అన్వేషించండి

Telangana Loans : "అప్పుల రూల్స్" తెలంగాణకు మాత్రమేనా ? కేంద్రం వివక్ష చూపిస్తోందా ? ఇవిగో డీటైల్స్

తెలంగాణకు అప్పులు దక్కకుండా చేసి ఆర్థికంగా ఇబ్బంది పెడుతోందని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఇతర రాష్ట్రాలకు వర్తించని నిబంధనలకు తమకు ఎందుకని ప్రశ్నిస్తోంది.

Telangana Loans :  అప్పులపై తెలంగాణ, కేంద్ర ప్రభుత్వం మధ్య వివాదం తీవ్రమయింది.  కార్పొరేషన్ల రుణాలను కూడా పరిగణలోకి తీసుకుంటాం, గత రెండేళ్లలో తీసుకున్న రుణాలను సైతం లెక్కిస్తామని కేంద్రం చెబుతుండడంతో.. తెలంగాణ ప్రభుత్వం తీవ్ర నిరసన వ్యక్తం చేస్తోంది. నెలన్నరగా అప్పు పుట్టకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది తెలంగాణ ప్రభుత్వం. కనీసం బాండ్లు అమ్ముకుని రుణం తెచ్చుకోడానికి కూడా కేంద్రం నుంచి అనుమతి లభించడం లేదు. ఇతర రాష్ట్రాలకు లేని ఆంక్షలు తమకే ఎందుకని ప్రశ్నిస్తోంది. కాగ్ నివేదికల ప్రకారం చూసినా తమ అప్పులు తక్కువేనని వాదిస్తోంది. 

చాలా తక్కువ రుణ పరిమితి ఇచ్చిన కేంద్రం !

ఈ ఆర్థిక సంవత్సం ఎఫ్‌ఆర్‌బీఎం ప్రకారం తెలంగాణకు రూ. 42వేల 728 కోట్ల మార్కెట్‌ రుణానికి మాత్రమే అనుమతి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రూ.  59వేల 672 కోట్ల రుణాలకు అనుమతి అడిగింది. ఇవి కాకుండా  మరో రూ. 40 వేల కోట్ల రుణాలు తీసుకోవాలని నిర్ణయించింది.  తెలంగాణలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు పూర్తిస్థాయిలో అమలవ్వాలంటే అప్పులు తీసుకోవాల్సిందే. జీతాలు, చెల్లింపులు సకాలంలో చేయాలన్నా సరే అప్పు తప్పనిసరి.   అప్పు పుట్టకపోవడంతో జీతాలు ఇవ్వడం కూడా కష్టంగా మారింది.  ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం ప్రకారం, రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తున్నప్పటికీ.. రుణాలపై ఆంక్షలు విధించారని.. రాజకీయ కారణాలతో వేధిస్తున్నారని తెలంగాణ సర్కార్ ఆరోపిస్తోంది.  గతంలో ఎలాగైతే ఎఫ్‌ఆర్‌బీఎం చట్టానికి లోబడి బాండ్ల ద్వారా అప్పులు తెచ్చుకున్నామో, ఇప్పుడూ అదే పద్దతిలో అప్పులకు అనుమతించాలని అంటోంది.

ఇతర రాష్ట్రాలపై అంతకు మించి రుణభారం !

తమిళనాడు, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాలకు అప్పులు ఎక్కువగా ఉన్నాయి. అప్పుల్లో తమిళనాడు 6 లక్షల 59వేల 868 కోట్లతో టాప్ ప్లేస్ లో ఉంది. 6 లక్షల 53 వేల కోట్లతో ఉత్తరప్రదేశ్ సెకండ్ ప్లేస్ లో నిలిచింది. మహారాష్ట్ర 6 లక్షల 8 వేల కోట్లతో అప్పుల్లో మూడో స్థానంలో ఉంది. పశ్చిమ బెంగాల్ 5 లక్షల 62 వేల కోట్లతో నాలుగో స్థానంలో ఉంది. కర్ణాటక, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాలకు కూడా 4 లక్షల కోట్ల వరకు అప్పులు ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రం 2021–22 ఆర్థిక ఏడాదిలో రూ.59,244.99 కోట్లు అప్పు చేయనున్నట్లు వెల్లడించి, తీరా రూ.60,486.26 కోట్ల అప్పు చేసింది.  బడ్జెట్‌ అంచనాల్లో కేరళ ప్రభుత్వం 81.58% మేర, పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం 82.27% మేర అప్పు చేశాయి.   

నిబంధనల ప్రకారమే రుణాలు తీసుకుంటున్నామన్న తెలంగాణ !
 
నిబంధనల ప్రకారం రాష్ట్ర అప్పులు ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిలోపు ఉంటే కొత్తగా రుణాలు చేసేందుకు కేంద్రం అడ్డు చెప్పరాదు. ఎఫ్‌ఆర్‌బీఎం ప్రకారం జీఎస్డీపీ విలువలో 25% వరకు రుణాలు తీసుకొనే అవకాశం రాష్ర్టానికి ఉంటుంది. ఆర్బీఐ నివేదిక ప్రకారం తెలంగాణ అప్పు 2019-20 నాటికి 23% మాత్రమే. ఆ తర్వాతి ఆర్థిక సంవత్సరాల అంచనాలు సైతం ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి దాటలేదు. అయినా.. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అప్పు చేయకుండా కేంద్రం ఆటంకాలు సృష్టిస్తున్నదని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.  తెలంగాణ కంటే ఎక్కువ అప్పు చేసిన రాష్ర్టాలకు అదనంగా అప్పుచేసేందుకు అనుమతిచ్చిన కేంద్రం, తెలంగాణకు మాత్రం కొత్త రుణ సమీకరణలకు అడ్డుచెప్పడం ద్వారా రాష్ర్టాన్ని ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేయాలన్న దురుద్దేశం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నదని ఆరోపిస్తున్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. తెలంగాణ అప్పులు తక్కువేనని వాదిస్తోంది.  అసలు రుణాలపై ఇప్పటికిప్పుడు కొత్త నిబంధనలు తీసుకొచ్చి, గతంలో తీసుకున్న అప్పులను ఇప్పుడు లెక్కిస్తామనడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నించింది. దీనికి కేంద్రం నుంచి ఎలాంటి రిప్లై వస్తుందా అని ఎదురుచూస్తోంది రాష్ట్ర ప్రభుత్వం.

పరిమితికి మించి అప్పులంటున్న కాగ్ !

 2020-21లో ప్రభుత్వం రూ.45,638 కోట్ల అప్పు తీసుకోగా, కార్పొరేషన్ల పేర మరో రూ.21,969 కోట్ల అప్పును తీసుకుంది.  రెండింటి మొత్తం అప్పు రూ.67,607 కోట్లవుతుంది. ఎఫ్‌ఆర్‌బీ ఎం చట్ట పరిమితి ప్రకారం... జీఎ్‌సడీపీలో 3.5 శాతం మేర మాత్రమే అప్పు తీసుకోవాలి. 2020-21లో తెలంగాణ జీఎ్‌సడీపీ రూ.9,80,407 కోట్లని తేల్చారు. ఇందు లో 3.5 శాతం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం రూ.34,314 కోట్ల మేర అప్పు తీసుకోవచ్చు. అయితే, ఏకంగా రూ. 67,607 కోట్లు తీసుకుంది. అంటే, తన అర్హతకు మించి రూ.33,293కోట్ల అప్పును అదనంగా సేకరించినట్లయిం ది. 2021మార్చి నాటికి గ్యారంటీ అప్పులు రూ.97,940 కోట్లు అని కాగ్‌ ఇటీవల అసెంబ్లీకి సమర్పించిన నివేదికలో వెల్లడించింది.   2022 సంవత్సరం జనవరి 31 నాటికి వివిధ కార్పొరేషన్ల గ్యారంటీ అప్పు లు రూ.1,35,282 కోట్లకు చేరాయంటూ ప్రభుత్వం ఇటీవలి బడ్జెట్‌లో వెల్లడించింది. ఈ లెక్కలన్నింటికీ మార్చి 31న రాష్ట్రానికి రాసిన లేఖలో కేంద్ర ప్రభుత్వం వివరించింది. ఈ జీఎ్‌సడీపీలో ఎఫ్‌ఆర్‌బీఎం రుణ నిబంధన 3.5% ప్రకారం తెలంగాణకు రూ.42,728 కోట్ల అప్పు తీసుకోవడానికి అర్హత ఉంటుందని స్పష్టం చేసింది. 2020-21, 2021-22ల్లో బడ్జెట్‌, గ్యారంటీ అప్పుల మొ త్తం పరిమితులకు మించితే... 2022-23అప్పుల్లో కోతలు పెడతామని హెచ్చరించింది.
 

ఏపీకి  ఎలా అనుమతులు వస్తున్నాయి ?

అయితే తెలంగాణ ప్రభుత్వం నిబంధనలన్నీ తమకే అమలు చేస్తున్నారని వాదిస్తోంది. బీజేపీ పాలిత రాష్ట్రాలతో పాటు మిత్ర పక్ష పార్టీలు అధికారంలో ఉన్న ప్రభుత్వాలకు ఈ నిబంధనలు వర్తించడం లేదని.. కేవలం తమపైనే ఆంక్షలు విధిస్తున్నారని టీఆర్ఎస్ వాదిస్తోంది. పొరుగున ఉన్న ఏపీ ఆర్థిక పరిస్థితి దుర్భరంగా ఉంది.  ఏపీ ప్రభుత్వానికి ఏడాది మొత్తంలో చేయడానికి అనుమతి ఇచ్చిన అప్పును మూడు నెలల్లోనే తీసేసుకుంటోంది. ఆ తర్వాత అదనపు అప్పులకు అవకాశం కల్పిస్తున్నారు. ఏ నిబంధనల ప్రకారం ఇస్తున్నారోనని టీఆర్ఎస్  ప్రశ్నిస్తోంది. ఒక్క ఏపీ మాత్రమే కాదని.. ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాలకూ అలాగే చేస్తున్నారని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. 

ఆర్బీఐ లెక్కలువేరు.. కాగ్ లెక్కలు వేరు... గందరగోళంగా అప్పుల తీరు !

నిజానికి రాష్ట్రాలు ఎన్ని అప్పులు చేస్తున్నాయి..? ఎవరి వద్ద చేస్తున్నాయి ? అన్న అంశంపై కేంద్రానికి స్పష్టమైన సమాచారం ఉంటుంది . ఉండాలి కూడా . కానీ రాజకీయ అవసరాల కోసం కాగ్ లెక్కలు... ఆర్బీఐ లెక్కలు ఇలా చూపించి.. ఒక్కో రాష్ట్రంతో ఒక్కో విధానం అమలు చేయడం వల్ల సమస్యలు వస్తున్నాయి. రాజకీయంగా తమకు దూరమైన పార్టీలు అధికారంలో ఉంటే నిబంధనలు కఠినంగా అమలు చేయడం.. మిత్రపక్షాలకు సడలింపులు ఇవ్వడం వల్ల విమర్శలు వస్తున్నాయి. నిబంధనలు అందరికీ ఒక్కటే అయితే ఎలాంటి సమస్యా ఉండదు. కానీ కేంద్రం అలా వ్యవహరించకపోవడం వల్లే ఇబ్బందులొస్తున్నాయి. విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Congress India Map Controversy: కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
అయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తత
అయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తత
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులుసునామీ బీభత్సానికి 20 ఏళ్లు, ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్న మత్స్యకారులుఅయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తతగుంతలమయమైన రోడ్లు, డ్రోన్‌లతో వింత నిరసనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress India Map Controversy: కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
అయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తత
అయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తత
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Fact Check: రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లికి కేటీఆర్ 10 కోట్లు...! ఫార్ములా-ఈ కేసు దర్యాప్తులో ఈ విషయం తేలిందా...?
రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లికి కేటీఆర్ 10 కోట్లు...! ఫార్ములా-ఈ కేసు దర్యాప్తులో ఈ విషయం తేలిందా...?
Chennai rape Case: చెన్నై యూనివర్శిటీ అత్యాచారం కేసులో ట్విస్ట్ - రోడ్ పక్కన బండి వాడు కూడా !
చెన్నై యూనివర్శిటీ అత్యాచారం కేసులో ట్విస్ట్ - రోడ్ పక్కన బండి వాడు కూడా !
Ambati Rambabu Vs Revanth Reddy: రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి
రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి "సోఫా" చేరాలంటూ సోషల్ మీడియా పోస్టు 
Embed widget