలంగాణలో కాంగ్రెస్ ఓటు చోరీ సభ - సొంత ప్రభుత్వంపైనే అవిశ్వాసమా?
తెలంగాణలో కాంగ్రెస్ ఓటు చోరీ సభ - సొంత ప్రభుత్వంపైనే అవిశ్వాసమా?

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections : స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
National Saras Mela Droupadi Murmu: విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
Vijay Deverakonda Rashmika : పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
Actor Imran Khan Leave India Notice : అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
Jailer 2 Review - 'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
Today OTT Movies : గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
IAS Vikrant Marmat Transfer: బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
CM Chandrababu: సీఎం చంద్రబాబు కేసుల బదిలీ పిటిషన్ పై హైకోర్టులో విచారణ.. ఈ నెల 26కి వాయిదా!
సీఎం చంద్రబాబు కేసుల బదిలీ పిటిషన్ పై హైకోర్టులో విచారణ.. ఈ నెల 26కి వాయిదా!
Embed widget