అన్వేషించండి

Revanth Reddy Plan success for Jubilee Hills: జూబ్లీహిల్స్ పై ఫలించిన సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాలు, BRSకు చెక్.. కాంగ్రెస్ సక్సెస్ సీక్రెట్

Telangana CM రేవంత్ రెడ్డి ఆపరేషన్ జూబ్లీ హిల్స్ సక్సెస్ అయింది. తనదైన వ్యూహంతో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ను గెలిపించారు. మైక్రో లెవల్ పోల్ మేనేజ్మెంట్లో కాంగ్రెస్ సక్సెస్ అయింది.

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ చేజిక్కించుకుంది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 24,658 ఓట్ల ఆధిక్యంతో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై గెలుపొందారు. ఇందుకోసం సీఎం రేవంత్ రెడ్డి రచించిన బహుముఖ వ్యూహం ఫలించింది. ఈ విజయం వెనుక సీఎం రేవంత్ వ్యూహాలు ఏంటి అన్న అంశాలు ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.

1. గెలుపు కోసం సోషల్ ఇంజనీరింగ్

జూబ్లీ హిల్స్ ఉపఎన్నిక గెలుపులో సీఎం రేవంత్ రెడ్డి సోషల్ ఇంజనీరింగ్ వ్యూహం ఫలించింది. ఈ నియోజకవర్గంలో కీలక ఓటర్లయిన యాదవ, ముస్లిం ఓటర్ల ఏకీకరణకు ప్రయత్నించారు. ఇందుకోసం ఎంఐఎంతో పొత్తు పెట్టుకుని, ఆ పార్టీ అభ్యర్థి ఎన్నికల బరిలో లేకుండా చూసుకున్నారు. అంతేకాకుండా, ఎంఐఎం మద్దతుదారులు, ఓటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. దీంతో పాటు, ఎన్నికల ముందు అనూహ్యంగా మైనార్టీ వర్గాన్ని ఆకట్టుకునేందుకు క్రికెటర్ అజారుద్దీన్‌కు మంత్రి పదవిని కట్టబెట్టారు. దీంతో మైనార్టీ వర్గాల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల, సీఎం రేవంత్ రెడ్డి పట్ల విశ్వాసం పెరిగింది. అది ఈ ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా కనబడుతోంది. వీరితో పాటు యాదవ ఓటర్లను ఆకట్టుకునేందుకు, గెలుపు గుర్రంగా నవీన్ యాదవ్ను సీఎం రేవంత్ రెడ్డి అభ్యర్థిగా నిలబెట్టారు. దీంతో యాదవ్ - మైనార్టీ ఓట్లు కాంగ్రెస్ గెలుపుకు దోహదపడ్డాయి.

2. సంక్షేమ పథకాలు - బస్తీ ఓటర్ల సమీకరణ

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీఆర్ఎస్ సానుభూతి అస్త్రం ప్రయోగించడంతో దాన్ని నిర్వీర్యం చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి సంక్షేమ పథకాలు, బస్తీల్లో సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టారు. యూసఫ్‌గూడ, రహమత్‌నగర్ వంటి బస్తీ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణ పథకంతో పాటు ఇతర సంక్షేమ పథకాల హామీలు పని చేశాయి. సానుభూతి కంటే 'చేయూత ఇచ్చే ప్రభుత్వం మాది' అన్న భావనను కాంగ్రెస్ వర్గాలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేలా సీఎం వ్యూహాలు రచించారు. అది ఈ ఉపఎన్నికల్లో ఫలితాలనిచ్చింది. ఆయా వర్గాలతో సమావేశమై వారి సమస్యల పరిష్కారం కోసం హామీలు ఇవ్వడం, కోరిన రీతిలో 250 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం కూడా అధికార కాంగ్రెస్‌కు కలిసి వచ్చింది.

3. సీఎం కార్నర్ మీటింగ్‌లు

జూబ్లీ హిల్స్ ఉపఎన్నికల్లో రెండు మూడు కార్నర్ మీటింగ్‌లతో సరిపెట్టుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి భావించారు. కానీ అప్పటికీ బీఆర్ఎస్ పార్టీ కొన్ని చోట్ల బలంగా ఉందన్న సమాచారం మేరకు సీఎం తన వ్యూహాన్ని మార్చుకున్నారు. ఏడు డివిజన్లలో కార్నర్ మీటింగ్‌లు నిర్వహించారు. కేవలం 'ప్రచారం' అన్న రీతిలో కాకుండా, నియోజకవర్గ ఓటర్లతో ప్రత్యక్షంగా మాట్లాడేలా కార్నర్ మీటింగ్‌లలో పాల్గొన్నారు. సీఎం తన పాలన కోసం వ్యక్తిగతంగా వివరించే ప్రయత్నం చేశారు. సంక్షేమ హామీలపైన తన అభిప్రాయాలను నేరుగా వెల్లడించడం కూడా కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అయింది.

4. పోల్ మేనేజ్‌మెంట్‌లో సక్సెస్ అయిన కాంగ్రెస్

గతంలో బలహీనమైన పోల్ మేనేజ్‌మెంట్ చేసే పార్టీగా తెలంగాణలో కాంగ్రెస్‌కు పేరు. కానీ గత శాసన సభ ఎన్నికల నాటి నుండి సీఎం రేవంత్ రెడ్డి తనదైన శైలిలో పోల్ మేనేజ్‌మెంట్ చేయడం గమనార్హం. జూబ్లీ హిల్స్ ఉపఎన్నికలో సీఏం మైక్రో మేనేజ్‌మెంట్ వ్యూహాన్ని అమలు చేశారు. ప్రతీ డివిజన్‌కు ఒక్కో సీనియర్ మంత్రిని ఇన్‌చార్జులుగా నియమించారు. కీలక నేతలందరూ డివిజన్ల వారీగా బాధ్యతలు చేపట్టేలా వ్యూహాలు రచించి అమలు చేశారు. మంత్రులుగా ఉన్న ఇన్‌చార్జులు, కీలక నేతలు స్థానిక సంస్థల ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలతో కలిసి ఓటర్ల జాబితాను పరిశీలించడం, బూత్ లెవెల్‌లో ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తీసుకురావడం వంటి పనులను చక్కగా చేపట్టారు. ఇది బీఆర్ఎస్ కంటే ఎక్కువ శాతం ఓటింగ్ కాంగ్రెస్‌కు వచ్చేలా చేయడంలో కీలకంగా పని చేసింది. ఈ కారణంగానే 24 వేల మెజార్టీని సాధించడానికి ఉపయోగపడినట్లు కాంగ్రెస్ వర్గాలు కూడా చెబుతున్నాయి. ఈ దఫా చేసిన పోల్ మేనేజ్‌మెంట్ గతంలో కన్నా చక్కగా చేసినట్లు నేతలు అంతర్గత సంభాషణల్లో చెబుతున్నారు.

About the author Yedla Sudhakar Rao

జర్నలిజంలో 25 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గత పాతికేళ్లుగా పలు ప్రముఖ తెలుగు  ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలలో ఆయన పనిచేశారు.

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత జర్నలిజం కోర్సు చేసి, అదే వృత్తిని కెరీర్‌గా ఎంచుకున్నారు. వివిధ తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో సీనియర్ రిపోర్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు, ఆ తర్వాత ఇన్‌పుట్ ఎడిటర్‌గా కూడా సేవలందించారు. తెలంగాణ ప్రభుత్వ ఇరిగేషన్, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లకు PUBLIC RELATION OFFICER గా  ఐదేళ్లపాటు పనిచేశారు.

ఆయనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సమకాలీన అంశాలపై మంచి పట్టు ఉంది. పరిశోధనాత్మక కథనాలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్‌బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన ఏబీపీ దేశం డిజిటల్ మీడియాలో కొన్నేళ్లుగా అసిస్టెంట్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Traffic Chaos: ఐటీ రాజధానిలో ట్రాఫిక్ నరకం - కేబీఆర్ వన్-వే, గచ్చిబౌలి గుంతల రోడ్లు - అలవాటు చేసుకోవాల్సిందేనా?
ఐటీ రాజధానిలో ట్రాఫిక్ నరకం - కేబీఆర్ వన్-వే, గచ్చిబౌలి గుంతల రోడ్లు - అలవాటు చేసుకోవాల్సిందేనా?
BJP Grassroots Leadership: వారసత్వాలకు చెక్.. ప్యాషన్‌కే ప్రాధాన్యం - బీజేపీ గ్రాస్‌రూట్ లీడర్‌షిప్ మోడల్ - లీడర్లు ప్రజల నుంచే !
వారసత్వాలకు చెక్.. ప్యాషన్‌కే ప్రాధాన్యం - బీజేపీ గ్రాస్‌రూట్ లీడర్‌షిప్ మోడల్ - లీడర్లు ప్రజల నుంచే !
AP Local Body Elections 2026: స్థానిక సంస్థల సమరానికి ఏపీ సిద్ధం - సెప్టెంబర్-అక్టోబర్ ఎన్నికల వేడి - ఎవరిది పైచేయి?
స్థానిక సంస్థల సమరానికి ఏపీ సిద్ధం - సెప్టెంబర్-అక్టోబర్ ఎన్నికల వేడి - ఎవరిది పైచేయి?
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Adilabad Spiny Gourd:ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
Embed widget