అన్వేషించండి

Etala Rajender: వైరా నియోజకవర్గంలో వైరం, ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు

వైరా నియోజకవర్గం బీఆర్ఎస్ లో వైరం ఆరని మంటలా సాగుతోందని బిజెపి రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు.

వైరా నియోజకవర్గం బీఆర్ఎస్ లో వైరం ఆరని మంటలా సాగుతోందని బిజెపి రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు. వైరాలో శనివారం నియోజకవర్గస్థాయిలో పోలింగ్‌ బూత్‌ జెంట్లతో నిర్వహించిన సమావేశంలో ఈటల ప్రసంగించారు. వైరాలో బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే  రాములునాయక్‌ వచ్చే ఎన్నికల్లో అభ్యర్థిగా ప్రకటించిన మాజీ ఎమ్మెల్యే బాణోతును ప్రకటించడంతో వైరా నియోజకవర్గంలో అసమ్మతి రగులుతోందని తెలిపారు. వైరాలో బీజేపీ సమావేశం విజయవంతం కావడం పట్ల నాయకులను ఈటల అభినందించారు.

ఈ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ...  వైరాలో బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్‌ వచ్చే ఎన్నికల్లో అభ్యర్థిగా ప్రకటించిన మాజీ ఎమ్మెల్యే బాణోతు మదన్‌లాల్‌ సీఎం కేసీఆర్‌ బాధితులేనని, ఇద్దరూ కేసీఆర్‌ వద్ద అవమానాలకు గురైనవారేనని వ్యాఖ్యానించారు. గిరిజన ఎమ్మెల్యేగా ఉన్న రాములునాయక్‌ ఇంకా పదవి నుంచి దిగిపోకముందే ఆయన అధికారాలకు మంత్రి పువ్వాడ ద్వారా కేసీఆర్‌ కత్తెర వేయించారని విమర్శించారు. ఇప్పుడు టిక్కెట్‌ లభించిన మదన్‌లాల్‌ కూడా గత నాలుగున్నరేళ్లుగా కేసీఆర్‌ నుంచి అవమానాలను అనుభవించినవాడేనని తెలిపారు.

వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం సిట్టింగ్ ఎమ్మెల్యే రాములు నాయక్ చేసిన ప్రయత్నాలు ఫలించక... మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ కు అధిష్టానం అవకాశం ఇవ్వడంతో ఎమ్మెల్యే తో పాటు ఆయన మార్గం మండిపడిందని తెలిపారు. తమ సత్తా చూపిస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సొంత పార్టీకే సవాళ్లు విసురుతున్నారని ఎద్దేవా చేశారు.

వైరా ఎమ్మెల్యేను ఆయన పదవీకాలం పూర్తికాకముందే ఆయన్ను కేసీఆర్‌ గడ్డిపరకలా తీసివేశారని వ్యాఖ్యానించారు. ఆ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనమన్నారు. రాములునాయక్‌ గిరిజన ఎమ్మెల్యే, పేదవాడు, నోట్లో నాలుక లేనివాడు కావడమే కాకుండా కేసీఆర్‌కు అత్యంత విధేయతను ప్రకటించినందునే అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.

కేసీఆర్‌ ఒక దొర అని, ఆయన దగ్గర అందరూ జీతగాళ్లేనని వ్యాఖ్యానించారు. ఆదివాసీ గిరిజన జిల్లాలైన ఆదిలాబాద్‌, వరంగల్‌లలో కేవలం మూడేసి నియోజకవర్గాలు మాత్రమే గిరిజనులకు ఉన్నాయని, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఐదు గిరిజన నియోజకవర్గాలున్నా గిరిజనులను కేసీఆర్‌ వంచిస్తున్నారని విమర్శించారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం రైతుల కోసం అనేక కార్యక్రమాలు ప్రవేశపెట్టిందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‏కు బుద్ది చెప్పి తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టం చేశారు. వైరాలో కూడా బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని పిలుపునిచ్చారు.

మదన్‌లాల్‌ తానూ హాస్టల్‌లో కలిసి చదువుకున్నామని, గత ఎన్నికల్లో ఆయన ఓడిపోయాక రాములునాయక్‌ను బీఆర్‌ఎ్‌సలోకి తీసుకొని మదన్‌లాల్‌ ప్రగతిభవన్‌గేట్‌ వద్ద పడిగాపులు కాసినా కేసీఆర్‌ ఆయనకు అపాయిట్‌మెంట్‌ ఇవ్వకుండా అవమానించారన్నారు. ఆ విషయాన్ని మదన్‌లాల్‌ తనకు అనేకసార్లు చెప్పుకొని బాధపడేవాడని ఈటల వివరించారు. రాములునాయక్‌, మదన్‌లాల్‌ ఇద్దరూ కూడా కేసీఆర్‌ బాధితులేనన్నారు.

అంతకముందు వైరాలో నిర్వహించిన ర్యాలీలో ఈటలతోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈటలను గజమాలతో సన్మానించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీలు గరికపాటి మోహన్‌రావు, సురే్‌షరెడ్డి, మాజీమంత్రి రవీందర్‌నాయక్‌, నాయకులు పొంగులేటి సుధాకర్‌రెడ్డి, శ్రీశైలం గౌడ్‌, అశ్వథామరెడ్డి, కొండపల్లి శ్రీధర్‌రెడ్డి, గల్లా సత్యనారాయణ, సంపత్‌నాయక్‌, భూక్యా శ్యాంసుందర్‌, రామలింగేశ్వరరావు, రవీందర్‌, నెల్లూరి కోటేశ్వరరావు, కృష్ణరాథోడ్‌, డాక్టర్‌ పాపారావు, జానకీరామారావు, ఏలే భద్రయ్య, వెంకటకృష్ణ పాల్గొన్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Ambati Rambabu Vs Revanth Reddy: రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి
రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి "సోఫా" చేరాలంటూ సోషల్ మీడియా పోస్టు 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులుసునామీ బీభత్సానికి 20 ఏళ్లు, ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్న మత్స్యకారులుఅయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తతగుంతలమయమైన రోడ్లు, డ్రోన్‌లతో వింత నిరసనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Ambati Rambabu Vs Revanth Reddy: రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి
రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి "సోఫా" చేరాలంటూ సోషల్ మీడియా పోస్టు 
AP and Telangana Weather Update: ఏపీని షేక్ చేస్తున్న అల్పపీడనం- తెలంగాణను వణికిస్తున్న శీతల గాలులు- తాజా వెదర్ అప్‌డేట్ ఇదే
ఏపీని షేక్ చేస్తున్న అల్పపీడనం- తెలంగాణను వణికిస్తున్న శీతల గాలులు- తాజా వెదర్ అప్‌డేట్ ఇదే
Fact Check: రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లికి కేటీఆర్ 10 కోట్లు...! ఫార్ములా-ఈ కేసు దర్యాప్తులో ఈ విషయం తేలిందా...?
రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లికి కేటీఆర్ 10 కోట్లు...! ఫార్ములా-ఈ కేసు దర్యాప్తులో ఈ విషయం తేలిందా...?
Kota Coaching Centres: దివాలా తీసిన
దివాలా తీసిన "కోట ఐఐటీ కోచింగ్" ఫ్యాక్టరీ - కామధేనువును చేజేతులా చంపేసుకున్నారు !
Viral news: జీతం 13 వేలు కానీ గర్ల్ ప్రెండ్‌కు 4 బెడ్ రూం ఇల్లు, బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్‌గా ఇచ్చాడు - ఫస్ట్ లక్కీ భాస్కర్ , తర్వాత జైలు భాస్కర్ !
జీతం 13 వేలు కానీ గర్ల్ ప్రెండ్‌కు 4 బెడ్ రూం ఇల్లు, బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్‌గా ఇచ్చాడు - ఫస్ట్ లక్కీ భాస్కర్ , తర్వాత జైలు భాస్కర్ !
Embed widget