అన్వేషించండి

TDP Plan : ఏ మూల చూసినా టీడీపీనే - ప్రజల్లోకి వెళ్లేందుకు చంద్రబాబు పక్కా వ్యూహం !

ఎన్నికలయ్యే వరకూ ఏ మూల చూసినా టీడీపీ కనిపించేలా చంద్రబాబు ప్రచార ప్రణాళిక రెడీ చేసుకున్నారు. వచ్చే ఎనిమిది నెలలు తీరిక లేని కార్యక్రమాలు చేపట్టనున్నారు.


TDP Plan :  అధికారంలో ఉంటే అధికార  బాధ్యతలతో తీరిక లేకుండా ఉంటారు టీడీపీ చీఫ్ చంద్రబాబు. పార్టీని పట్టించుకోరు. అదే అధికారం లేకపోతే పూర్తి సమయం పార్టీ కోసం కేటాయిస్తారు. ఆయన రాజకీయ వ్యూహాల గురించి ఎవరికీ డౌట్స్ ఉండవు. ఘోర పరాజయం ఎదురైనా.. ఏ మాత్రం ఆత్మవిశ్వాసం తగ్గించుకోలేదు. మొదటగా నడక ప్రారంభించారు. తర్వాత జాగింగ్ చేశారు. ఇప్పుడు పరుగు అందకుంటున్నారు. ఎన్నికలకు ఆరేడు నెలల ముందే ఏపీలో ఎటు వైపు చూసినా తెలుగుదేశం పార్టీ జెండాలు కనిపించేలా ప్లాన్ చేసుకున్నారు. మినీ మేనిపెస్టోను ప్రకటించి.. పార్టీ నేతలందర్నీ ఇంటింటికి పంపుతున్నారు. అయితే ఇది ఆరంభమేనని.. ముందు ముందు అసలు ప్రచార భేరీ ఉందని చెబుతున్నారు. వచ్చే ఎనిమిది నెలల పాటు టీడీపీ క్యాడర్ అంతా.. ఓటర్లను అంటిపెట్టుకుని ఉండేలా కార్యక్రమాలను ఖరారు చేస్తున్నారు. ఇందు కోసం గృహసారధులనే వ్యవస్థనూ ఏర్పాటు చేసుకుంటున్నారు. 

ఒకదాని తర్వాత ఒకటి వరస టీడీపీ కార్యక్రమాలు

ఏ తెలుగుదేశం పార్టీ.. ప్రజల్లోకి మరింత విస్తృతంగా వెళ్లేందుకు సరికొత్త కార్యక్రమాలు రూపొందిస్తోంది.  సెప్టెంబర్ 1 నుంచి బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో టీడీపీ కొత్త కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్లనుంది. 45 రోజులపాటు ఈ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగనుంది. ప్రతి ఒక్క ఇన్‌ఛార్జ్‌ ప్రతి ఇంటిని టచ్ చేసేలా కొత్త కార్యక్రమం రూపకల్పన జరిగింది. సెప్టెంబర్ 1 నుంచి వారానికి ఐదు రోజులపాటు ఇందులో పార్టీ అధినేత చంద్రబాబు పాల్గొననున్నారు. ఇప్పటికే బాదుడే బాదుడు- ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాలు పూర్తి చేసిన టీడీపీ.  మహానాడులో ప్రకటించిన మినీ మేనిఫెస్టోని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంపై   విస్తృత స్థాయి సమావేశంలో చంద్రబాబు టీడీపీ నేతలకు దిశానిర్థేశం చేశారు.  

ఓ వైపు లోకేష్ పాదయాత్ర - మరో వైపు చంద్రబాబు పర్యటనలు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు గతంలో వన్ మ్యాన్ ఆర్మీ అన్నట్లుగా వ్యవహరించేవారు.  అంతా ఆయన  భుజాలపై మోసేవారు. ఇతరులకు మోసే సామర్థ్యం ఉన్నా బాధ్యతలు పంచేవారు కాదు. కానీ ఇప్పుడు ఆయన పనితీరులో హఠాత్తుగా మార్పు వచ్చింది.  మొత్తం వ్యవహారాలను వికేంద్రీకిరంచారు. తాను చేయాల్సినవి మాత్రమే తాను చేస్తున్నారు. అందరికీ పని చెప్పారు.   చంద్రబాబు జిల్లాల పర్యటనలు,  లోకేష్ పాదయాత్ర,  మహిళా శక్తి  , ఇసుక సత్యాగ్రహం వంటి కార్యక్రమాలతో ఇలా రాష్ట్రంలో ఏ మూల చూసినా టీడీపీ కార్యక్రమాలే జరుగుతున్నాయా అన్నంతగా తెలుగుదేశం పార్టీ ప్రజల్లోకి వెళ్తోంది. ఒక దాని తర్వాత ఒకటి కాకుండా.. ఒకటి కొనసాగుతూండాగనే మరో ప్రచార కార్యక్రమం ప్లాన్ చేసుకున్నారు. ఎక్కడా గందరగోళం లేకుండా నేతలంతా  ఏదో ఓ కార్యక్రమంలో బిజీ అయ్యేలా ప్రచార కార్యక్రమంలో పాల్గొంటూడటంతో.. టీడీపీ మాత్రమే సీరియస్‌గా రాజకీయాలు చేస్తోందా అన్న అభిప్రాయం కల్పించేలా చేస్తున్నారు.  

పూర్తి స్థాయిలో బయటకు వచ్చిన క్యాడర్ !

గత ఎన్నికల్లో ఓటమి.. ఆ తర్వాత ప్రభుత్వ వేధింపుల కారణంగా  క్యాడర్,లీడర్ చాలా వరకూ సైలైంట్ గా ఉండిపోయారు. వారందర్నీ పూర్తి స్థాయిలో యాక్టివ్ అయ్యేలా చంద్రబాబు చేశారు. వరుసగా ఇన్ని కార్యక్రమాలు చేపడుతూంటే ఏ పార్టీ క్యాడర్ అయినా కాస్త ఆలసిపోతారు. కానీ టీడీపీలో కొత్త ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఊహించని పార్టీ అగ్రనేతలు కష్టపడుతూండటం.. కార్యకరక్తలందరికీ భరోసా ఇస్తూండటంతో అందరూ ధైర్యంగా ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో తమ సహజసిద్ధ నెమ్మదైన స్వభావాన్ని వదిలించుకున్నారు. జనాల్లోకి వెళ్తూంటే.. వైసీపీ నేతుల దాడులు చేస్తున్నారు..భయపడితే అదే  సమస్య అవుతుందని కేసులైనా సరే తిరగబడి కొట్టడం ప్రారంభించారు. ఇపగ్పటి వరకూ ఆత్మరక్షణ ధోరణిలో ఉండేవారు.. ఇప్పుడు ఎదురు దాడి చేస్తున్నారు. ఇవన్నీ టీడీపీ క్యాడర్ పూర్తి స్థాయిలో యాక్టివ్ అవడానికి కారణం అయ్యాయని అనుకోవచ్చు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Team India Meets PM Modi: ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు, ఛాంపియన్స్ తో మోదీ ఛిట్  ఛాట్
ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు, ఛాంపియన్స్ తో మోదీ ఛిట్ ఛాట్
Jagan On Pinnelli Ramakrishna Reddy :   పిన్నెల్లిపై అన్యాయంగా కేసులు పెట్టారు - జగన్ ఆరోపణ -  మాజీ ఎమ్మెల్యేతో ములాఖత్
పిన్నెల్లిపై అన్యాయంగా కేసులు పెట్టారు - జగన్ ఆరోపణ - మాజీ ఎమ్మెల్యేతో ములాఖత్
Warangal NIT Student: వరంగల్ నిట్ విద్యార్థి ఘనత - రూ.88 లక్షల వార్షిక ప్యాకేజీతో కొలువు
వరంగల్ నిట్ విద్యార్థి ఘనత - రూ.88 లక్షల వార్షిక ప్యాకేజీతో కొలువు
Team India with PM Modi: ప్రధాని మోదీతో విశ్వవిజేతలు, స్పెషల్ జెర్సీ చూశారా మీరు
ప్రధాని మోదీతో విశ్వవిజేతలు, స్పెషల్ జెర్సీ చూశారా మీరు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Team India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP DesamRahul Drvaid Recalls Rohit Sharma Phone Call in November | ద్రావిడ్ కు ఫోన్ చేసి రోహిత్ ఏం చెప్పారు?T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP DesamSurya Kumar Yadav Catch Controversy | T20 World Cup 2024| సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై కొత్త అనుమానాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Team India Meets PM Modi: ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు, ఛాంపియన్స్ తో మోదీ ఛిట్  ఛాట్
ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు, ఛాంపియన్స్ తో మోదీ ఛిట్ ఛాట్
Jagan On Pinnelli Ramakrishna Reddy :   పిన్నెల్లిపై అన్యాయంగా కేసులు పెట్టారు - జగన్ ఆరోపణ -  మాజీ ఎమ్మెల్యేతో ములాఖత్
పిన్నెల్లిపై అన్యాయంగా కేసులు పెట్టారు - జగన్ ఆరోపణ - మాజీ ఎమ్మెల్యేతో ములాఖత్
Warangal NIT Student: వరంగల్ నిట్ విద్యార్థి ఘనత - రూ.88 లక్షల వార్షిక ప్యాకేజీతో కొలువు
వరంగల్ నిట్ విద్యార్థి ఘనత - రూ.88 లక్షల వార్షిక ప్యాకేజీతో కొలువు
Team India with PM Modi: ప్రధాని మోదీతో విశ్వవిజేతలు, స్పెషల్ జెర్సీ చూశారా మీరు
ప్రధాని మోదీతో విశ్వవిజేతలు, స్పెషల్ జెర్సీ చూశారా మీరు
Indian 2: హైదరాబాద్‌కు వస్తున్న Bharateeyudu 2 - తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
హైదరాబాద్‌కు వస్తున్న Bharateeyudu 2 - తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
Mysterious Deaths: 'అమ్మో మా ఊరికి దెయ్యం పట్టింది' - గ్రామంలో మిస్టరీ మరణాలతో భయం భయం, ఎవరినీ కదిలించినా అదే కథ!
'అమ్మో మా ఊరికి దెయ్యం పట్టింది' - గ్రామంలో మిస్టరీ మరణాలతో భయం భయం, ఎవరినీ కదిలించినా అదే కథ!
Air Pollution: పొల్యూషన్‌ వల్ల 33 లక్షల మంది మృతి, గాలి పీల్చడం హానికరం అని ప్రకటనలు ఇవ్వాలేమో
పొల్యూషన్‌ వల్ల 33 లక్షల మంది మృతి, గాలి పీల్చడం హానికరం అని ప్రకటనలు ఇవ్వాలేమో
Viral News: దయచేసి క్షమించండి, ఇల్లు గడవక చోరీ చేస్తున్నాను - అంతా కాజేసి లెటర్‌ వదిలి వెళ్లిన దొంగ
దయచేసి క్షమించండి, ఇల్లు గడవక చోరీ చేస్తున్నాను - అంతా కాజేసి లెటర్‌ వదిలి వెళ్లిన దొంగ
Embed widget