అన్వేషించండి

Who is S Keerthana: విజయ్ క్యాబినెట్‌లో లేడీ ప్రశాంత్ కిశోర్ - తెలుగు మాట్లాడే తమిళ మంత్రి రికార్డులు, ప్రత్యేకతలు ఇవే

Tamil Nadu Minister Keerthana | శివకాశి నుంచి తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికైన ఎస్ కీర్తన ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నారు. విజయ్ కాబినెట్లో మహిళా మంత్రిగా ప్రత్యేక గుర్తింపు పొందారు.

Tamil Nadu Ministers | చెన్నై: తమిళనాడులో కొత్త ప్రభుత్వం కొలువుతీరింది. చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ఆయనతో పాటు మరికొందరు మంత్రులుగా ప్రమాణం చేశారు. పోటీ చేసిన మొదటి ఎన్నికల్లోనే టీవీకే 108 స్థానాల్లో విజయం సాధించి, మరికొన్ని పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తమిళ రాజకీయాల్లో 29 ఏళ్ల ఎస్. కీర్తన పేరు నేడు మార్మోగుతోంది. ఆమె అతిపిన్న వయసులో రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తెలుగు మాట్లాడే తమిళ మంత్రిగా కీర్తన తెలుగు రాష్ట్రాలల్లో హాట్ టాపిక్ అయ్యారు.

అతిపిన్న వయసులో మహిళా ఎమ్మెల్యే..

 తమిళ వెట్రి కళగం (TVK) పార్టీ తరపున శివకాశి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు కీర్తన. ఆమె అతిపిన్న వయసులో ఎమ్మెల్యే అయిన మహిళ మాత్రమే కాదు.. కొత్త ప్రభుత్వంలో అతి పిన్న వయస్కురాలైన మంత్రిగా నిలిచారు. తమిళ రాజకీయాలతో పాటు సమస్యలపై హిందీలో అనర్గళంగా మాట్లాడుతుండటంతో జాతీయ స్థాయిలో ఆమె పాపులర్ అయ్యారు. టీవీకే అధినేత విజయ్ ఆలోచనలు దేశం అంతటా చేరాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. భాష అనేది అడ్డుగోడ కాదని, అనుసంధానం చేస్తుందని ఆమె నమ్ముతారు. 


Who is S Keerthana: విజయ్ క్యాబినెట్‌లో లేడీ ప్రశాంత్ కిశోర్ - తెలుగు మాట్లాడే తమిళ మంత్రి రికార్డులు, ప్రత్యేకతలు ఇవే

తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా.. మంత్రి పదవి
టీవీకే పార్టీ తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఎక్కువ సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఈ ఎన్నికల్లోనే శివకాశి నుంచి నెగ్గిన ఎస్. కీర్తన ఈ నియోజకవర్గం నుంచి మొదటి మహిళా ఎమ్మెల్యేగా నిలిచారు. దాదాపు 70 ఏళ్లుగా ఇక్కడ మగవారే ఎమ్మెల్యేగా గెలుపొందుతుండగా.. తొలిసారి కీర్తన బ్రేక్ వేసి రికార్డు విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఆ జిల్లాలో విజయ్ ప్రచారం చేయలేదు. టీవీకే నేతలు కూడా పెద్దగా ప్రచారం నిర్వహించలేదు. కానీ కీర్తన తన మద్దతుదారులతో కలిసి ప్రచారం చేసి ఎన్నికల్లో ఘనవిజయం సాధించారు. అన్నాడీఎంకే మాజీ మంత్రి రాజేంద్ర బాలాజీని సైతం మూడో స్థానానికి పరిమితం చేశారు. ఈ ఎన్నికల్లో కీర్తన 68,709 ఓట్లు సాధించి, 11,670 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి అశోకన్‌ను ఓడించారు. 'విరుదై మగళ్ కీర్తన' (విరుదునగర్ బిడ్డ కీర్తన) అనే పేరుతో సోషల్ మీడియాలో ఆమె పాపులర్ అయ్యారు.

 

టీడీపీతో అనుబంధం.. 
ఎస్. కీర్తన రాజకీయాల్లోకి రాకముందు పొలిటికల్ అడ్వైజర్‌గా (రాజకీయ సలహాదారుగా) పనిచేశారు. గత కొన్నేళ్లుగా ఆమె మాజీ సీఎంలు స్టాలిన్, మమతా బెనర్జీలకు సేవలు అందించారు. స్తుత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి టీడీపీ సోషల్ మీడియాకు పొలిటికల్ స్ట్రాటజిస్ట్‌గా పనిచేశారు. గత ఎన్నికల్లో చంద్రబాబు విజయంలో కీలకపాత్ర పోషించారు. పొలిటికల్ స్ట్రాటజిస్ట్‌గా తాను చేసిన పని పరిపాలన, బ్యూరోక్రసీ పనితీరుపై తనకు మరింత అవగాహన కల్పించిందని తెలిపారు. 


Who is S Keerthana: విజయ్ క్యాబినెట్‌లో లేడీ ప్రశాంత్ కిశోర్ - తెలుగు మాట్లాడే తమిళ మంత్రి రికార్డులు, ప్రత్యేకతలు ఇవే

ఆమె తమిళంతో పాటు ఇంగ్లీష్, హిందీ, తెలుగు భాషల్లో మాట్లాడుతూ సమస్యలు అందరికీ అర్థమయ్యేలా వివరించగలరు. అధిక భాషలు రావడం తనకు ప్లాస్ పాయింట్ అయిందని, అవకాశాలు తెచ్చిపెట్టిందని పలు సందర్భాల్లో కీర్తన తెలిపారు. తమిళనాడుకు చెందిన వ్యక్తి హిందీ, ఇతర భాషలు మాట్లాడటంపై విమర్శలు వచ్చాయి. కానీ కీర్తన అవేమీ పట్టించుకోకుండా ముందుకుసాగి విజయం సాధించి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు.

ఎవరీ ఎస్ కీర్తన..
1996లో విరుధ్ నగర్‌లో జన్మించిన కీర్తన తమిళ మీడియం గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నారు. మధురై కామరాజర్ యూనివర్సిటీ పరిధిలోని కాలేజీలో మ్యాథమేటిక్స్‌లో డిగ్రీ పూర్తి చేశారు. ఆ తరువాత కీర్తన పుదుచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీలో స్టాటిస్టిక్స్ లో 2019 పీజీ పట్టా పొందారు. ఆ తరువాత పాలిటికల్ స్ట్రాటజిస్ట్, పొలిటికల్ అడ్వైజర్‌గా డీఎంకే పార్టీ, పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ టీఎంసీ పార్టీకి పనిచేశారు. గత ఎన్నికల్లో టీడీపీకి సోషల్ మీడియా విభాగంలో పొలిటికల్ విభాగం హెడ్‌గా వర్క్ చేశారు. తరువాత నేరుగా పొలిటిక్స్ లోకి వచ్చి తొలి పోటీలోనే ఎమ్మెల్యే అయి, మంత్రిగా సైతం బాధ్యతలు చేపట్టారు. 

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News:విశాఖలో సైకిల్‌పై తిరిగిన చంద్రబాబు- మొక్కలు నాటిన వాళ్లకే టికెట్లు అంటా కామెంట్స్
విశాఖలో సైకిల్‌పై తిరిగిన చంద్రబాబు- మొక్కలు నాటిన వాళ్లకే టికెట్లు అంటా కామెంట్స్
Karnataka Minister Ramalinga Reddy : కర్ణాటక సీఎం డీకేకు షాక్! పోర్ట్‌పోలియోపై అసంతృప్తితో మంత్రి రామలింగారెడ్డి రాజీనామా!
కర్ణాటక సీఎం డీకేకు షాక్! పోర్ట్‌పోలియోపై అసంతృప్తితో మంత్రి రామలింగారెడ్డి రాజీనామా!
Annamalai New Party Launch: తమిళ పాలిటిక్స్‌లో సింగం సెకండ్ ఇన్నింగ్స్ - ఢిల్లీ ఆఫర్లను కాదని అన్నామలై కొత్త పార్టీకే మొగ్గు !
తమిళ పాలిటిక్స్‌లో సింగం సెకండ్ ఇన్నింగ్స్ - ఢిల్లీ ఆఫర్లను కాదని అన్నామలై కొత్త పార్టీకే మొగ్గు !
Lalit Modi Interview:
"నేను, మోదీ చాలా క్లోజ్‌, త్వరలోనే భారత్‌ వస్తాను" లలిత్ మోడీ కీలక స్టేట్మెంట్
Advertisement

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy target GHMC :తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
Hyderabad Metro Fact Check:
"అమీర్‌పేటలో అగ్ని ప్రమాదంతో మెట్రో పిల్లర్‌లో పగుళ్లు రాలేదు" హైదరాబాద్‌ మెట్రో ఎండీ వివరణ 
Andhra Pradesh Rajya Sabha Elections:అన్నామలై ఎఫెక్ట్‌! ఏపీలో రాజ్యసభ సీటు వదులుకున్న బీజేపీ! కూటమిలో కొత్త లెక్కలేంటీ?
అన్నామలై ఎఫెక్ట్‌! ఏపీలో రాజ్యసభ సీటు వదులుకున్న బీజేపీ! కూటమిలో కొత్త లెక్కలేంటీ?
Karnataka Minister Ramalinga Reddy : కర్ణాటక సీఎం డీకేకు షాక్! పోర్ట్‌పోలియోపై అసంతృప్తితో మంత్రి రామలింగారెడ్డి రాజీనామా!
కర్ణాటక సీఎం డీకేకు షాక్! పోర్ట్‌పోలియోపై అసంతృప్తితో మంత్రి రామలింగారెడ్డి రాజీనామా!
Peddi Collections: ఇండియాలో 'పెద్ది' ఫస్ట్ డే నెట్ ఎంత? ఏ లాంగ్వేజ్‌లో ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?
ఇండియాలో 'పెద్ది' ఫస్ట్ డే నెట్ ఎంత? ఏ లాంగ్వేజ్‌లో ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?
YS Jagan News: ఆంధ్రప్రదేశ్‌ మద్యం కుంభకోణంలో బిగ్‌ ట్విస్ట్! త్వరలోనే వైఎస్‌ జగన్‌ విచారణ!
ఆంధ్రప్రదేశ్‌ మద్యం కుంభకోణంలో బిగ్‌ ట్విస్ట్! త్వరలోనే వైఎస్‌ జగన్‌ విచారణ!
What is Special Intensive Revision SIR: తెలుగు రాష్ట్రాల్లో అన్ని పార్టీలూ హైఅలర్ట్ - అందరి దృష్టి SIR పైనే - ఎందుకింత జాగ్రత్త?
తెలుగు రాష్ట్రాల్లో అన్ని పార్టీలూ హైఅలర్ట్ - అందరి దృష్టి SIR పైనే - ఎందుకింత జాగ్రత్త?
Annamalai New Party Launch: తమిళ పాలిటిక్స్‌లో సింగం సెకండ్ ఇన్నింగ్స్ - ఢిల్లీ ఆఫర్లను కాదని అన్నామలై కొత్త పార్టీకే మొగ్గు !
తమిళ పాలిటిక్స్‌లో సింగం సెకండ్ ఇన్నింగ్స్ - ఢిల్లీ ఆఫర్లను కాదని అన్నామలై కొత్త పార్టీకే మొగ్గు !
Embed widget