Jagan Review On Ysrcp : గడప గడపకూ ఎమ్మెల్యేలను పంపాల్సిన బాధ్యత మీదే - జిల్లా అధ్యక్షులకు టార్గెట్ సెట్ చేసిన జగన్ !
జిల్లాల అధ్యక్షుడు, రీజనల్ కోఆర్డినేటర్లతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యేలను గడప గడపకూ పంపే బాధ్యత వారిదేనని స్పష్టం చేశారు.
![Jagan Review On Ysrcp : గడప గడపకూ ఎమ్మెల్యేలను పంపాల్సిన బాధ్యత మీదే - జిల్లా అధ్యక్షులకు టార్గెట్ సెట్ చేసిన జగన్ ! CM Jagan conducted a review with district presidents and regional coordinators. Jagan Review On Ysrcp : గడప గడపకూ ఎమ్మెల్యేలను పంపాల్సిన బాధ్యత మీదే - జిల్లా అధ్యక్షులకు టార్గెట్ సెట్ చేసిన జగన్ !](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/18/dd3af0451654bdff9cdfc22bb562d4961658154013_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Jagan Review On Ysrcp : గత ఎన్నికల్లో ఓడిపోయిన నియోజకవర్గాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని వైఎస్ఆర్‌సీపీ అధినేత జగన్ పార్టీ నేతలకు సూచించారు. పార్టీ రీజినల్ కో ఆర్డినెటర్ లు, జిల్లా అధ్యక్షులతో జగన్ సమావేశం అయ్యారు. వారికి పీకే టీంను పరిచయం చేశారు. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం విజయవంతంగా చేయించాల్సిన బాధ్యత ను రీజినల్ కోఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అద్యక్షులకు అప్పగించారు. పార్టీ వ్యవహారాలు అన్ని చక్కబెట్టల్సింది మీరేనని.. బాధ్యతలు మీకే ఉన్నాయనిన జగన్ వారికి దిశానిర్దేశం చేశారు. మీరే ఎమ్మెల్యేలతో గడపగడపకూ వెళ్లేలా చూడాలన్నారు.
ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకోవాలని జిల్లా అధ్యక్షులకు జగన్ ఆదేశం
పార్టీ అధ్యక్షులకు, రీజనల్ కో ఆర్డినేటర్లకు పూర్తి బాధ్యతలు ఇచ్చిన సీఎం జగన్ ఐ ప్యాక్ టీమ్‌ను పరిచయం చేసి తగిన సాయం చేస్తారని వివరించారు.ఐ ప్యాక్ టీమ్ తో కోఆర్డినేషన్ చేసుకుని మంచి పలితాలు రాబట్టాలని, 175 స్థానాలు మన టార్గెట్ గా పని చేయాలని జగన్ మరో సారి వారికి గుర్తు చేశారు. బలహీనమైన నియోజకవర్గాల బాధ్యతలు కూడా మీవేనని పార్టీ నేతలకు జగన్ లక్ష్యాన్ని నిర్దేశించారు. వీక్ గా ఉన్న చోట ఎమ్మెల్యే లను బలపరిచే బాధ్యత కూడ మీపైనే ఉందని జగన్ స్పష్టం చేశారు. నెల నెలా నేను ఎమ్మెల్యే లతో మాట్లాడతా.. మీరు వారం వారం రివ్యూ చేసుకోవాలన్నారు.
పార్టీ వీక్‌గా ఉన్న..గత ఎన్నికల్లో ఓడిపోయిన నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి
గత ఎన్నికల్లో ఓడిపోయిన స్థానాల్లో ప్రత్యేక శ్రద్ద పెట్టాలన్న సీఎం, ఈ సారి మాత్రం ఎక్కడా రాజీ పడకుండా వ్యవహరించాలన్నారు. ఇక పై రాబోయే ప్రతి నిమిషం చాలా కీలకమని ,ఇలాంటి పరిస్దితుల్లో పార్టీని,ప్రభుత్వాన్ని ముందుకు నడిపేందుకు అవసరం అయిన అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిదిగా సీఎం జగన్ సూచించారు. గడప గడపకు ధైర్యంగా వెళుతున్నామంటే, మన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలే కీలకమని ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ప్రజల్లో మరింతగా వెళ్ళి ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీ విధివిధానాల పై అవగాహన కల్పించాలన్నారు. నియోజకవర్గ స్దాయిలో పార్టీలో విభేదాలను ఎట్టి పరిస్దితుల్లో ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
ఐ ప్యాక్ టీంతో సమన్వయం చేసుకోవాలని ఆదేశం
ప్రస్తుతం పని చేస్తున్న శాసన సభ్యుడు పని తీరు పై కూడ రిపోర్ట్ తీసుకుంటామని కార్యకర్తల తాను డైరక్ట్‌గా మాట్లాడతానన్నారు. గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం..మరింత సమర్ధవంతంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామని,త్వరలో సోషల్ మీడియా ఇతర అంశాలపై చర్చ జరుగుతుందని సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీకాంత్రెడ్డి తెలిపారు. కష్ట కాలంలో అండగా ఉన్న వారికి సోషల్ మీడియా నిర్వాహకుల తో కూడా చర్చిస్తామన్నారు. భవిష్యత్ లో కూడ సీఎం జగన్ పార్టీ కార్యక్రమాలకు మరింత సమయం కేటాయిస్తారని, ప్రభుత్వం తరపున సమీక్షలు చేస్తున్నట్లే, పార్టీ పరిస్దితులు పై కూడ జగన్ పూర్తిగా వివరాలను తీసుకోవటంతో పాటుగా ఐ ప్యాక్ టీం తో కూడ నిత్యం చర్చిస్తారని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)