Telangana Congress And BRS: బీఆర్ఎస్ వైఫల్యమే కాంగ్రెస్‌కు బలం- ఇన్ని సమస్యలు వెంటాడుతున్నా రేవంత్ బిందాస్ !
Telangana BRS: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై వ్యతిరేకత పెరుగుతోందని బీఆర్ఎస్ నేతలంటున్నారు. అయితే మరి ఆ వ్యతిరేకతను తమకు అనుకూలంగా ఆ పార్టీ మార్చుకోగలుగుతోందా ?

BRS unable take advantage failures of the Telangana Congress government: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సమస్యల్లో ఉంది. ప్రజా సమస్యలను పరిష్కరిచడంలో అనేక సమస్యలు ఎదుర్కోంటోంది. ఫీజు రీయింబర్స్‌మెంట్, గ్రూప్-1 రిక్రూట్‌మెంట్, యూరియా కొరత, బీసీ రిజర్వేషన్, పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల ఇష్యూ వంటి సమస్యలు ప్రభుత్వాన్ని వెంటాడుతున్నాయి. ఈ సమస్యలు విద్యార్థులు, ఉద్యోగార్థులు, రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అయితే వారి కోసం పోరాడి వారి మద్దతు పొందాల్సిన ప్రతిపక్షం బీఆర్ఎస్ మాత్రం సైలెంట్ గా ఉంటోంది. రాజకీయ అంశాలపై మాత్రమే ప్రకటనలు చేస్తోంది. ప్రజా సమస్యలపై స్పందించడం మానేసింది.
కాంగ్రెస్ సర్కార్ ను చుట్టుముడుతున్న సమస్యలు
తెలంగాణలో SC, ST, BC, EBC, మైనారిటీ విద్యార్థులకు అందించే రీయింబర్స్‌మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ పథకానికి సుమారు రూ.8,000 నుండి 10,000 కోట్ల డ్యూస్ చెల్లించలేదు. దీంతో ప్రైవేట్ డిగ్రీ, PG, ఇంజనీరింగ్ కాలేజీల అసోసియేషన్లు కాలేజీలు మూసివేస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. మరో వైపు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGSPSC) గ్రూప్-1 పరీక్షల్లో ప్రొసీజరల్ ఇర్రెగ్యులారిటీలు , వాల్యుయేషన్ ఎర్రర్స్ కారణంగా తెలంగాణ హైకోర్టు సెప్టెంబర్ 9, 2025న మెయిన్స్ రిజల్ట్స్ , జనరల్ ర్యాంకింగ్ లిస్ట్‌ను క్యాన్సిల్ చేసింది. 2024 ఫిబ్రవరి నోటిఫికేషన్‌లో 563 పోస్టులకు ప్రిలిమ్స్ పూర్తి చేసిన అభ్యర్థుల మెయిన్స్ ఆన్సర్ షీట్లను మాన్యువల్‌గా రీ-ఎవాల్యుయేట్ చేయాలని ఆదేశించింది.దీనిపై నిరుద్యోగుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.
యూరియా కొరతతో రైతులకు ఇబ్బందులు
2025 ఖరీఫ్ సీజన్‌లో తెలంగాణలో యూరియా కొరత తీవ్ర సమస్యగా మారింది.ఎక్కడ చూసినా రైతుల క్యూలు కనిపిస్తున్నాయి. రైతులకు సరైన సమాచారం ఇవ్వడంలోనూ ప్రభుత్వం విఫలమయింది. తెలంగాణలో బ్యాక్‌వర్డ్ క్లాసెస్ కోసం 42% రిజర్వేషన్ కూడా సమస్యగా మారింది. కామారెడ్డి డిక్లరేషన్ లో రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చారు.కానీ ఇప్పుడు ఆ హామీని నెరవేర్చలేకపోతున్నారు. ఇక BRS ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వచ్చిన అంశంలోనూ ప్రభుత్వం ఇక్కట్లు పడుతోంది. స్పీకర్ అక్టోబర్ 31లోపు నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. మేము BRSలోనే ఉన్నాం, కాంగ్రెస్‌లో జాయిన్ కాలేదు అని ఎమ్మెల్యేలంటున్నారు. అయితే ప్రజల్ని ఎలా మోసం చేస్తారని బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది.
బీఆర్ఎస్ పోరాటాలు ఎక్కడ?
సహజంగా కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత పెరిగితే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్, కేసీఆర్‌కు అనుకూలతగా మారాలి. కానీ ప్రస్తుతం బీఆరెస్ పార్టీ పై కానీ, కేసీఆర్ పై కానీ అంతగా సానుకూలత రావడం లేదన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది. దీనికి కారణం ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ పోరాటం చేయకపోవడమే. ఇటీవల జగదీష్ రెడ్డి కూడా ఇదే చెప్పారు. తాము ఇంకా ప్రతిపక్ష పాత్ర పోషించడం లేదన్నారు. కాంగ్రెస్ కు ఉన్న ఇలాంటి పరిస్థితిని బీఆర్ఎస్ ఇంకా పూర్తి స్థాయిలో పొలిటికల్ గా బలపడేందుకు ఉపయోగించుకోలేకపోతున్నారు. దానికి కారణం పార్టీ అధ్యక్షుడు ఇంకా బయటకు రాకపోవడం అనుకోవచ్చు. భారత రాష్ట్ర సమితి పదేళ్ల పాటు తిరుగులేని అధికారం అనుభవించిది. తమ చేతి నుంచి జారిపోదనుకున్న అధికారం జారిపోవడంతో నిరాశ నిస్ప్రహలకు గురైంది. ఇప్పటికీ తేరుకుంటున్న సూచనలు కనిపించడం లేదు. కుటుంబంలో ఎర్పడిన కలహాలు.. కేసీఆర్ ఇంకా బయటకు రాకపోవడం వంటి కారణాలతో బీఆర్ఎస్ నేరుగా ప్రజాభిమానాన్ని పొందలేకపోతోంది. ఇప్పుడు బీఆర్ఎస్ ను కేటీఆర్ నడుపుతున్నారు. అందుకే బీఆర్ఎస్ ప్రతిపక్ష పాత్ర కొత్తగా పోషిస్తోంది. కొత్త మార్గంలో వెళ్తోంది. ఎక్కువగా సోషల్ మీడియాపై దృష్టి కేంద్రీకరిస్తోంది.ఫలితంగా అనుకున్నంత ఎఫెక్ట్ రావడం లేదు.





















