Munugodu Congress : మన మునుగోడు - మన కాంగ్రెస్ ! ఉపఎన్నికల్లో అమల్లోకి రేవంత్ ప్లాన్
మునుగోడు ఉపఎన్నికల్లో తాడోపేడో తేల్చుకునేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. టీఆర్ఎస్, బీజేపీలకు ధీటుగా పోటీపడాలని భావిస్తోంది.
Munugodu Congress : మునుగోడు ఉపఎన్నిక తెలంగాణ రాజకీయ పార్టీలకు సెమీఫైనల్‌గా మారింది. అన్ని పార్టీలకూ ఈ ఎన్నిక కీలకమే. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి కత్తి మీద సాములా మారింది. కాంగ్రెస్ కంచుకోట. బలమైన క్యాడర్ ఉన్న నియోజకవర్గం. ఇక్కడ గెలవకపోతే .. వచ్చే ఫైనల్స్‌లో పోటీలో ఉందని చెప్పుకోవడం కూడా కష్టమవుతుంది. అందుకే సిట్టింగ్ సీటును దక్కించుకునేందుకు కాంగ్రెస్ గ్రౌండ్ లెవల్ నుంచి వ్యూహరచన చేస్తోంది. " మన మునుగోడు - మన కాంగ్రెస్" నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని ప్రయత్నిస్తోంది. గల్లీ లీడర్ నుంచి ఢిల్లీ లీడర్ వరకు మునుగోడులో ప్రచారం చేయాలని షెడ్యూల్ రూపొందిచుకుంటున్నారు.
రాజగోపాల్ రెడ్డినే టార్గెట్ చేయాలని కాంగ్రెస్ వ్యూహం
ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేతలు మునుగోడుకు క్యూ కట్టారు. గ్యాస్ సిలిండర్, పెట్రోల్ ధరల పెంపుపైనే ప్రజలకు వివరించాలని సూచించారు. ప్రధానంగా బీజేపీ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డినే టార్గెట్ గా చేస్తూ ప్రచారం చేయాలని నిర్ణయించారు. కులాలు, వృత్తుల వారీగా అనుబంధ సంఘాలకు బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించింది. ఇప్పటికే చండూరులో ఓ సభను కాంగ్రెస్ నిర్వహించింది. 21వ తేదీన బీజేపీ చేరికల సభను నిర్వహిస్తోంది. టీఆర్ఎస్ కూడా మరో సభ నిర్వహిస్తోంది. ఈ రెండు సభల కంటే ధీటుగా ఆ తర్వాత మరో బహిరంగసభ నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది.
"అప్పుల రూల్స్" తెలంగాణకు మాత్రమేనా ? కేంద్రం వివక్ష చూపిస్తోందా ? ఇవిగో డీటైల్స్
ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే గెలుపు ఖాయమని రేవంత్ భావన
మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి పూర్తి మద్దతు ఉందని.. అభ్యర్ధి ఎంపిక నుంచి ప్రచారం వరకు ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే గెలుపు సాధ్యమేనని పార్టీ నేతలు విశ్వసిస్తున్నారు. ఇందులో భాగంగానే పార్టీ అనుబంధ సంస్థల ప్రతినిధులతోనూ సమావేశంలో టీపీసీసీ చీఫ్ కీలక వ్యాఖ్యలు చేసారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఇక నుంచి ఆర్జీ పాల్ అని పిలవాలంటూ సూచించారు.ఏఐసీసీ సైతం తెలంగాణలో జరగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా.. ఇద్దరు ఏఐసీసీ కార్యదర్శు లకు కొత్తగా నియోజకవర్గాల బాధ్యతలను అప్పగించింది.
ఖమ్మంలో పెళ్లిసందడి, వేదికకు దారి కోసం రూ.కోటితో బ్రిడ్జి - బాహుబలి సెట్లను మించేలా పందిళ్లు!
నల్లగొండ సీనియర్లు పట్టించుకోకపోయినా రేవంత్ దూకుడు
మునుగోడు బై పోల్ ను సీరియస్ గా తీసుకోవాలని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్ పార్టీ నేతలందరికీ దిశానిర్దేశం చేశారు. గతంలోలా అభ్యర్థి ఎంపిక విషయంలో కానీ ఇతర పరిణామాల విషయంలో కానీ కాంగ్రెస్ పార్టీపై నెగెటివ్ ప్రచారం జరిగేలా ఎవరూ మీడియాతో మాట్లాడవద్దని హైకమాండ్ స్పష్టమైన సూచన చేసింది. రేవంత్ రెడ్డి ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. నల్లగొండలో బలమైన కాంగ్రెస్ నేతలెవరూ ఉపఎన్నికల్లో యాక్టివ్‌గా ఉండే అవకాశం లేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి ఎన్నికలను లైట్ తీసుకుంటున్నారు. దీంతో రేవంత్ రెడ్డే అన్ని విషయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు.