అన్వేషించండి

CM Revanth Reddy: రేవంత్ అందరి వాడు - ప్రధాని మోదీకి కూడా - రేవంత్ రెడ్డి చాణక్యం నెక్ట్స్ లెవల్ !

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ ప్రత్యర్థులు అయినా వ్యక్తిగత స్నేహం కాపాడుకుంటున్నారు. ప్రధాని మోదీతో ఆయన వ్యవహరిస్తున్న తీరు అందర్నీ అబ్బురపరుస్తోంది.

CM Revanth Reddy Chanakya Strategies: తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శైలి అత్యంత విలక్షణమైనది. ఒకవైపు పదునైన విమర్శలతో ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేస్తూనే, మరోవైపు పాలనాపరమైన అవసరాల కోసం అదే ప్రత్యర్థులతో సమన్వయం చేసుకునే ఆయన  పొలిటికల్ బ్యాలెన్సింగ్ ఇప్పుడు  చర్చనీయాంశంగా మారింది. రాజకీయం వేరు, రాష్ట్ర ప్రయోజనాలు వేరనే సూత్రాన్ని రేవంత్ అమలు చేస్తున్న తీరుపై అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. 

రేవంత్ రిలేషన్ షిప్ మేనేజ్‌మెంట్ అదుర్స్  

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న  రిలేషన్ షిప్ మేనేజ్‌మెంట్  రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. సాధారణంగా కాంగ్రెస్ నాయకులు బీజేపీని, ముఖ్యంగా ప్రధాని మోదీని తీవ్రస్థాయిలో విమర్శిస్తుంటారు. రేవంత్ కూడా రాజకీయ వేదికలపై మోదీపై విమర్శల వర్షం కురిపిస్తారు. కానీ, ప్రధానమంత్రి రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు,  ఢిల్లీకి వెళ్లినప్పుడు ఆయనను బడే భాయ్ అని సంబోధించి రాష్ట్ర ప్రయోజనాల కోసం విజ్ఞప్తులు చేయడం ఆయన పరిణతికి నిదర్శనం. రాజకీయం గడప వరకేనని, అధికారిక హోదాలో ఉన్నప్పుడు రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో సఖ్యతగా ఉండటమే ముఖ్యమని ఆయన బలంగా నమ్ముతున్నారు.

హైకమాండ్ నమ్మకం కూడా !

రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న ఈ ద్వంద్వ వ్యూహం వల్ల కాంగ్రెస్ అంతర్గత రాజకీయాల్లో ఆయనపై తరచూ ఫిర్యాదులు వెల్లువెత్తుతుంటాయి. బీజేపీతో లోపాయికారీ ఒప్పందం ఉందేమో  అని , అదానీ వంటి సంస్థలతో ఒప్పందాలు చేసుకోవడం ఏంటి  అని సొంత పార్టీ నేతలే ఢిల్లీకి సమాచారం పంపుతుంటారు. అయితే, రేవంత్ తన రాజకీయ చాణక్యంతో అటు రాహుల్ గాంధీ, ఇటు మల్లికార్జున ఖర్గేల వద్ద బలమైన విశ్వసనీయతను సంపాదించుకున్నారు. రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకురావడం, క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఎంపీ సీట్లను గెలిపించడం ద్వారా తనపై వచ్చే ఫిర్యాదుల కంటే తన పనితీరు మెరుగ్గా ఉందని ఆయన హైకమాండ్‌కు నిరూపించగలిగారు.

 వ్యక్తిగత స్నేహం - రాజకీయ వైరం 

రేవంత్ రెడ్డి రాజకీయంలో మరో కోణం ఏమిటంటే.. రాజకీయంగా ఎంతగా విబేధించినా వ్యక్తిగత స్నేహాలను ఆయన పక్కన పెట్టరు. గతంలో ఇతర పార్టీల్లో ఉన్నప్పుడు ఏర్పడిన మిత్ర సంబంధాలను ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. అసెంబ్లీలో ప్రత్యర్థులపై గర్జించే రేవంత్, అదే ప్రత్యర్థులతో లాబీలో నవ్వుతూ పలకరించడం చూసి కేడర్ ఆశ్చర్యపోతుంటుంది. రాజకీయం అంటే ప్రజా క్షేత్రంలో పోరాటం.. వ్యక్తిగత ద్వేషం కాదు  అనే ధోరణి ఆయనలో స్పష్టంగా కనిపిస్తుంది. దీనివల్ల ప్రతిపక్షాల్లో ఉన్న కీలక నేతలతో కూడా ఆయనకు కమ్యూనికేషన్ ఛానల్స్ తెరిచే ఉంటాయి.

 అదానీ నుంచి మోదీ వరకు.. వ్యూహాత్మక అడుగులు 

జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ అదానీ గ్రూప్‌పై నిరంతరం విమర్శలు గుప్పిస్తుంటే, రేవంత్ రెడ్డి మాత్రం తెలంగాణ అభివృద్ధి కోసం అదానీ గ్రూప్‌తో వేల కోట్ల రూపాయల ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఇది హైకమాండ్ ఆగ్రహానికి కారణం కావచ్చని అందరూ భావించినా, రేవంత్ మాత్రం  రాహుల్ గాంధీ చెప్పేది క్రోనీ క్యాపిటలిజం గురించి, నేను చేసేది రాష్ట్రంలో ఉద్యోగాల సృష్టి కోసం అని అత్యంత చాకచక్యంగా వివరణ ఇచ్చి విమర్శకుల నోళ్లు మూయించారు. ఈ స్పష్టతే ఆయనను ఇతర ముఖ్యమంత్రుల కంటే భిన్నంగా నిలబెడుతోంది.

 ఇమేజ్ మేకోవర్

 రేవంత్ రెడ్డి కేవలం ఒక ఫైర్ బ్రాండ్ నాయకుడిగానే కాకుండా, స్టేట్స్ మ్యాన్  తరహా లక్షణాలను అలవరుచుకుంటున్నారు. అటు కాంగ్రెస్ అధిష్టానం వద్ద పక్కా విధేయుడిగా ఉంటూనే, ఇటు కేంద్రంతో పాలనాపరమైన సంబంధాలను నెరుపుతూ, తెలంగాణలో తన పట్టును పెంచుకుంటున్నారు. రాజకీయాలను వ్యక్తిగతానికి మిక్స్ చేయకుండా ఆయన చేస్తున్న ఈ ప్రయాణం, రానున్న రోజుల్లో ఆయనను దేశ రాజకీయాల్లో కీలక నేతగా మార్చడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. రేవంత్ రెడ్డి రాజకీయ శైలి  అగ్రెసివ్ అండ్ డిప్లొమాటిక్ సమ్మేళనం. రాష్ట్రం కోసం మెత్తగా, రాజకీయం కోసం గట్టిగా ఉండటమే ఆయన సక్సెస్ మంత్రం అనుకోవచ్చు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

CJP Protest: ధర్మేంద్ర ప్రధాన్ బలిపశువు అయ్యారు, చాలా బాధాకరం- కేంద్ర మంత్రి రాజీనామాపై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు
ధర్మేంద్ర ప్రధాన్ బలిపశువు అయ్యారు, చాలా బాధాకరం- కేంద్ర మంత్రి రాజీనామాపై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు
Dharmendra Pradhan Resignation Reasons: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక అసలు కథ - మోదీ సర్కార్ పట్టు వదలడానికి 3 ప్రధాన కారణాలు!
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక అసలు కథ - మోదీ సర్కార్ పట్టు వదలడానికి 3 ప్రధాన కారణాలు!
CJP GenZ Protest Success Story: కాక్రోచ్‌ల తొలి పోరాటమే సూపర్‌హిట్ - రాజకీయ పార్టీలకు సాధ్యం కానిది సాధించిన జెన్జీలు !
కాక్రోచ్‌ల తొలి పోరాటమే సూపర్‌హిట్ - రాజకీయ పార్టీలకు సాధ్యం కానిది సాధించిన జెన్జీలు !
Rahul Gandhi Student Paper Leak Protest: విద్యార్థుల పోరులో రాహుల్ గాంధీ వ్యూహం - మైలేజీ వచ్చిందా? ఉద్యమం కాంగ్రెస్ సొంతమైందా?
విద్యార్థుల పోరులో రాహుల్ గాంధీ వ్యూహం - మైలేజీ వచ్చిందా? ఉద్యమం కాంగ్రెస్ సొంతమైందా?
Advertisement

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ధర్మేంద్ర ప్రధాన్ లాగా AP DSC అక్రమాలపై నారా లోకేష్ రాజీనామా చేస్తారా?: YS Jagan సూటి ప్రశ్న
ధర్మేంద్ర ప్రధాన్ లాగా AP DSC అక్రమాలపై నారా లోకేష్ రాజీనామా చేస్తారా?: వైఎస్ జగన్ ప్రశ్న
Revanth Reddy: ఇది జెన్-జీ విజయం.. క్రెడిట్ కాంగ్రెస్ ఖాతాలో వేసుకోదు: క్యాండిల్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి
ఇది జెన్-జీ విజయం.. క్రెడిట్ కాంగ్రెస్ ఖాతాలో వేసుకోదు: క్యాండిల్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి
IND VS ZIM 2nd T20 Result Update: శ్రేయ‌స్ ఖాతాలో తొలి సిరీస్.. రెండో టీ20లో జింబాబ్వే చిత్తు, స‌త్తా చాటిన ఇషాన్, తిల‌క్, అభిషేక్, య‌శ్, ప్రిన్స్
శ్రేయ‌స్ ఖాతాలో తొలి సిరీస్.. రెండో టీ20లో జింబాబ్వే చిత్తు, స‌త్తా చాటిన ఇషాన్, తిల‌క్, అభిషేక్ శర్మకు 3 వికెట్లు
Dharmendra Pradhan Resignation Reasons: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక అసలు కథ - మోదీ సర్కార్ పట్టు వదలడానికి 3 ప్రధాన కారణాలు!
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక అసలు కథ - మోదీ సర్కార్ పట్టు వదలడానికి 3 ప్రధాన కారణాలు!
Pawan Kalyan Seed Balls: డ్రోన్లతో సీడ్ బాల్స్ వర్షం - 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ బిగ్ ప్లాన్
డ్రోన్లతో సీడ్ బాల్స్ వర్షం - 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ బిగ్ ప్లాన్
Dharmendra Pradhan Resignation News: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా- సీజేపీ, విద్యార్థుల ఆందోళనలతో దిగొచ్చిన కేంద్రం
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా- సీజేపీ, విద్యార్థుల ఆందోళనలతో దిగొచ్చిన కేంద్రం
Azadi 501 Series Trailer : ఇండియాస్ బిగ్గెస్ట్ టెక్ స్కామ్ సిరీస్ - ఇంట్రెస్టింగ్‌గా ఆజాదీ 501 ట్రైలర్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఇండియాస్ బిగ్గెస్ట్ టెక్ స్కామ్ సిరీస్ - ఇంట్రెస్టింగ్‌గా ఆజాదీ 501 ట్రైలర్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Team India Equals Own World Record :  వ‌ర‌ల్డ్ రికార్డును స‌మం చేసిన టీమిండియా.. అత్య‌ధిక సార్లు ఆ ఘ‌న‌తను సాధించిన జ‌ట్టుగా శ్రేయ‌స్ సేన‌.. పొట్టి ఫార్మాట్లో అత్య‌ధికంగా..
వ‌ర‌ల్డ్ రికార్డును స‌మం చేసిన టీమిండియా.. అత్య‌ధిక సార్లు ఆ ఘ‌న‌తను సాధించిన జ‌ట్టుగా శ్రేయ‌స్ సేన‌.. పొట్టి ఫార్మాట్లో అత్య‌ధికంగా..
Embed widget