విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మాణం జరుగుతున్న ఈ విమానాశ్రయం 2026 జూన్ నాటికి పూర్తి కానుంది. ఇప్పటికే 84% పనులు పూర్తయ్యాయి,



విమానాశ్రయం 2,203 ఎకరాల్లో నిర్మాణం జరుగుతోంది, అదనంగా 500 ఎకరాలు ఇతర అవసరాల కోసం కేటాయించారు.



మొదటి దశలో రూ.4,592 కోట్లతో నిర్మాణం జరుగుతోంది. మొత్తం ప్రాజెక్టు వ్యయం సుమారు రూ.5,000 కోట్ల వరకు ఉంటుందని అంచనా.



రెండు రన్‌వేలు (ఒక్కొక్కటి 3.8 కి.మీ. పొడవు) మరియు 81,000 చదరపు మీటర్ల విస్తీర్ణంతో టెర్మినల్ బిల్డింగ్.22 ఏరో బ్రిడ్జ్‌లు



ప్రారంభంలో ఏటా 60 లక్షల మంది ప్రయాణికులను హ్యాండిల్ చేసే సామర్థ్యం ఉంటుంది, తదనంతరం దీనిని 4 కోట్లకు పెంచాలనే లక్ష్యం ఉంది.



విశాఖపట్నం నుంచి 45 నిమిషాల్లో భోగాపురం చేరుకునేలా బీచ్ కారిడార్ నిర్మాణం జరుగుతోంది. రూ.2,800 కోట్లతో ఈ కారిడార్‌కు డీపీఆర్ సిద్ధమైంది.



విమానాశ్రయానికి అనుబంధంగా 15 అంతర్గత రోడ్లను 4 లైన్ల రహదారులుగా విస్తరించేందుకు రూ.390 కోట్లు కేటాయించారు.



విశాఖలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు నాలుగు ఎలివేటెడ్ కారిడార్లు రూ.1,600 కోట్లతో నిర్మాణం



విమానాశ్రయం పూర్తయితే ప్రత్యక్షంగా, పరోక్షంగా 6 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. భూములు ఇచ్చిన రైతులకు ఉపాధిలో ప్రాధాన్యత



విమానాశ్రయంలో ఉత్తరాంధ్ర సంప్రదాయాలను ప్రతిబింబించే కళానిలయం ఏర్పాటు. విమానాశ్రయ నిర్మాణంలో రామ్మోహన్ నాయుు డు ప్రత్యేక శ్రద్ధ