అన్వేషించండి

KTR: పేదల ఇళ్లు, కడుపు కొట్టడానికే ముఖ్యమంత్రి అయ్యావా? - సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం

Telangana News: సీఎం రేవంత్ రెడ్డి పేదవారి ఇళ్లు కూల్చారని.. వారి కడుపు కొట్టేందుకే సీఎం అయ్యారా.? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. దివ్యాంగులను రోడ్డు మీద పడేశారన్నారు.

KTR Comments On CM Revanth Reddy: పాలమూరు బిడ్డనని చెప్పుకొనే రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఎందుకు ముఖ్యమంత్రి అయ్యారని.. పేదల కడుపు, ఇళ్లు కొట్టేందుకేనా అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మండిపడ్డారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో (Jadcherla) శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. 'కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు మహబూబ్‌నగర్ పట్టణంలో 4 వేల డబుల్ బెడ్ రూమ్‌లు ఇచ్చాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పట్టాలనే ఆక్రమణలుగా చిత్రీకరించారు. పేదవాళ్లు, దివ్యాంగులు అనే సోయి లేకుండా దయాదాక్షిణ్యం లేకుండా 75 మంది ఇళ్లు కూలగొట్టారు. ఏ కారణంతో వాళ్ల ఇళ్లు కూలగొట్టారో ఈ ప్రభుత్వం సమాధానం చెబుతుందా?. పేదవాళ్లు ఎక్కడైనా తెలియక ఇళ్లు కట్టుకుంటే వారికే రెగ్యులరైజ్ చేసే విధంగా జీవో 58, 59 తెచ్చాం. కానీ మీ ప్రభుత్వం బడికి పోయే పిల్లలు, దివ్యాంగులను రోడ్డు మీద పడేసింది. రేవంత్ రెడ్డికి సంస్కారం ఉంటే పేదల పట్ల ప్రేమ ఉంటే, ఆ 75 మందికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయించాలి. ఏ అధికారులైతే అక్రమంగా పేదల ఇళ్లు కూల్చారో ఆ అధికారులపై చర్యలు తీసుకోవాలి.' అని పేర్కొన్నారు.

'8 లక్షల ఎకరాలకు నీళ్లు'

పాలమూరు జిల్లాలో 8 లక్షల ఎకరాలకు కేసీఆర్ నీళ్లు ఇచ్చారని.. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా అన్ని రిజర్వాయర్లు పూర్తి చేశామని కేటీఆర్ అన్నారు. 95 శాతం పని పూర్తైందని మిగిలిన 5 శాతం పనిని భూసేకరణ చేసి పూర్తి చేయాలని చెప్పారు. అయితే, దానికి సంబంధించిన టెండర్లు కూడా ఈ ప్రభుత్వం రద్దు చేసిందని మండిపడ్డారు. 'పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయట్లేదు. కేసీఆర్‌కు పేరు వస్తుందనే చేయడం లేదా.?. సుంకిశాలలో ప్రమాదానికి కారణమైన మేఘా సంస్థను బ్లాక్ లిస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కొడంగల్ లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్  దాదాపు రూ.4,350 కోట్ల పనులను మేఘా ఇంజినీరింగ్ సంస్థకే ఇచ్చారు. ప్రమాదానికి కారణమైన సంస్థను బ్లాక్ లిస్టులో పెట్టాల్సినప్పటికీ ఆ సంస్థకే పనులు అప్పగించారు. చిల్లర మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డి చెంపలేసుకుని క్షమాపణలు చెప్పాలి. ఏ కంపెనీని ఈస్ట్ ఇండియా అని అన్నారో అదే మేఘా కంపెనీకి పనులు అప్పగిస్తుంటే నీ నైజం, నీ రంగు, నీ నిజాయితీ  ఏంటో ప్రజలకు తెలిసిపోతోంది. పాలమూరు బిడ్డలకు చేతులేత్తి నమస్తారిస్తున్నా. ఎంతోమంది భూములిచ్చి సహకరించటంతోనే ఆ పనులు పూర్తి చేయగలిగాం.' అని వెల్లడించారు.

త్వరలో పాలమూరు సందర్శనకు

మేడిగడ్డకు ఏ విధంగా పార్టీ నాయకులంతా వెళ్లామో పాలమూరు ప్రాజెక్ట్ సందర్శనకు కూడా అలాగే వెళ్తామని కేటీఆర్ తెలిపారు. దీనికి సంబంధించి త్వరలోనే కేసీఆర్ పర్మిషన్ తీసుకొని రెండు రోజుల పర్యటన పెట్టుకుంటామని చెప్పారు. 'పాలమూరులో కేసీఆర్ కట్టించిన రిజర్వాయర్లు, పంప్ హౌస్‌లను ప్రజలకు వివరిస్తాం. కొడంగల్ ప్రాజెక్టుకు పైసలు ఖర్చు చేస్తూ పాలమూరును ఎలా ఎండబెడుతున్నాడో కూడా ప్రజలకు తెలిసేలా చేస్తాం.' అని స్పష్టం చేశారు.

Also Read: HYDRA In Hyderabad: హైడ్రాకు అధికారాలు ఎలా వచ్చాయి? తెలంగాణ హైకోర్టు ఐదు సూటి ప్రశ్నలు ఇవే

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TPCC News: తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
Kumari Aunty: సీఎం సహాయ నిధికి కుమారీ ఆంటీ విరాళం - ఎంత ఇచ్చారంటే?
సీఎం సహాయ నిధికి కుమారీ ఆంటీ విరాళం - ఎంత ఇచ్చారంటే?
CM Revanth Reddy: 'ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించడమే లక్ష్యం' - ఎంఎస్ఎంఈ నూతన పాలసీ విడుదల చేసిన సీఎం
'ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించడమే లక్ష్యం' - ఎంఎస్ఎంఈ నూతన పాలసీ విడుదల చేసిన సీఎం
Telangana High Court: 15 రోజుల్లో బీఆర్‌ఎస్ ఆఫీస్ కూల్చేయండి- అధికారులకు హైకోర్టు ఆదేశం
15 రోజుల్లో బీఆర్‌ఎస్ ఆఫీస్ కూల్చేయండి- అధికారులకు హైకోర్టు ఆదేశం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రాహుల్‌ ఓ టెర్రరిస్ట్ అంటూ కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు, కాంగ్రెస్ ఆందోళనలుదేవర చెన్నై ప్రెస్ మీట్లో జాన్వీ కపూర్ స్పీచ్!దేవర చెన్నై ప్రెస్ మీట్లో జూనియర్ ఎన్టీఆర్ స్పీచ్!దేవర చెన్నై ప్రెస్ మీట్లో అనిరుథ్ రవిచందర్ స్పీచ్!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TPCC News: తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
Kumari Aunty: సీఎం సహాయ నిధికి కుమారీ ఆంటీ విరాళం - ఎంత ఇచ్చారంటే?
సీఎం సహాయ నిధికి కుమారీ ఆంటీ విరాళం - ఎంత ఇచ్చారంటే?
CM Revanth Reddy: 'ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించడమే లక్ష్యం' - ఎంఎస్ఎంఈ నూతన పాలసీ విడుదల చేసిన సీఎం
'ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించడమే లక్ష్యం' - ఎంఎస్ఎంఈ నూతన పాలసీ విడుదల చేసిన సీఎం
Telangana High Court: 15 రోజుల్లో బీఆర్‌ఎస్ ఆఫీస్ కూల్చేయండి- అధికారులకు హైకోర్టు ఆదేశం
15 రోజుల్లో బీఆర్‌ఎస్ ఆఫీస్ కూల్చేయండి- అధికారులకు హైకోర్టు ఆదేశం
One Nation One Election : జమిలీ ఎన్నికల దిశగా కేంద్రం మరో అడుగు - రామ్‌నాథ్ కోవింద్ కమిటీ నివేదికకు ఆమోదం - ఇక ఒక్క అడుగే
జమిలీ ఎన్నికల దిశగా కేంద్రం మరో అడుగు - రామ్‌నాథ్ కోవింద్ కమిటీ నివేదికకు ఆమోదం - ఇక ఒక్క అడుగే
Waqf Amendment Bill: వక్ఫ్‌ ఆస్తులపై వివాదం ఎందుకు, వక్ఫ్‌ అమెండ్‌మెంట్‌ -2024 లక్ష్యాలేంటి ?
వక్ఫ్‌ ఆస్తులపై వివాదం ఎందుకు, వక్ఫ్‌ అమెండ్‌మెంట్‌ -2024 లక్ష్యాలేంటి ?
Eluru News: బాలికలను కట్టేసి లైంగిక దాడి, ఫోటో షూట్లు! గల్స్ హాస్టల్‌లో వార్డెన్ భర్త ఘోరం
బాలికలను కట్టేసి లైంగిక దాడి, ఫోటో షూట్లు! గల్స్ హాస్టల్‌లో వార్డెన్ భర్త ఘోరం
Edible Oil Rates: వంటనూనెలపై గుడ్‌ న్యూస్ రానుందా! కేంద్రం తాజా నిర్ణయం ఏంటీ?
వంటనూనెలపై గుడ్‌ న్యూస్ రానుందా! కేంద్రం తాజా నిర్ణయం ఏంటీ?
Embed widget