ఏపీలో కొలువుదీరిన వినూత్న గణనాథులు బొరివంక గ్రామంలో ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది సైతం పర్యావరణ అనుకూలమైన గణనాథుడు ఉద్దానం యూత్ క్లబ్ ఆధ్వర్యంలో పర్యావరణ హిత గణపయ్యను ఏర్పాటు చేశారు సుమారుగా 20 ఏళ్లగా గ్రీన్ గణేష్ లను ఏర్పాటు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు వినాయక చవితి వచ్చిందంటే చాలు ఏపీ ప్రజలు శ్రీకాకుళం జిల్లాలో బొరి వంకలో వినాయకుడిపై చర్చిస్తారు ఈసారి పెసరనారు గణపతితో పాటు ఒక రైతు తోటలో కర్ర పెండలం వినాయకుని రూపంలో దర్శనం ఇచ్చింది స్థానికులు వినాయకుని రూపంలో ఉన్న ఆ కర్ర పెండలాన్ని ప్రాణ ప్రతిష్ట చేసి పూజలు చేస్తున్నారు ఏపీలో వినూత్నంగా ఎకో ఫ్రెండ్లీ గణనాథుల్ని పూజిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నది ఉద్దానం యూత్ క్లబ్ గ్రీన్ గణేష్ లను ఏర్పాటు చేయడంపై బొరివంక గ్రామస్తులను పలువురు అభినందిస్తున్నారు