అన్వేషించండి

HYDRA In Hyderabad: హైడ్రాకు అధికారాలు ఎలా వచ్చాయి? తెలంగాణ హైకోర్టు ఐదు సూటి ప్రశ్నలు ఇవే

Telangana News | హైడ్రా యాక్షన్ కు రియాక్షన్ హైకోర్టుకు చేరింది. హైడ్రా చట్టబద్దతపై హైకోర్టు ఐదు ప్రశ్నలను సంధించింది. అవి ఏంటో ఈ కథనంలో చూద్దాం

HYDRA News in Telugu | హైడ్రా.. హైడ్రా.. హైడ్రా.... హైదరాబాద్ నగరంలో గత నెల నుంచి హాట్ టాపిక్ గా మారిన అంశం. ప్రభుత్వ భూములు, చెరువులు, సరస్సులు, కుంటలు, నాళాల  ఆక్రమణలను అడ్డుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ హైడ్రా (HYDRA)ను ఏర్పాటు చేసింది. జాతీయ విపత్తుల నిర్వహణ చట్టం ప్రకారం పని చేసేలా  హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ అండ్  మానిటరింగ్ ప్రోటెక్షన్ ను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏర్పాటు చేశారు. ఓఆర్ఆర్ పరిధిలో  2000 చదరపు కిలోమీటర్ల వరకు హైడ్రా పని చేయనుంది.  

జులై 19వ తేదీన ప్రభుత్వం హైడ్రాను జీవో నెంబర్ 99 ద్వారా ఏర్పాటు చేసింది.  హైడ్రాకు అవసరమైన నిధులు, సిబ్బందిని కేటాయించింది. హైడ్రా కమిషనర్ గా సీనియర్ ఐపీఎస్ అధికారి ఏవీ రంగనాథ్ కు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. ఆయన సారధ్యంలోఈ హైడ్రా చెరువు ఆక్రమణల దారులపై కొరడా ఝుళిపించింది.  ఎన్ కన్వెన్షన్ కూల్చివేత సహా అటు కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎం.ఐఎం నేతలు చెరువు ఎఫ్టీఎల్  పరిధిలో, బఫర్ జోన్ పరిధిలో నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చి వేసి  సంచలనం సృష్టించింది.  ఇప్పటి వరకు హైడ్రా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 23 ప్రాంతాల్లో 262 అక్రమ నిర్మాణాలను కూల్చివేసి, 117.2 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది.

హైడ్రా యాక్షన్… హైకోర్టులో రియాక్షన్

నోటీసులు ఇవ్వకుండా  తాము నిర్మించుకున్న కట్టాడాలను అక్రమ నిర్మాణాల పేరుతో ఎలా కూల్చుతారంటూ కొందరు, ఇతర శాఖలు అనుమతి ఇచ్చి ఇళ్లు నిర్మాణానికి సహకరిస్తే, ఇప్పుడు ఇది ఇల్లీగల్ అని ఎలా నేలమట్టం చేస్తారని మరి కొందరు హైడ్రా పని తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదో రాజకీయాస్త్రం అని విపక్షాలు ప్రచారం చేస్తున్నాయి. మా పార్టీ నేతలను టార్గెట్ చేస్తోందని ఓ రాజకీయ పార్టీ అంటే,  ఓ మతం వారినే టార్గెట్ చేసి మరో మతం వారిని వదిలేశారని మరో పార్టీ ఆరోపణ చేస్తోంది. ఇలా రెండు తెలుగు రాష్ట్రాల్లో హైడ్రా ఓ సంచలనంగా మారింది.

హైకోర్టులో హైడ్రా అంశం

కొద్ది మంది  ఏకంగా హైడ్రా ఏర్పాటు ఇల్లీగల్ అంటూ బాల్ ను హైకోర్టులోకి బాల్ నెట్టారు. హైడ్రా  ఏర్పాటుకు జారీ చేసిన జీవో 99 పై స్టే ఇవ్వాలని  కోర్టులో పిటిషన్ వేశారు.  అయితే దీనిపై న్యాయస్థానం స్పందిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం దీనిపై  ఏం చెబుతుందో చూశాక  అప్పుడు నిర్ణయం తీసుకుంటాం .  ఇప్పుడు మాత్రం స్టే ఇవ్వలేమని హైకోర్టు తెల్చి చెప్పింది. ఈ విచారణను అక్టోబర్ 3వ తేదీకి వాయిదా వేసింది.  అయితే విచారణ సందర్భంగా హైకోర్టు ఐదు ప్రశ్నలను ప్రభుత్వానికి సంధించింది.

హైడ్రాపై హైకోర్టు అడిగిన ప్రశ్నలివే..

  1. జీహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం హైడ్రాకు అధికారాలు ఎలా ఇచ్చారో ప్రభుత్వం చెప్పాలి.
  2. జీహెచ్ఎంసీ చట్టానికి విరుద్ధంగా జీవో 99 ఉంది.. దీనికి ప్రభుత్వ సమాధానం ఏంటి.
  3. జీహెచ్ఎంసీ చట్టాల కింద హైడ్రా పని చేయడం చట్ట విరుద్దం కాదా. జీవో నెంబర్ 99 కు ఉన్న చట్టబద్ధత ఏంటి.
  4. హైడ్రాకు సారధ్యం వహించే అధికారి ఐఎఎస్ అధికారి ఉంటారని, అతను సెక్రటరీ స్థాయి సీనియర్ ఐ.ఎఎస్ అధికారని జీవో 99లో పేర్కొన్నారు. అలాంటిది ఐపీఎస్ అధికారికి ఆ బాధ్యతలు ఎలా అప్పగిస్తారు.
  5. నోటీసులు ఇవ్వకుండా, బాధితుల నుంచి వివరణ కోరకుండా హైడ్రా ఎలా అక్రమ కట్టడాలు అని తెల్చి కూల్చివేస్తున్నారు. ఇది చట్ట విరుద్దం కాదా

ఈ ప్రశ్నలను  హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి స్పందించింది.  అక్టోబర్ 3వ తేదీన సమాధానం ఇవ్వాల్సి ఉంది.

హైడ్రా చిక్కుముళ్లపై ప్రభుత్వం కసరత్తు

హైడ్రాపై న్యాయ పరమైన చిక్కులను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. హైడ్రాకు చట్టబద్దత కల్పించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్దమవుతోంది. ఈ నెల 20వ తేదీన రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో  హైడ్రా ఏర్పాటుపై  ఆర్డినెన్స్  తేనుంది.  హైకోర్టు  విచారణ సమయం నాటికి ఆర్డినెన్స్ రూపంలో చట్టం తెచ్చి న్యాయస్థానం ముందు హైడ్రాకు చట్టబద్ధత కల్పించనుంది, ఆ తర్వాత ఆరు నెలల్లో అసెంబ్లీ దీనిపై చట్టం తేనుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇప్పటికే స్పష్టం చేశారు. హైడ్రా ఓ గ్రేహౌండ్స్, టాస్క్ ఫోర్స్  వ్యవస్థలా పని చేస్తుందని చెబుతున్నారు. ఏది ఏమైనా  రానున్న రోజుల్లో చెరువులు,కుంటలు, నాళాల పరిరక్షణకు హైడ్రా  ఏలా పన చేస్తుందో చూడాలి. చిన్న పెద్ద, స్వపక్షం- విపక్షం అని తేడా లేకుండా పని చేస్తుందా.. లేకపోతే  ఇదో రాజకీయాస్త్రం అవుతుందా కూడా వేచి చూడాలి.

మరో కోణంలో ఆలోచించాల్సిన విషయం ఏంటంటే  అన్ని ప్రభుత్వ  శాఖలు అనుమతులు ఇచ్చి బ్యాంకుల నుండి లోన్లు తెచ్చుకుని  అది చెరువుల ఎఫ్.టీఎల్ లో ఉందో బఫర్ జోన్లో ఉందో తెలియక చెరువు భూముల్లో కోట్లు ఖర్చు పెట్టి  ఇళ్లు కొనుక్కున్న బాధితులు ఉన్నారు. నిలువ నీడ కోసం చిన్న గుడిసెలు వేసుకుని ఉంటోన్న పేదలు ఉన్నారు.  ఇలాంటి వారికి ప్రభుత్వం ఏం న్యాయం చేస్తుందా అన్నది కూడా ఓ ప్రశ్నే. లేక్ వ్యూ పేరుతో కోట్లకు విల్లాలు, ఇళ్లు అమ్ముకుని లాభలు జేబుల్లో వేసుకున్న వారికి వేసే శిక్ష ఏంటి... చెరువు భూముల్లో నిర్మించే కట్టడాలకు  అనుమతులు  ఇచ్చిన అధికారులకు వేసే శిక్ష ఏంటి అన్నది కూడా ప్రజల నుండి వస్తోన్న ప్రశ్న. దీనికి ప్రభుత్వం సమాధానం ఇవ్వాల్సి ఉంది.

Also Read: గల్ఫ్ కార్మికుల కోసం గల్ఫ్ సంక్షేమ బోర్డు, వారి కుటుంబానికి రూ.5 లక్షల సాయం!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TPCC News: తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
Kumari Aunty: సీఎం సహాయ నిధికి కుమారీ ఆంటీ విరాళం - ఎంత ఇచ్చారంటే?
సీఎం సహాయ నిధికి కుమారీ ఆంటీ విరాళం - ఎంత ఇచ్చారంటే?
CM Revanth Reddy: 'ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించడమే లక్ష్యం' - ఎంఎస్ఎంఈ నూతన పాలసీ విడుదల చేసిన సీఎం
'ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించడమే లక్ష్యం' - ఎంఎస్ఎంఈ నూతన పాలసీ విడుదల చేసిన సీఎం
Telangana High Court: 15 రోజుల్లో బీఆర్‌ఎస్ ఆఫీస్ కూల్చేయండి- అధికారులకు హైకోర్టు ఆదేశం
15 రోజుల్లో బీఆర్‌ఎస్ ఆఫీస్ కూల్చేయండి- అధికారులకు హైకోర్టు ఆదేశం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

దేవర చెన్నై ప్రెస్ మీట్లో జాన్వీ కపూర్ స్పీచ్!దేవర చెన్నై ప్రెస్ మీట్లో జూనియర్ ఎన్టీఆర్ స్పీచ్!దేవర చెన్నై ప్రెస్ మీట్లో అనిరుథ్ రవిచందర్ స్పీచ్!Pawan Kalyan World Record | ఏపీ పంచాయతీరాజ్ శాఖ ప్రపంచ రికార్డు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TPCC News: తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
Kumari Aunty: సీఎం సహాయ నిధికి కుమారీ ఆంటీ విరాళం - ఎంత ఇచ్చారంటే?
సీఎం సహాయ నిధికి కుమారీ ఆంటీ విరాళం - ఎంత ఇచ్చారంటే?
CM Revanth Reddy: 'ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించడమే లక్ష్యం' - ఎంఎస్ఎంఈ నూతన పాలసీ విడుదల చేసిన సీఎం
'ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించడమే లక్ష్యం' - ఎంఎస్ఎంఈ నూతన పాలసీ విడుదల చేసిన సీఎం
Telangana High Court: 15 రోజుల్లో బీఆర్‌ఎస్ ఆఫీస్ కూల్చేయండి- అధికారులకు హైకోర్టు ఆదేశం
15 రోజుల్లో బీఆర్‌ఎస్ ఆఫీస్ కూల్చేయండి- అధికారులకు హైకోర్టు ఆదేశం
One Nation One Election : జమిలీ ఎన్నికల దిశగా కేంద్రం మరో అడుగు - రామ్‌నాథ్ కోవింద్ కమిటీ నివేదికకు ఆమోదం - ఇక ఒక్క అడుగే
జమిలీ ఎన్నికల దిశగా కేంద్రం మరో అడుగు - రామ్‌నాథ్ కోవింద్ కమిటీ నివేదికకు ఆమోదం - ఇక ఒక్క అడుగే
Waqf Amendment Bill: వక్ఫ్‌ ఆస్తులపై వివాదం ఎందుకు, వక్ఫ్‌ అమెండ్‌మెంట్‌ -2024 లక్ష్యాలేంటి ?
వక్ఫ్‌ ఆస్తులపై వివాదం ఎందుకు, వక్ఫ్‌ అమెండ్‌మెంట్‌ -2024 లక్ష్యాలేంటి ?
Eluru News: బాలికలను కట్టేసి లైంగిక దాడి, ఫోటో షూట్లు! గల్స్ హాస్టల్‌లో వార్డెన్ భర్త ఘోరం
బాలికలను కట్టేసి లైంగిక దాడి, ఫోటో షూట్లు! గల్స్ హాస్టల్‌లో వార్డెన్ భర్త ఘోరం
Edible Oil Rates: వంటనూనెలపై గుడ్‌ న్యూస్ రానుందా! కేంద్రం తాజా నిర్ణయం ఏంటీ?
వంటనూనెలపై గుడ్‌ న్యూస్ రానుందా! కేంద్రం తాజా నిర్ణయం ఏంటీ?
Embed widget